Dzisiaj jest niedziela, 23 listopada 2008 r. 328 dzien roku
Languages:ar | id | bg | ca | ceb | cs | da | de | et | en | es | eo | fr | he | hr | it | ko | lt | hu | nl | ja | no | pl | pt | ru | ro | sk | sl | sr | fi | sv | te | tr | uk | zh






REKLAMA
mp3

పోడూరు

వికీపీడియా నుండి

  ?పోడూరు మండలం
పశ్చిమ గోదావరి • ఆంధ్ర ప్రదేశ్
పశ్చిమ గోదావరి జిల్లా పటములో పోడూరు మండలం యొక్క స్థానము
పశ్చిమ గోదావరి జిల్లా పటములో పోడూరు మండలం యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: (అక్షాంశరేఖాంశాలు కనుక్కోండి)
టైం జోన్ భాప్రాకా (గ్రీ.కా+5:30)
ముఖ్య పట్టణము పోడూరు
జిల్లా(లు) పశ్చిమ గోదావరి
గ్రామాలు 14
జనాభా
• మగ
• ఆడ
అక్షరాశ్యత శాతం
• మగ
• ఆడ
66.56 (2001)
• 33.337
• 33.223
• 74.06
• 80.05
• 68.07


పోడూరు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఒక మండలము మరియు గ్రామము. పోడూరు చక్కని ప్రకృతి అందాలతో సమృద్ది గలిగిన పంట పొలాలతోనూ అభివృద్దిలో ఉన్న గ్రామము.;వెండితెర వెలుగులో పోడూరు అందాలు. పల్లె అందాలు.. ప్రకృతి రమణీయత.. పోడూరులో సినిమా షూటింగులకు సహజసిద్ధమైన హంగులను సమకూరుస్తున్నాయి. 1976 నుంచి ఈ గ్రామంలో తెలుగు సినిమా షూటింగులు చేపడుతున్నారు.. దర్శకులలో ప్రసిద్దులైన కోడి రామకృష్ణ, దాసరి నారాయణరావుల అధిక సినిమాలు ఇక్కడ చిత్రీకరణ జరుపుకొన్నవి. షూటింగ్ చేసుకొనేందుకు అన్ని సౌకర్యాలు,వసతి అందుబాటులో ఉండుటవలన నిరంతరం ఏదో ఒక షూటింగ్‌తో ప్రస్తుతం పోడూరు షూటింగ్ స్పాట్‌గా మారిపోయింది.

విషయ సూచిక

[మార్చు] గ్రామ చరిత్ర

మూలేశ్వర,రాజేశ్వర,కేశవస్వామివార్ల దేవాలయాలు,పోడూరు.

ఈ ప్రదేశమున మొదట అడవి ఉండేది అడవిని చదును చేసి పోడు వ్యవసాయము చేయుచూ ఈ ప్రాంతమును పోడు అని పిలిచేవారు. కొంతకాలమునకు మెల్లగా మరికొంత భాగము చదును చేసి నివాసయోగ్యముగా మార్చుకొని మరికొంత ఊరు పెరిగిన తరువాత'పోడు'కు ఊరు చేర్చి పోడు ఊరుగా పిలువుట మొదలు పెట్టారు. అదే కాలానుగుణంగా పోడూరుగా మార్పుచెంది స్థిరపడినది. ఇప్పటికీ మొదటగా వచ్చి ఇక్కడ స్థిరపడిన కుటుంబాలవారి యొక్క ఇంటి పేరు పోడూరు గానే ఉన్నది. పోడూరు సౌకర్యాల పరంగా చాలా వెనుకబడి ప్రజలు ఇబ్బంది పడుతుండటంతో గ్రామ అభివృద్ది కోసం 1901వ సంవత్సరంలో గ్రామ అభివృద్ది సేవా కేంద్రం ఏర్పడింది. దీని ద్వారా కొన్ని నిధులను సేకరించి ఊరి రహదారులను మరియు ఇతర సౌకర్యాలను అభివృద్ది పరుచుట మొదలు పెట్టారు. 1929వ సంవత్సరం బ్రిటిష్ పాలకుల ద్వారా పోడూరు గ్రామపంచాయితీ ఏర్పడింది. తదుపరి అది మరింత అభివృద్ది చెందినది. ప్రస్తుతము రెండు అంతస్తుల భవనము మరియు పదిహేనుమంది సిబ్బందితో గ్రామానికి సేవలందించుచున్నది.


