పిఠాపురం
వికీపీడియా నుండి
| ?పిఠాపురం మండలం తూర్పు గోదావరి • ఆంధ్ర ప్రదేశ్ |
|
|
|
|
|
|
|
| అక్షాంశరేఖాంశాలు: | |
| టైం జోన్ | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
| ముఖ్య పట్టణము | పిఠాపురం |
| జిల్లా(లు) | తూర్పు గోదావరి |
| గ్రామాలు | 26 |
| జనాభా • మగ • ఆడ • అక్షరాశ్యత శాతం • మగ • ఆడ |
123,809 (2001) • 62186 • 61623 • 63.23 • 66.54 • 59.88 |
పిఠాపురం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఒక ఒక గ్రామం మరియు అదే పేరుగల మండలమునకు కేంద్రము.
విషయ సూచిక |
[మార్చు] పిఠాపురం చరిత్రా విషయాలు
పిఠాపురాన్ని పూర్వం పీఠికాపురం అనేవారు. ఈ ఊరుకి అధిపతి పీఠాంబ. ఈ పీఠాంబ విగ్రహం ఒకటి - ఒక చేతిలో బంగారు పాత్ర, వేరొక చేత బాగుగా పండిన ఉసిరి కాయ, మూడవ చేత త్రిశూలం, నాల్గవ చేత లోహ దండం ధరించి - నేటి పిఠాపురానికి సమీపంలో, నాలుగు వీధులు కలిసే కూడలిలో ఉండేదట. ఇటువంటి విగ్రహమే ఒకటి ఈనాడు కొత్తపేటలో కుమారస్వామి ఆలయంలో ఉంది. ఈ విషయాన్ని ప్రముఖ కవీశ్వరుడు శ్రీనాధుడు భీమేశ్వర పురాణం లో ఈ కింది విధంగా చెబుతాడు.
- "హాటక పాన పాత్రయును నారగ బండిన మాతులుంగమున్
- ఖేటము లోహదండము నొంగి ధరియించి పురోపకంఠశృం
- గాటక భూమి భాగమున గాపురముండెది పీఠికాంబకుం
- గైటభదైత్యవైరిప్రియ కాంతకు మ్రొక్కె నతండు భక్తితోన్."
పిఠాపురానికి ఉత్తర దిక్కున ఏలేరు అనే ఏరు ఒకటి ఉంది. ఈ ఏలేరుని "జగతి నెక్కడివేలేటి సాటి నదులు" అంటాడు శ్రీనాధుడు అలా అనేసి ఊరుకోకుండా-
- "ఏలేటి విరినీట నిరుగారునుంబండు
- ప్రాసంగు వరిచేలు పసిడిచాయ."
అని చెబుతూ పిఠాపురం ప్రాంతం సస్యశ్యామలంగా ఉండేదని అప్పటి ఫల వృక్షాలనీ, పిండివంటలనీ శ్రీనాధుడు తన రచనలలో ఇలా వర్ణించేడు. ఒక్క వేరు పనస చెట్లు, పోక తోటలు ఇప్పుడు కనిపించటం లేదేమో కానీ, మిగిలినవన్నీ ఇప్పటికీ ఉన్నాయి. పిఠాపురం వరకు వచ్చిన శ్రీనాధుడు కళింగ దేశం వరకూ పర్యటించినట్లు ఆధారాలున్నాయి. సింహాచలం వరాహ నృసింహస్వామి ఆలయాన్ని దర్శించిన ఆధారాలూ ఉన్నాయి.పిఠాపురపు ఏలేరు ఉప్పాడ దగ్గర సముద్రంలో కలుస్తుంది. అన్నవరం దగ్గర ఉన్న పంపా నది కూడ సాగర సంగమం చెందే ముందు ఈ ఏలేటి నీటితో పొన్నాడ దగ్గర కలుస్తుందని చిలుకూరి పాపయ్య శాస్త్రి "శ్రీనాధ కృతి సమీక్ష" అనే పుస్తకంలో రాసేరు. ఒడ్డె రాజులతో వైరం పూనిన విజయనగరం గజపతులు ఈ నదుల సాగర సంగమ స్థానాన్ని పూరీ జగన్నాథంతో సమానమైన దివ్య క్షేత్రంగా రూపొందిద్దామని జగన్నాథ స్వామి, బలభద్ర స్వామి, సుభద్రా దేవి విగ్రహాలని ప్రతిష్ట చేసేరుట. ఈ జగన్నాథ స్వామి చేతులు ఇటీవల మొండి అగుటచే ఈ స్వామిని "మొండి జగ్గప్ప" అని ప్రాంతీయులు పిలుస్తారు.
