Dzisiaj jest niedziela, 23 listopada 2008 r. 328 dzien roku
Languages:ar | id | bg | ca | ceb | cs | da | de | et | en | es | eo | fr | he | hr | it | ko | lt | hu | nl | ja | no | pl | pt | ru | ro | sk | sl | sr | fi | sv | te | tr | uk | zh






REKLAMA
mp3

పురాణములు

వికీపీడియా నుండి

ఈ వ్యాసానికి సంబంధించిన రచనలు
హిందూధర్మశాస్త్రాలు
aum symbol
వేదములు (శ్రుతులు)
ఋగ్వేదం · యజుర్వేదం
సామవేదము · అధర్వణవేదము
వేదభాగాలు
సంహిత · బ్రాహ్మణము
ఆరణ్యకము  · ఉపనిషత్తులు
ఉపనిషత్తులు
ఐతరేయ  · బృహదారణ్యక
ఈశ  · తైత్తిరీయ · ఛాందోగ్య
కఠ  · కేన  · ముండక
మాండూక్య  ·ప్రశ్న
శ్వేతాశ్వర
వేదాంగములు (సూత్రములు)
శిక్ష · ఛందస్సు
వ్యాకరణము · నిరుక్తము
జ్యోతిషము · కల్పము
స్మృతులు
ఇతిహాసములు
మహాభారతము · రామాయణము
పురాణములు
ధర్మశాస్త్రములు
ఆగమములు
శైవ · వైష్ణవ
దర్శనములు
సాంఖ్య · యోగ
వైశేషిక · న్యాయ
పూర్వమీమాంస · ఉత్తరమీమాంస
ఇతర గ్రంథాలు
భగవద్గీత · భాగవతం
విష్ణు సహస్రనామ స్తోత్రము · త్రిమతాలు
లలితా సహస్రనామ స్తోత్రము · శక్తిపీఠాలు
త్రిమూర్తులు · తిరుమల తిరుపతి
పండుగలు · పుణ్యక్షేత్రాలు
... · ...
ఇంకా చూడండి
మూస:హిందూ మతము

అష్టాదశ పురాణాలను కృష్ణద్వైపాయనుడైన వ్యాసమహర్షి రచించాడని, రచించిన తాను వక్తగా కాకుండా ఆ విషయాలను ఒకప్పుడు నైమిశారణ్యంలో శౌనకుడు మొదలైన మహా మునులు దీర్ఘ సత్రయాగం చేస్తున్నప్పుడు, వారికి వ్యాసుని శిష్యుడైన రోమహర్షణమహర్షి కుమారుడైన సూత మహర్షి ద్వారా చెప్పించాడని పురాణాలే చెబుతున్నాయి. ఈ పురాణాలు మధ్య యుగం లో జరిగిన శైవ, వైష్ణవ ఘర్షణల వలన పరివర్తన చెందాయి అనే వాదన కూడా లేక పోలేదు. కొన్ని శ్లోకాల రచన శైలి వ్యాస మహర్షి రచన శైలిని గమనిస్తే ఆ విషయం అవగతం అవుతుంది.

ప్రతి పురాణం కుడా అన్ని పురాణాల ముఖ్యమైన లక్షణాలను మొదటి సర్గలలో చెబుతుంది. కూర్మపురాణంలో చెప్పబడిన పురాణ ఉపోద్ఘాతము ప్రకారం

సర్గశ్చప్రతిసర్గశ్చ వంశొమన్వంతరాణిచ
వంశానుచరితం చైవ పురాణం పంచలక్షణం

సర్గము, ప్రతి సర్గము, వంశము, మన్వంతరము, వంశాలచరిత్ర అనే పంచలక్షణాలు కలిగినదే పురాణం.

విషయ సూచిక

[మార్చు] పురాణాల విభజన

[మార్చు] పురాణాల పేర్లు చెప్పే శ్లోకం

సత్రయాగం జరుగుచున్నప్పుడు అష్టాదశపురాణాలను తెలుపుతూ సూతుడు ఋషులకు చెప్పిన శ్లోకం. భాగవత పురాణము ప్రధమ స్కందము లో చెప్పబడింది.

