Dzisiaj jest niedziela, 23 listopada 2008 r. 328 dzien roku
Languages:ar | id | bg | ca | ceb | cs | da | de | et | en | es | eo | fr | he | hr | it | ko | lt | hu | nl | ja | no | pl | pt | ru | ro | sk | sl | sr | fi | sv | te | tr | uk | zh






REKLAMA
mp3

పట్టిసం

వికీపీడియా నుండి

గోదావరి నదిలో శ్రీ వీరభద్రేశ్వరస్వామి దేవాలయము.
శ్రీ వీరభధ్రస్వామి దేవాలయము వెనుక భాగము దేవస్థానం, పట్టిసీమ
శ్రీ వీరభధ్రస్వామి దేవాలయ ఆవరణలో నందీశ్వరుడు
శ్రీ వీరభధ్రస్వామి దేవాలయ ప్రధాన ముఖద్వారము


పట్టిసం, పశ్చిమ గోదావరి జిల్లా, పోలవరం మండలానికి చెందిన గ్రామము. నిజానికి ఇది ఒక గ్రామముగా లెక్కలలో ఉన్నా ఇది ఒక ప్రసిద్ద శైవ క్షేత్రము. ఈ క్షేత్రము కొవ్వూరుకు 25 కి.మీ. దూరంలో ఉన్నది. చారిత్రకంగానూ, ఆధ్యాత్మికంగానూ విశేషమైన స్థానం కలదీ పట్టిసం. పాపికొండల మధ్య సాగే గోదావరి ఒడ్డున దేవకూట పర్వతంపైన వీరభద్రస్వామి వారి ఆలయం, భావనారాయణ స్వామివార్ల ఆలయాలు ఉన్నాయి. తెలుగు సినిమాలలో అత్యదికంగా చిత్రణ జరిపే మంచి అందాలుగల దేవాలయం ఇది. ఎప్పుడూ సినిమా షూటింగులతో రద్దీగా ఉండే దీన్ని పట్టిసం, పట్టిసంనిధి, పట్టిసీమ అని కూడా పిలుస్తుంటారు. గోదావరి మధ్యనున్న చిన్న లంక మాదిరి ప్రదేశంలో శ్రీ వీరభధ్రస్వామి దేవస్థానం ప్రకృతితో సుందరంగా ఉంటుంది. ఇక్కడ మహాశివరాత్రి కి బ్రహ్మాండమైన ఉత్సవాలు ఐదు రోజుల పాటు జరుగుతాయి. ఈ తీర్ధము లేదా తిరునాళ్ళకు లక్షలాదిగా భక్తులు తరలి వస్తుంటారు.

[మార్చు] క్షేత్ర చరిత్ర

[మార్చు] సౌకర్యాలు

మునుపు దేవాలయము శిధిలమవడము వలన కొత్తగా దేవాలయ నిర్మాణము చేసారు. దేవాలయము చుట్టూ అందమైన తోటలు, పూలమొక్కలు, గడ్డి పెంచుతున్నారు. ఒకప్పుడు కనీసం మంచి నీళ్ళు కూడా దొరకని పరిస్థితి ఉండేది. కాని ఇప్పుడు దేవాలయము పై బాగమునందు కూడా మంచి సౌకర్యాలు ఏర్పడినవి. ఉండేందుకు గదులు నిర్మించారు. త్రాగుగునీటి వసతులు. బోజనశాలలు ఏర్పడినవి. గోదవరి పదవల రేవు, స్నానాలరేవులను కొత్తగా ఏర్పాటు చేసినారు.

[మార్చు] చేరుకొనే విధం

ఈ క్షేత్రం రాజమండ్రి నుండి దాదాపు ముప్పై కిలోమీటర్ల దూరంలో కలదు. ప్రతిరోజూ రాజమండ్రి నుండి బస్సులు కలవు. లేదా ప్రకృతి ప్రేమికుల కొరకు వివిద ఆఫీసుల ద్వారా గోదావరిపై లాంచీల ద్వారా స్పీడు బోట్ల ద్వారా చేరుకొను వీలు కలదు. రాజమండ్రి నుండి గల మరొక సర్వీసు పాపికొండల టూర్. ఈ టూర్లో తప్పక పట్టిసీమ చేర్చబడి ఉంటుంది.





Polska, Dolar, Forex


Wikipedia jest zarejestrowanym znakiem towarowym Wikimedia Foundation
Wszystkie materiay pochodz z Wikipedii, obite s licencj GNU Free Documentation License