[మార్చు] ఇతర ఆలయాలు
పిఠాపురంలో కుంతీమాధవ స్వామి ఆలయం, కుక్కుటేశ్వరుడి కోవెలలు ఉన్నాయి. వృత్తాసురుడిని చంపిన తర్వాత బ్రహ్మహత్యా పాతకం నుండి తప్పించుకుందికి ఇంద్రుడు ఐదు వైష్ణవాలయాలు స్థాపించేడు. అవి [1].
- కాశీ లో బిందు మాధవ స్వామి.
- ప్రయాగ లో వేణు మాధవ స్వామి.
- పిఠాపురంలో కుంతి మాధవ స్వామి.
- తిరుచునాపల్లి లో సుందర మాధవ స్వామి.
- రామేశ్వరం లో సేతు మాధవ స్వామి.
భారతదేశం లోని అష్టాదశ మహా శక్తి పీఠములలో ఒకటైన హుంకారిణీ శక్తి పీఠం ఈ కుక్కుటేశ్వరుడి దేవళంలో ఉండేది. పుస్తకాలలో, పురాణాలలో కల ఈ పీఠం కాని, ఆ శక్తి విగ్రహం కాని ప్రస్తుతం కానరావు. ఈ పీఠం మూలంగానే పిఠాపురానికి పీఠికాపురం అనే పేరు వచ్చిందని అంటారు. ఈ హుంకారిణీ శక్తి విగ్రహం రైలు స్టేషన్ కి ఎదురుగా ఉన్న మట్టి దిబ్బలో భూస్తాపితమై ఉన్నదని లోక ఐతిహ్యం ఉంది. పురావస్తు పరిశోధక శాఖ వారు తవ్వకాలు జరిపించి చూస్తే కనిపించవచ్చని ప్రజలు అనుకొంటారు. ఈ కుక్కుటేశ్వరుడి ఆలయ ప్రాంగణం లోనే కాలభైరవుడి విగ్రహం "వ్రీడావిహీనజఘనమై" చూసేవారికి సిగ్గును కలిగించేదిగా ఉంది. కుక్కుటేశ్వరుడి గుడికి ఎదురుగా ఒక తటాకం ఉంది. దానిని "పాదగయ" అంటారు. ఈ పాదగయకి ఆ పేరు ఎలా వచ్చిందో వివరిస్తూ రెండు కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. గంగా తీరమున ఉన్న గయ "గయా శీర్షం" అనీ, పిఠాపురంలో ఉన్నది "పాదగయ" అనీ ఒక సిద్ధాంతం. అందుకనే పాదగయలో స్నానం చేస్తే గంగలో చేసినంత ఫలితం అని ఒక నమ్మకం ఉంది. గయుడు అనే రాక్షసుడి పాదాలు అక్కడ ఉన్నాయి కనుక ఇది పాదగయ అయిందని మరొక వదంతి. గయునికి సంభందించిన ఒక కధనం ప్రకారం గయుని చావు తరువాత చచ్చిన శవం యొక్క బుర్ర సింహాచలం దగ్గర, పాదాలు పిఠాపురం దగ్గర పడ్డాయిట. అందుకని సింహాచలం నుండి పిఠాపురం వరకు ఉన్న ప్రదేశం పాపభూమి అనేవారు. పాపభూమి కాబట్టే ఈ మధ్య ప్రదేశంలో పుణ్య క్షేత్రాలు లేవుట. అన్నవరం తదనంతర కాలంలో ప్రశస్తి చెందినది. అందువలననే శ్రీనాధుని రచనలలో ఎక్కడా అన్నవరం చరిత్ర కనబదదు.
కుక్కుటేశ్వరస్వామి మందిరంలోని రాజరాజేశ్వరి అమ్మవారి దేవాలయం ఆవరణలో పురుహూతికా దేవి ఆలయం ఉంది. ఇది అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి.