మద్వయం భద్వయం చైవ బ్రత్రయం వచతుష్టయం
అనాపద్లింగకూస్కాని పురాణాని పృథక్ పృథక్

పైన చెప్పిన వాటిలో:

  • "మ" ద్వయం -- మత్స్య పురాణం, మార్కండేయ పురాణం
  • "భ" ద్వయం -- భాగవత పురాణం, భవిష్య పురాణం
  • "బ్ర" త్రయం -- బ్రహ్మ పురాణం, బ్రహ్మ వైవర్త పురాణం, బ్రహ్మాండ పురాణం
  • "వ" చతుష్టయం -- విష్ణు పురాణం, వరాహ పురాణం, వామన పురాణం, వాయు పురాణం

మిగిలిన వాటి పేర్ల మొదటి అక్షరాలు మాత్రమే తీసుకుని శ్లోకపాదం కూర్చటం జరిగింది:

  • అ -- అగ్ని పురాణం
  • నా -- నారద పురాణం
  • పద్ -- పద్మ పురాణం
  • లిం -- లింగ పురాణం
  • గ -- గరుడ పురాణం
  • కూ -- కూర్మ పురాణం
  • స్కా -- స్కాంద పురాణం

[మార్చు] భాగవత పురాణాన్ని అనుసరించి అష్టాదశ పురాణములలో శ్లోకాలు

  1. మత్స్య పురాణం - 14,000
  2. మార్కండేయ పురాణం - 9,000
  3. భాగవత పురాణం - 18,000
  4. భవిష్య పురాణం - 14,500
  5. బ్రహ్మ పురాణం - 10,000
  6. బ్రహ్మవైవర్త పురాణం - 18,000
  7. బ్రహ్మాండ పురాణం - 11,100
  8. విష్ణు పురాణం - 63,000
  9. వరాహ పురాణం - 24,000
  10. అగ్ని పురాణం - 16,000
  11. నారద పురాణం - 24,000
  12. పద్మ పురాణం - 55,000
  13. లింగ పురాణం - 11,000
  14. గరుడ పురాణం - 19,000
  15. కూర్మ పురాణం - 17,000
  16. స్కాంద పురాణం - 80,000

[మార్చు] దేవతాప్రాముఖ్యాన్ని గుణాన్ని చెప్పే శ్లోకం

ఈ క్రింది శ్లోకం అష్టాదశ పురాణాలను మూడు విధాలుగా విభజిస్తూ వైష్ణవ, శైవ, బ్రహ్మ పురాణాలుగా చెబుతుంది.

వైష్ణవంనారదీయంచతధాభాగవతంశుభం గారుడంచ తధాపాద్మం
వరాహం శుభదర్శనే సాత్వికాని పురాణాని విష్ణ్వేయాని శుభానిదై
బ్రహ్మాండం బ్రహ్మ వైవర్తం మార్కండేయం తధైవ చ భవిష్యం వామనం బ్రహ్మరాజనిబోధతే
మాత్స్యకౌర్మంతధాలైంగశైవంస్కౌందంఆగ్నేయంచ షడేతాని తామసానిభోధమే

[మార్చు] ఉపపురాణాలు

ఈ అష్టాదశపురాణాలే కాకుండా ఉపపురాణాలు కూడా ఉన్నాయి.అష్టాదశ పురాణాలు కాకుండా ఉన్న ఉపపురాణాలు

  1. సనత్కుమారీయము
  2. నారసింహము
  3. స్కాందము(కుమారస్వామి చే చెప్పబడినది)
  4. శివ ధర్మము(నందికేశ్వరుడి చేత చెప్పబడినది)
  5. నారదీయము(దూర్వాసునిచే చెప్పబడినది)
  6. కాపిలము
  7. వామనము
  8. బ్రహ్మాండ పురాణము(శుక్రచార్యులచే చెప్పబడినది)
  9. వారుణము
  10. కాలకము
  11. మహేశ్వరము
  12. సాంబము
  13. సౌరము
  14. మారీచము
  15. భార్గవపురాణము(పరాశరునిచేత చెప్పబడినది)

[మార్చు] బయటి లింకులు