Dzisiaj jest niedziela, 23 listopada 2008 r. 328 dzien roku
Languages:ar | id | bg | ca | ceb | cs | da | de | et | en | es | eo | fr | he | hr | it | ko | lt | hu | nl | ja | no | pl | pt | ru | ro | sk | sl | sr | fi | sv | te | tr | uk | zh






REKLAMA
mp3

పుల్లారెడ్డి నేతి మిఠాయిలు

వికీపీడియా నుండి

హైదరాబాదులోని అబిడ్స్ నందలి పుల్లారెడ్డి స్వీట్స్ షాపు

పుల్లారెడ్డి నేతి మిఠాయిలు, ఆంధ్ర ప్రదేశ్‌లో హైదరాబాదు, కర్నూలు నగరాలలో ఉన్న ఒక మిఠాయి దుకాణాల సమూహం. ఇది వాణిజ్య సంస్థ అయినా గాని, రాష్ట్రంలో పొందిన ప్రాచుర్యం వల్ల విశిష్టమైన స్థానం సంపాదించుకొంది. ఉదాహరణకు సింహాద్రి సినిమాలో ఒక పాటలో "నీ అధరామృతం పుల్లారెడ్డీ, అర కేజీ అప్పుగ ఇస్తే కడతా వడ్డీ మీద వడ్డీ" అని వస్తుంది.

[మార్చు] వ్యవస్థాపకుడు

జి. పుల్లారెడ్డి, కర్నూలు జిల్లా గోకవరం గ్రామానికి చెందినవాడు. 1948లో కర్నూలులో మిఠాయిల దుకాణాన్ని ప్రాంభించాడు. నాఙ్యతకు మంచి పేరు వచ్చి, వ్యాపారం అభివృద్ధి చెందినాక హైదరాబాదు నగరంలో బ్రాంచి మొదలుపెట్టాడు. పుల్లారెడ్డి అనేక విద్యా, సాంఘిక కార్యక్రమాలలో పాల్గొన్నాడు. అలా స్థాపించిన సంస్థలలో ఒకటి "జి. పుల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజి", కర్నూలు.

ఇతను 2007 మే 9న, తన 88వ యేట, మరణించాడు.

[మార్చు] మిఠాయి దుకాణాలు

పుల్లారెడ్డి మిఠాయి దుకాణాలలో కోవా, బూందీ లడ్డు ప్రసిద్ధమైనవి. హైదరాబాదు నగరంలో ఉన్న బ్రాంచీలు - బేగంపేట, చార్మినార్, పంజగుట్ట, యాబిడ్స్, కూకట్‌పల్లి. విదేశాలలో ఉన్న ఆంధ్రులకు కూడా బహుమతిగా ఇక్కడినుండి మిఠాయిలు పంపే సదుపాయం ఉంది.

[మార్చు] బయటి లింకులు


.


Polska, Dolar, Forex


Wikipedia jest zarejestrowanym znakiem towarowym Wikimedia Foundation
Wszystkie materiay pochodz z Wikipedii, obite s licencj GNU Free Documentation License