పిఠాపురంలో ఇతర ఆలయాలు: వేణు గోపాలస్వామి ఆలయం, కుంతి మాధవస్వాని ఆళయం (పంచ మాధవ క్షేత్రాలలో ఒకటి), శ్రీపాద వల్లభ అనఘ దత్తక్షేత్రం, దత్తాత్రేయ మందిరం, నూకాలమ్మ గుడి (గ్రామదేవత), కుక్కపాముగుడి (సీతయ్యగారి తోట), రాముని కోవెల (మంగాయమ్మరావు పేట), వెంకటేశ్వరస్వామి గుడి (కుక్కుటేశ్వరస్వామి ఆళయం వద్ద), కోతి గుడి (మార్కెట్ వద్ద), సాయిబాబా గుడి (చిన్న పోస్టాఫీస్ వద్ద), పురుహూతికా అమ్మవాఱు (పాత బస్ స్టాండ్ వద్ద), కోట సత్తెమ్మ తల్లి గుడి (సీతయ్యగారి తోట), శ్రీ విశ్వ విజ్ఞాన ఆధ్యాత్మిక పీఠం (పాత బస్టాండ్ వద్ద)
- చర్చిలు
ఆంధ్రా బాప్టిస్ట్ చర్చి, బెథెడ్సా బాప్టిస్ట్ చర్చి, ఎల్-షద్దాయి మినిస్ట్రీస్ చర్చి, జియన్ ప్రార్ధనా మందిరం, ్ౌస్ ఆఫ్ హోప్, బైబిల్ మిషన్ చర్చి, ట్రినిటీ లూథరన్ చర్చి, డోర్ ఆఫ్ హోప్ చర్చి, సెవెన్త్ డే అడ్వెంటిస్ట్ చర్చి, మరి కొన్ని
[మార్చు] శాసనసభ నియోజకవర్గం
- పూర్తి వ్యాసం పిఠాపురం శాసనసభ నియోజకవర్గం లో చూడండి.
[మార్చు] రవాణా సౌకర్యాలు
ఈ పట్టణం మద్రాసు-హౌరా రైలు మార్గంలో ఉంది.
జాతీయ రహదారిపై నున్నందున అన్ని ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది.
[మార్చు] ఇతరాలు
- డిగ్రీ కాలేజీలు
సూర్యరాయ డిగ్రీ కాలేజి, పి.వి.డిగ్రీ కాలేజి, సి.బి.ఆర్.డిగ్రీ కాలేజి
- ఇంటర్మీడియట్ కాలేజీలు
- ఆర్.ఆర్.బి.హెచ్.ఆర్. ప్రభుత్వ జూనియర్ కాలేజి, శ్రీ హనుమంతరాయ జూనియర్ కాలేజి, నవచైతన్య జూ.కాలేజి, ప్రియదర్శిని జూ.కాలేజి, అంజనా జూ.కాలేజి
- సినిమా థియేటర్లు
శ్రీరామా, శ్రీ సత్యా, పూర్ణా, అన్నపూర్ణా, శివదుర్గా, శ్రీవెంకటేశ్వర, సౌగంధ్
- క్రికెట్ మైదావాలు
ఆర్.బి.హెచ్.ఆర్. క్రికెట్ గ్రౌండ్, రాజుగారి కోట, దూళ్ళ సంత
[మార్చు] ప్రముఖులు
పిఠాపురంకు చెందిన కొందరు ప్రముఖ సాహితీ మూర్తులు
- వారణాసి సుబ్రహ్మణ్యశాస్త్రి (బాలవ్యాస, తర్క వ్యాకరణ సిద్ధాంతి బిరుదాంకితులు)
- ఓలేటి పార్వతీశం (వేంకట పార్వతీశ్వర కవులలో ఒకరు)
- నడకుదుటి వీర్రాజు
- ఉమర్ ఆలీషా (తెలుగు పండితులు)
- పానుగంటి లక్ష్మీనరసింహం (సాక్షి వ్యాసములు రచయిత)
- నేదునూరి కృష్ణమూర్తి (సంగీత విద్వాంసులు)మొదలైన వారు అక్కడ ఉండేవారు.
- మొక్కపాటి నరసింహశాస్త్రి
- దేవులపల్లి కృష్ణశాస్త్రి
- పిఠాపురం నాగేశ్వరరావు
[మార్చు] పిఠాపుర సంస్థాన విశేషాలు
పిఠాపురాన్ని వెలమ రాజులు పాలించే వారు. వీరు సాహిత్యాన్ని బాగా పోషించేరు. వింజమూరి సోమేశ (రాఘవపాడవీయం), వక్కలంక వీరభద్ర కవి (వాసవదత్తా పరిణయం), కూచిమంచి జగ్గ కవి, కూచిమంచి గంగన్న, దేవులపల్లి బాపన్న, పిండిప్రోలు లక్ష్మన్న, అల్లంరాజు సుబ్రహ్మణ్య కవి, దేవులపల్లి సుబ్బరాయశాస్త్రి, దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి, రెండవ దేవులపల్లి సుబ్బరాయ శాస్త్రి, ప్రభృతులు పిఠాపురం ఆస్థానంలోని వారే.
