నీరు
వికీపీడియా నుండి
|
ఈ వ్యాసము మొలక. ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. |
నీరు (సాంకేతిక నామం H2O ) లేదా జలము జీవులన్నింటికి అత్యవసర పదార్ధం. భూమిమీద వృక్షాలు, జంతువులు, మానవాళి మనుగడకు, వాటి పెరుగుదలకు గాలి తరవాత ముఖ్యమైనది నీరు. గ్రామాల్లో, పట్టణాల్లో నివసించే కోట్లాది ప్రజలకు త్రాగునీరు సరఫరా చేయడం ఎన్నో ప్రపంచదేశాలు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య. వివిధ పంటల సాగుబడికి నీటి-పారుదల సౌకర్యాలు అత్యంత అవసరమైనవి. ఏ పరిశ్రమ కూడా తగినంత నీటి సరఫరా లేకపోతే స్థాపించడంగాని, నడపడంగాని సాధ్యపడదు.
భూతలం నాల్గింట మూడు వంతులు మహాసముద్రాలు, నదులు, తటాకాలు వంటి ఉపరితల జలాలతో నిండి ఉంది. ప్రకృతిలో లభ్యమయ్యే నీటిలో అతిశుద్ధమైనది వర్షపు నీరు.
[మార్చు] నీటి చక్రం
[మార్చు] జీవ శాస్త్రంలో
జీవం నీటి నుంచి మొదలైంది. జీవుల్లో జీవ రసాయన క్రియలన్నీ నీటి వల్లనే సంభవం. జంతువుల శరీరంలో 70-90 శాతం నీరు ఉంటుంది. నీరు ముఖ్యంగా రెండు రకాలు. అవి సముద్రపు నీరు, మంచి నీరు. మంచినీటి కంటే సముద్రపు నీరు చాలా ఎక్కువ పరిమాణంలో ఉంది. ఎక్కువగా జీవులు సముద్రంలోనే వేరువేరు లోతులలో జీవించడానికి తగిన వాతావరణ పరిస్థితుల్లో ఉంటాయి. జంతువులు నీటిని చర్మం ద్వారా పీల్చుకోవడం, తాగడం, ఇంకా జీవ ప్రక్రియలలో వెలువడిన నీటిని వాడుకోవడం చేస్తాయి.
జీవ వ్యవస్థలో నీరు మంచి ద్రావణి, ఇందులో చాలా వరకు లవణాలు కరుగుతాయి. అందుకే దాన్ని విశ్వవ్యాప్త దావణి అంటారు. ఇంచుమించు అన్ని జీవరసాయనాలు నీటిలో కరుగుతాయి. ఇందువల్ల నీరు జీవపదార్ధాల రవాణాకు తోడ్పడుతుంది. ఉదా: రక్తం, శోషరసం, మూత్రం.
మనిషి శరీరములో 2/3 వ వంతు నీరే.
మనకు నీళ్ళవల్ల చాలా లాభాలు ఉన్నాయి
- ఇది వాతావరణ పీడనాలనుండి మనల్ని కాపాడుతుంది
- శరీరంలో రవాణా సౌకర్యాలు కలిగిస్తుంది
- చెత్తని బయటకి పంపిస్తుంది
[మార్చు] ఇవి కూడా చూడండి