[మార్చు] ఊరి ముఖ్య దేవాలయములు

[మార్చు] పెద్దగుడి

ఊరి మద్యస్థంగా ఒకే చోట ఐదు దేవస్థానములు కలిగిన పెద్ద ప్రాంగణమును పెద్దగుడి అని పిలుస్తారు. ఈ ప్రాంగణమున

  • శ్రీ మూలేశ్వరస్వామి దేవాలయం (శివాలయము),
  • శ్రీ రాజేశ్వరస్వామి దేవాలయం (పురాతన శివాలయము),
  • శ్రీ కేశవస్వామి దేవాలయం (విష్ణాలయము),
  • శ్రీ రామచంద్రస్వామి దేవాలయం,
  • శ్రీ వెంకటేశ్వరస్వామి అలమేము మంగ వార్ల దేవాలయము.
  • శ్రీ రామాలయములు కలవు.

ఈ దేవాలయము అతిపెద్ద కైవారము కలిగి ముందుభాగమున సాంస్కృతిక కార్యక్రమాల కొరకు విశాలమైన చావడి కలిగి ఉన్నది. దేవాలయాలకు ఉత్తరాన స్వామివార్ల రోజువారీ పూజాదులకు కావలసిన పుష్పాలు, పత్రి కొరకు పెద్ద ఉద్యాన వనము కలదు. ఈ వనమున మారేడు, బిల్వ, జమ్మి, మామిడి, అరటితోడి అన్ని రకాల వృక్ష సముదాయము కలవు. ఈ దేవాలయమున ప్రతి సంవత్సరము ఆరు రోజుల పాటు విశేషమైన ఉత్స్వాలు నిర్వహిస్తారు.

వీరభధ్రస్వామి దేవస్థానము. సర్లదొడ్డి.
పెద్దగుడిలో వెంకటేశ్వరస్వామి దేవాలయము.

[మార్చు] వేరువేరుగా ఉన్న వాటిలో ప్రసిద్ది చెందిన దేవస్థానములు.

  • శ్రీ కనకదుర్గ దేవాలయం. (కవిటం మార్గములో)
  • శ్రీ షిరిడీ సాయిబాబా దేవాలయం (తిరుమలతిరుపతి కళ్యాణమండపము వద్ద)
  • శ్రీ వీరభద్రస్వామి దేవాలయం (సరలదొడ్డి)
  • శ్రీ అయ్యప్ప దేవాలయము (బోర్డుస్కూలువద్ద)
  • గీతా భవనము.

ఇది ప్రత్యేకమైన ఆధ్యాత్మిక దేవాలయము. గీతోపదేశము చేయు శ్రీకృష్ణుని మరియు అర్జునుని రధము, అశ్వాల మొత్తం చిత్రాన్ని పాలరాతితో అత్యద్భుతముగా మలచిన విధానము ఇక్కడ చూడచ్చు. మెట్ల మాదిరి కట్టడముపై అన్ని దేవతాప్రతిమలు కలవు.

[మార్చు] ప్రతి వీది నందుకల దేవాలయములు.

