నంది తిమ్మన
వికీపీడియా నుండి
| నంది తిమ్మన | |
| జననం | పదహారో శతాబ్దం |
|---|---|
| ఇతర పేర్లు | ముక్కు తిమ్మన |
| రచనలు | పారిజాతాపహరణం, వాణీ విలాసం |
| సమకాలీనులు | అల్లసాని పెద్దన, ధూర్జటి, అయ్యలరాజు రామభధ్రుడు, మాదయ్యగారి మల్లన |
| గురువు | అఘోర శివాచార్యులు |
| ఆశ్రయమిచ్చిన రాజులు | శ్రీ కృష్ణదేవ రాయలు |
| తండ్రి | సింగన్న |
| తల్లి | తిమ్మాంబ |
నంది తిమ్మనను ముక్కు తిమ్మన అని కూడా అంటారు. ఇతని ముక్కు పెద్దదిగా ఉండటంవల్ల, మరియూ ఇతని కవితలలో ముక్కును చక్కగా వర్ణించడంవల్ల!
ఇతను శ్రీ కృష్ణదేవరాయల అష్టదిగ్గజాలలో ఒకడు. ఇతను రాయల భార్య తిరుమల దేవి కి అరణంగా విజయ నగరం వచ్చిన కవి.
[మార్చు] రచనా శైలి
తన సమకాలికుడైన అల్లసాని పెద్దన వలే క్లిష్టమైన పదప్రయోగాలకు పోకుండా సున్నితమైన, సులువైన పద్దతిలోనే రచనలు చేశాడు. ఈయన రచనలు కేవలం పండితులకే కాక పామర జనులను సైతం విశేషంగా ఆకర్షించేవి. అందుకే ఆయన రచనలను ముక్కు తిమ్మన ముద్దు పలుకులు అని వ్యవహరిస్తారు. పారిజాతాపహరణం లో ఆయన రచించిన సుకుమారమైన శృంగార రసాత్మకమైన పద్యాలు ఇప్పటికీ పండితుల నోళ్ళలో నానుతూనే ఉంటాయి.
| అష్టదిగ్గజములు |
|---|
| అల్లసాని పెద్దన | నంది తిమ్మన | ధూర్జటి | మాదయ్యగారి మల్లన | అయ్యలరాజు రామభధ్రుడు | పింగళి సూరన | రామరాజభూషణుడు | తెనాలి రామకృష్ణుడు |