Dzisiaj jest niedziela, 23 listopada 2008 r. 328 dzien roku
Languages:ar | id | bg | ca | ceb | cs | da | de | et | en | es | eo | fr | he | hr | it | ko | lt | hu | nl | ja | no | pl | pt | ru | ro | sk | sl | sr | fi | sv | te | tr | uk | zh






REKLAMA
mp3

పరవస్తు వెంకట రంగాచార్యులు

వికీపీడియా నుండి

పరవస్తు వెంకట రంగాచార్యులు సంస్కృతాంధ్ర పండితుడు, ప్రముఖ తత్వవేత్త మరియు చెప్పుకోదగిన తెలుగు కవి. తర్కము మరియు వ్యాకరణాలలో నిష్ణాతుడు.

రంగాచార్యులు 1822, మే 22న విశాఖపట్నంలో శ్రీనివాసాచార్యులు, మంగమ్మ దంపతులకు జన్మించాడు. ఎనిమిదేళ్ల వయసులోనే సంస్కృతములో 'కుంభకర్ణ విజయము' అనే కావ్యమును రచించాడు. ఉర్లాం, విజయనగరం మరియు మైసూరు మహారాజులు ఈయనను గౌరవించి సత్కరించారు. అన్నింటి కంటే మించి ఈయన శతావధానములో నిష్ణాతుడై మహా మహోపాధ్యాయ అన్న బిరుదు పొందినాడు. ఈయన తెలుగు సాహిత్యములో శ్రేష్ట గ్రంధాలుగా ఎన్నదగిన కమలిని కలహంసము, వేద రహస్యము మరియు మంజుల నైషదము లను రచించాడు.

తెలుగు వాజ్ఞ్మయము వ్యాపనకు ఈయన సలిపిన కృషి అత్యంత ప్రశంసనీయము. రంగాచార్యులు భారతదేశములో క్రైస్తవ మత బోధనలను వ్యతిరేకించాడు. హిందూ తత్వము మరియు సంస్కృతులకు గట్టి మద్దతునిచ్చాడు. ఈయన చివరి రోజులు తునిలో గడిపాడు.

పూర్వము తెలుగులో పదకోశములు పద్య రూపములోనే ఉండేవి. తరువాత అకారాది క్రమములో నిఘంటువులు వ్రాసే ప్రయత్నము జరిగినది. రాబర్ట్ కాల్డ్వెల్ గారు, చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ గారు ఈ విషయములో ప్రధమముగా కృషి చేసిన మహనీయులు.

పరవస్తు వెంకట రంగాచార్యులు గారు తెలుగులో ప్రప్రధమముగా ఒక విజ్ఞాన సర్వస్వమును ఆరంభించిన కృషీవలులు. ఆయన 40 సంవత్సరములు శ్రమించి "అ", "ఆ" వరకు మాత్రము పూర్తి చేయగలిగినారు. తరువాత బృహత్కార్యక్రమము కొమర్రాజు లక్ష్మణరావు గారు చేపట్టారు.


ప్రత్యేకించి ఈ "తెలుగు వికీపీడియా" కార్యక్రమము కొనసాగుతున్న నేపథ్యములో ఆయనను స్మరించుకొనుట మన కర్తవ్యము.


ఈయన 1900 జనవరి 20న తుని లో మరణించాడు.

[మార్చు] రచనలు

  • మంజుల నైషధము
  • లఘు వ్యాకరణము
  • ప్రపత్తి వాదము
  • కుంభకర్ణ విజయము
  • శకుంతలము
  • కమలినీ కలహంసము
  • శబ్దార్ధ సర్వస్వము
  • కేనోపనిషత్తుకి పద్య అనువాదము
  • మాండూక్యోపనిషత్తుకి పద్య అనువాదము

[మార్చు] మూలాలు

  • తెలుగు వైతాళికులు - ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ

Polska, Dolar, Forex


Wikipedia jest zarejestrowanym znakiem towarowym Wikimedia Foundation
Wszystkie materiay pochodz z Wikipedii, obite s licencj GNU Free Documentation License