పర్ణశాల
వికీపీడియా నుండి
ఈ వ్యాసం భద్రాచలం దగ్గర శ్రీరాముడు వనవాసంలో ఉన్న గ్రామం గురించి. ఇదే పేరుతో ఉన్న ఇతర ప్రాంతాల కొరకు, పర్ణశాల (అయోమయ నివృత్తి) చూడండి.
పర్ణశాల, ఖమ్మం జిల్లా, భద్రాచలం మండలానికి చెందిన గ్రామము. ఖమ్మం జిల్లాలో భద్రాచలానికి 32 కి మీ ల దూరంలో పర్ణశాల ఉన్నది. హిందువుల ఆధ్యాత్మిక గ్రంధం రామాయణం లో పర్ణశాల ప్రసక్తి కలదు. శ్రీరాముడు వనవాసానికి వెళ్ళినపుడు ఇక్కడ నివసించినట్లు ప్రతీతి. వాగు వద్ద సీత స్నానం చేసిన తరువాత ఇక్కడి రథంగుట్ట పై చీరలు ఆరవేయగా దానిపై ఆ చీరల ఆనవాళ్ళు ఏర్పడినవని ఒక కథనం. ఈ ఆనవాళ్ళు పర్ణశాలలో ఒక యాత్రా విశేషం.
రాముడు బంగారు లేడి రూపంలో వచ్చిన మారీచుని ఇక్కడే చంపాడు. అప్పుడు రావణాసురుడు సీతను అపహరించగా నేలపై ఒక గుంట ఏర్పడింది. పర్ణశాలలో ఉన్న గుంట ఈ కారణంగా ఏర్పడినదే అని ప్రతీతి.