1.కాపులరామాలయం (సరలదొడ్డి), 2.పల్లపువీది రామాలయం, 3.కొత్తపేట రామాలయం, 4.సంతబజారు రామాలయం, 5.ఇటికలదిబ్బ రామాలయం, 6.గరగలమ్మగుడివద్ద కాపులరామాలయం, 7.చాకలి పేట రామాలయం, 8.చింతలతోట రామాలయం.
1.వేమవరం రోడ్డులో, 2.ఛింతలతోట, 3.పల్లపువీది, 4.వెలగలమ్మ చెరువు, 5.ఇటికలదిబ్బ, 6.గరగలమ్మగుడి{రామారావుకొట్టువైపు}, 7.చాకలిపేట.
1.వెలగలమ్మ చెర్వువద్ద , 2.సినిమాహాలుసెంటరు వద్దా, 3.చాకలిపేటలోనూ.
1.గరగలమ్మ గుడి (గ్రామ మధ్యలో ఉండి ఊరి వ్యాపారుల అధీనంలో ప్రత్యేకంగా అభివృద్ది చెందిన దేవాలయము), 2.వెలగలమ్మ దేవాలయము, 3.మహలక్షమ్మ దేవాలయము (చింతలతోట), 4. పుంతల ముసలమ్మ దేవాలయము

[మార్చు] విద్యా సౌకర్యాలు

కల్నల్.డి.యస్.రాజు.పరిషత్ ఉన్నత పాఠశాల.
కల్నల్.డి.యస్.రాజు.పరిషత్ ఉన్నత పాఠశాల. పోడూరు

జిల్లాలోని మంచి వసతులు,అందమైన భవనాలు కలిగిన పాఠశాలల్లో పోడూరు ప్రధమస్థానములో ఉంటుంది. "L" షేపులో పొడవుగా ఉంటుంది.

  • విధ్యార్దులు ఆడుకొనేందుకు దాదాపు రెండు ఎకరాల మేర క్రీడా స్థలము కలదు. రెండు దీనిలో టెన్నిస్ కోర్టులు, రెండు బాస్కెట్ బాల్ కోర్టులు, రెండు వాలీబాల్ కోర్టులు, లాంగ్ జంప్ హైజంప్ కొరకు ఒక ఇసుక కోర్టులు కలవు.
  • మరొక ఎకరం స్థలంలో విధ్యార్ధుల, ఉపాద్యాయుల వాహనాల కొరకు పొడవైన సైకిల్స్ స్టాండు కలదు.
  • పాఠశాల వెనుక వృత్తి విద్యాశిక్షణ కొరకు పెంచబడిన పొడవైన ఉద్యానవనము.
  • వృత్తి విద్యలో మరొకటి అయిన విధ్యుత్ఉపకరణాల తయారీ రిపేరీ కొరకు సౌకర్యాలు కలిగిన హాలు.
  • కంప్యూటరు తరగతుల కోసం పది కంప్యూటర్లు కలిగిన విశాలమైన మరొక హాలు.
  • ఒక గదిలో సామాన్య పుస్తకాలు, వార్తాపత్రికలతో చిన్న గ్రంధాలయం.
  • చిత్రలేఖనాశక్తి కల విద్యార్ధుల కొరకు డ్రాయింగ్ పరికరాలు కలిగిన డ్రాయింగ్ రూమ్. తదితర సౌకర్యాలు కలవు.

ఈ పాఠశాలయందు ఆరవ తరగతి నుండి పదవ తరగతి వరకూ విద్యా బోధన జరుగుతుంది.

కల్నల్.డి.యస్.రాజు.పాలిటెక్నిక్ కాలేజి.
కల్నల్.డి.యస్.రాజు.పాలిటెక్నిక్.పోడూరు

ఈ కాలేజీ వలన ఎందరో విద్యార్ధులకు తక్కువ ఖర్చుతో విద్యను గడించే అవకాశం కలుగుతున్నది. కాలేజి గ్రామమునందు ఉండుట వలన ఇళ్ళ అద్దె తక్కువగా సరుకుల సౌకర్యాల ఖర్చులు తక్కువగా అయ్యే వీలుకలుగును. కాలేజీ విశాల ప్రాంగణము కలిగి ఉన్నది. విద్యార్ధులు ఆడుకొనేందుకు పెద్ద క్రీడాస్థలము కలదు. అత్యాధునిక సౌకర్యాలు, వస్తు సముదాయము కలిగిన ప్రయోగశాల కాలేజీలో కలదు.