కాకినాడ లోని పిఠాపురం రాజా వారి కళాశాల పూర్వపు రోజుల్లో మంచి పేరున్న కళాశాల. దరిమిలా ఆ పేరు లోని జిగి తగ్గింది అనుకొండి.
[మార్చు] ఇతర విశేషాలు
1. సా. శ. 1930 దశకంలో పిఠాపురంలో జరిగిన "ట్రంకు మర్డర్ కేసు" దర్యాప్తూ, విచారణా బరంపురంలో జరిగాయి. ఈ కేసులో పిఠాపురం రాజా వారి తాలూకు వారు ఎవరో ఇరుక్కున్నారు. అందుకని ఆ రోజులలో ఇది బాగా పేరు పడ్డ కేసు. ఎవ్వరో ఎవరినో (బట్టలు కుట్టే దర్జీని అని తర్వాత తెలిసింది) ఖూనీ చేసేసి, ముక్కలు ముక్కలుగా కోసేసి, ట్రంకు పెట్టెలో పెట్టేసి ఆ పెట్టెని కురదా రోడ్డు పేసెంజరు లోనో హౌరా మెయిల్ లో ఎక్కించేసేరు. (ఆ రోజులలో పిఠాపురంలో మెయిలు బండి ఆగేది) దరిమిలా రైలు బరంపురం చేరుకునేసరికి ఆ పెట్టె కంపు కొట్టడం, పోలీసులు దానిని అక్కడ దించడం జరిగింది. శవం బరంపురం లో పట్టుబడింది కనుక కేసు అక్కడ నమోదయింది.
2. పిఠాపురం లో వీణల తయారీ జరుగుతోంది. పాదగయా క్షేత్రానికి దగ్గర లో వీణలను తయారు చేస్తారు. పిఠాపురానికి చెందిన తుమరాడ సంగమేశ్వరశాస్త్రి మరియు చిట్టి బాబు వీణా విద్వాంసులుగా ప్రసిద్ధి చెందారు. సంగమేశ్వర శాస్త్రి గారు నెహ్రూ గారి ఉపన్యాసాలు కూడా వీణ మీద వాయించేవారని నానుడి.
[మార్చు] వనరులు
వేమూరి వేంకటేశ్వరరావు,"పిఠాపురంలో నా మొదటి మజిలీ" ఈమాట అంతర్జాతీయ పత్రిక, సెప్టెంబర్ 2004
[మార్చు] మూలాలు
[మార్చు] మండలంలోని గ్రామాలు
|
|
|
|---|---|
|
మారేడుమిల్లి • వై.రామవరం • అడ్డతీగల • రాజవొమ్మంగి • కోటనందూరు • తుని • తొండంగి • గొల్లప్రోలు • శంఖవరం • ప్రత్తిపాడు • ఏలేశ్వరం • గంగవరం • రంపచోడవరం • దేవీపట్నం • సీతానగరం • కోరుకొండ • గోకవరం • జగ్గంపేట • కిర్లంపూడి • పెద్దాపురం • పిఠాపురం • కొత్తపల్లె • కాకినాడ(గ్రామీణ) • కాకినాడ (పట్టణ) • సామర్లకోట • రంగంపేట • గండేపల్లి • రాజానగరం • రాజమండ్రి (గ్రామీణ) • రాజమండ్రి (పట్టణ) • కడియం • మండపేట • అనపర్తి • బిక్కవోలు • పెదపూడి • కరప • తాళ్ళరేవు • కాజులూరు • రామచంద్రాపురం • రాయవరం • కపిలేశ్వరపురం • ఆలమూరు • ఆత్రేయపురం • రావులపాలెం • పామర్రు • కొత్తపేట • పి.గన్నవరం • అంబాజీపేట • ఐనవిల్లి • ముమ్మిడివరం • ఐ.పోలవరం • కాట్రేనికోన • ఉప్పలగుప్తం • అమలాపురం • అల్లవరం • మామిడికుదురు • రాజోలు • మలికిపురం • సఖినేటిపల్లి |
|