[మార్చు] గ్రంధాలయాలు

శ్రీ రామచంద్ర గ్రంథాలయము.

1870 లో స్థాపించబడిన ఈ గ్రంథాలయము జిల్లాలోనే అతి పెద్ద గ్రంధాలయము. మొదట చిన్న తాటాకు పాకలో మొదలైన ఈ గ్రంధాలయము నేడు రెండు అంతస్తులుగా కలిగి ఒకేసారి రెండువందలమంది చదువుకోగల సౌకర్యాలు కలిగిన గ్రంధాలయముగా మార్పు చెందినది. ఇది కాదు అది అని కాకుండా...తెలుగు బాషలో ప్రచురించబడే ప్రతి పత్రికా (దిన, పంచ, వార, పక్ష, మాస) ఇక్కడ చూడగలం. ప్రసిద్ద గ్రంధాలనుండి సామాన్య రచయితల నవలల వరకూ అన్నీ ఇక్కడ ఉంటాయి.

ప్రభుత్వ గ్రంధాలయము.

ప్రభుత్వము వారిచే నడుపబడు గ్రంధాలయము.

బాలసంఘ గ్రంధాలయము.

విధ్యార్దుల,చిన్న పిల్లల కొరకు స్థాపించిన బాలసంఘములో కల చిన్న గ్రంధాలయము. ఇక్కడ బాల సాహిత్యము అనదగిన అన్ని పుస్తాకాలు లభ్యమగును. బాలలు ఆడుకొనుచూ చదువుకొనే ఇతర సౌకర్యాలు ఇక్కడ కలవు.

గీతాభవనము

ఇది దేవస్థానముగానూ గ్రంధాలయముగానూ ఉంటుంది. ఇక్కడ ఆధ్యాత్మిక రచనలు అన్నీ లభ్యమగును.

[మార్చు] జల వనరులు

పోడూరు ప్రధాన కాలువ,చెరువు

[మార్చు] కాలువలు.

ఊరికి ముఖ్యముగా మూడు ప్రధాన కాలువలు కలవు. ఊరికి మధ్యగా ప్రవహించే మంచినీటి కాలువ. ఊరి ప్రక్కగా ప్రవహిస్తూ మురుగుకాల్వలో కలిసే పంటకాలువ.ఊరికి చివరగా ప్రవహిస్తూ చివరికి నక్కల కాలువ లో కలిసే మురుగు కాలువ.

[మార్చు] చెరువులు

ఊరిలో ప్రధాన చెరువులు

  • భాల సంఘం చెరువు. పైపుల చెరువు(స్కూలు దగ్గర కలది). రాయిగొప్పు చెరువు.

[మార్చు] ఇతర సౌకర్యాలు

పోడూరు గ్రామ స్వతంత్ర సమరయోదుల జ్ఞాపకస్తూపం

మండల కార్యాలయమునకు సమీపాన కలదు. ఇరవై మంది జవాన్లు, ఒక సర్కిలు ఈ స్టేషనులో పని చేస్తున్నారు.

  • ప్రయాణీకుల విశ్రాంతి మందిరాలు (బస్టాండ్స్)

పంచాయితీ కార్యాలయపు రోడ్డులో ఒకటి కొత్తది, మరియు మరొకటి పాతది కలవు. ఇవే కాక సినిమా హాలు సెంటర్ నందు ఒకటి, గవర్నమెంట్ ఆరోగ్యకేంద్రము వద్ద ఒకటి కలవు.

  • ఈ సేవాకేంద్రము.

మండల కేంద్ర భవనమునకు దగ్గరగా ఈ కేంద్రము నలుగురు ఉధ్యోగులతో ప్రారంభించబడినది.

  • కళ్యాణ మండపాలు.
1.తిరుమల తిరుపతి కళ్యాణ మండపము. 2.ఆర్యవైశ్య కళ్యాణ మండపము. 3.ప్రభుత్వ వసతి గృహములు కలవు.
  • బ్యాంకులు.
1 ఇండియన్ బ్యాంకు. 2.సహకార పరపతి భ్యాంకులు కలవు.
  • గ్రామ కచేరీ.

బస్టాండ్ సెంటరులో కలదు.


పోడూరుకున్న మరో ప్రత్యేకత అభివృద్ది. ఊరి ప్రముఖుల వలన ఊరిలో అన్ని వసతులు ఏర్పడ్డాయి. 2006 సంవత్సరంలో పది లక్షలతో ఏర్పాటయిన వాటర్ ఫిల్టరేషన్ ప్లాంట్ వలన ఊరి ప్రజలు కలుషితం లేని మంచి నీళ్ళు తాగగలుగుతున్నారు. అన్ని కాలాలలోనూ నీరుండే రెండు పెద్ద మంచినీటి చెరువులు, రెండు బోర్డు పాటశాలలు, అన్ని వసతులు కలిగి నాలుగు ఎకరాల విస్తీర్ణంలో అతి పెద్ద హైస్కూలు, పాలిటెక్నిక్ కాలేజి, రెండు బస్టాండ్లు, పోలీస్ స్టేషన్ ,ఈ సేవా కేంద్రము తదితరములతో అభివృద్ది పధములో ప్రయాణించుచున్నది.

[మార్చు] ఊరిలో ప్రముఖులు

మండల కార్యాలయము వద్ద తాతరాజు గారి కాంశ్య విగ్రహము
మెయిన్ రోడ్డులో కాలేజీ,హైస్కూలుల మద్య కల రాజు గారి కాంశ్య విగ్రహము
  • డాక్టర్ కల్నల్.డి,యస్,రాజు గారు.(ప్రముఖ స్వాతంత్రోజ్యమకారులు) (పూర్తి వ్యాసము కొరకు చూడండి. దాట్ల సత్యనారాయణ రాజు)
  • రుద్రరాజు సూర్యనారాయణ్రాజు{తాతరాజు}: పోడూరు అభివృద్దిలో కీలక పాత్ర పోషించి తాతరాజుగా ప్రసిద్ధి చెందినవ్యక్తి. పాఠశాలలకు, వైధ్యశాలలకు,సామాజిక సేవా కేంద్రాలకు, విరాళములిచ్చి ఎన్నో నిర్మాణాలలో ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొని వాటిని నడిపించారు. ఊరి ప్రజలు ఈయన సంస్మరణార్ధం వారి యొక్క కాంశ్యవిగ్రహమును పోడూరు మండల కార్యాలయ ఆవరణయందు ఏర్పాటు చేసిరి.
  • డాక్టర్ పోడూరి రామారావు: పోడూరులో 'ఓస్లర్ హాస్పిటల్' ప్రారంభించాడు. పేదవారికి ఉచిత వైద్య సహాయం ఇక్కడ అందించబడుతుంది. అనంతరం డాక్టర్ పోడూరి కృష్ణమూర్తి అధ్వర్యంలో ఇది నడుస్తున్నది.

[మార్చు] మండలంలో గ్రామాలు

[మార్చు] బయటి లింకులు


"http://te.wikipedia.org/wiki/%E0%B0%AA%E0%B1%8B%E0%B0%A1%E0%B1%82%E0%B0%B0%E0%B1%81" నుండి వెలికితీశారు

Polska, Dolar, Forex


Wikipedia jest zarejestrowanym znakiem towarowym Wikimedia Foundation
Wszystkie materiay pochodz z Wikipedii, obite s licencj GNU Free Documentation License