Dzisiaj jest niedziela, 23 listopada 2008 r. 328 dzien roku
Languages:ar | id | bg | ca | ceb | cs | da | de | et | en | es | eo | fr | he | hr | it | ko | lt | hu | nl | ja | no | pl | pt | ru | ro | sk | sl | sr | fi | sv | te | tr | uk | zh






REKLAMA
mp3

దేవాలయం

వికీపీడియా నుండి

కంబోడియాలోని 12వ శతాబ్దానికి చెందిన అంగ్ కోర్ వాట్ మందిరం ప్రపంచంలోని అతిపెద్ద దేవాలయం.

దేవాలయం (Temple) మత సంబంధమైన ప్రార్ధనల వంటి కార్యక్రమాలకు వినియోగించే కట్టడం. దాదాపు అన్ని మతాలలోను ఇవి పవిత్రమైన ప్రదేశాలుగా భావింపబడుతాయి. 'దేవుడు' లేదా 'దేవత' ఉండే ప్రదేశం గనుక 'దేవాలయం' అని పిలువబడుతుందని అర్ధం చేసుకోవచ్చును. వివిధ మతాలలో దేవాలయాలకు చెందిన అనేక సంప్రదాయాలు, నిర్మాణ రీతులు, నిర్వహణా విధానాలు ఉన్నాయి.

శ్రీ వైఖానస శాస్త్రము ప్రకారం భక్తజనుల సౌకర్యార్థము భగవంతుడు అర్చారూపియై భూలోకమునకు వచ్చెను. ప్రతి దేవాలయములోను ద్వారపాలకులు, పరివార దేవతలు, ప్రాకార దేవతలు ఆయా స్థానములలో ఆవాహన చేయబడియుందురు.

విషయ సూచిక

[మార్చు] హిందూ దేవాలయాలు

[మార్చు] ఆలయములు అయిదు విధములు

  • స్వయంవ్యక్త స్థలములు - భగవంతుడే స్వయముగా అవతరించిన స్థలములు.
  • దివ్య స్థలములు - దేవతలచే ప్రతిష్ట చేయబడిన స్థలములు.
  • సిద్ధ స్థలములు - మహర్షులు, తపస్సుచేసి సిద్ధి పొందిన స్వాములు ప్రతిష్టించిన స్థలములు.
  • పౌరాణ స్థలములు - పురాణములలో చెప్పబడి ప్రసిద్ధిగాంచిన స్థలములు.
  • మానుష స్థలములు - రాజుల చేత, భక్తుల చేత ప్రతిష్ట చేయబడిన స్థలములు.

[మార్చు] దేవాలయ నిర్మాణం

దేవాలయాలలో గాలి గోపురం, ప్రధాన ద్వారం, వైకుంఠ ద్వారం, ధ్వజ స్తంభం, గర్భగుడి, ద్వారపాలకులు, వంటశాల మొదలైన వివిధ భాగాలుంటాయి.

[మార్చు] దేవాలయ నియమావళి

హిందూ దేవాలయాలలో సాధారణంగా ఉండే భాగాలు, దేవాలయ సందర్శన సమయంలో భక్తులు పాటించే ఆచారాలు ఈ చిత్రంలో గమనించవచ్చును.

ఆగమ శాస్త్రములో దేవాలయ అర్చకులు, భక్తులు, అధికారులు ఏ విధముగా వివరించబడినది.

  1. ఆలయము లోపల వాహనము మీదగానీ, పాదరక్షలతో గాని తిరుగరాదు.
  2. ఆలయమునకు ప్రదక్షిణము చేసి, పిమ్మట లోనికి ప్రవేశించాలి.
  3. ఆలయములోనికి తలపాగా ధరించిగాని, చేతితో ఆయుధము పట్టుకొనిగాని ప్రవేశించరాదు.
  4. ఆలయములోనికి ఉత్తచేతులతోగాని, తిలకం ధరించకుండా గాని, తాంబూల చర్వణం చేస్తూగాని, ఆహారాదులు తినుచూగాని ప్రవేశించరాదు.
  5. ఆలయ ప్రాంగణములో మల, మూత్ర విసర్జన చేయరాదు.
  6. ఆలయమందు కాళ్ళు చాపుకొని కూర్చుండుట, నిద్రపోవుట చేయరాదు.
  7. ఆలయములో ఏ ప్రాణికైనా దుఃఖం కలిగించే ఏ హింసనూ చేయరాదు.
  8. ఆలయములో ఎన్నడూ వివాదములు పెట్టుకోరాదు.
  9. ఆలయములో అహంకారముతో, గర్వముతో, అధికార దర్పముతో ఉండరాదు.
  10. ఆలయములో దేవుని ఎదుట పర స్తుతిని, పర నిందను కూడా చేయరాదు.
  11. ఆలయములో దేవుని ఎదుట పృష్ఠభాగం చూపిస్తూ కూర్చుండరాదు.
  12. అధికార గర్వంతో అకాలంలో ఆలయం ప్రవేశించి అకాల సేవలను చేయరాదు.
  13. మత్తు పదార్థములను, మాదక ద్రవ్యములను సేవించిగాని, సురాపానము చేసిగాని ఆలయమును ప్రవేశించరాదు.
  14. ఒక చేతితో ప్రమాణము చేయరాదు.
  15. స్త్రీలతో సాభిప్రాయంగా మాట్లాడటం, అశ్లీల కథనము చేయరాదు.
  16. ఆలయాలలో ఇతరులకు నమస్కరించడం చేయరాదు. భగవంతుని ఎదుట అందరూ సమానులే అని భావించవలెను.

[మార్చు] దేవాలయాలలో రకాలు

[మార్చు] వివిధ రకాల దేవాలయాలు

[మార్చు] చర్చిలు

క్రైస్తవులు వారి దేవుడైన ఏసుక్రీస్తును ప్రార్ధించే మందిరాన్ని చర్చి అంటారు.

[మార్చు] మసీదులు

ప్రధాన వ్యాసం: మసీదు

ముస్లింల దేవుడైన మహమ్మద్ ప్రార్ధానాస్థలాలను మసీదులు అంటారు.

[మార్చు] గురుద్వారాలు

సిక్కు మతస్థులు ప్రార్ధించే ప్రదేశాలను గురుద్వారాలు అంటారు.

[మార్చు] బౌద్ధారామాలు

[మార్చు] ఇతర మతాల ఆలయాలు

[మార్చు] కొన్ని ప్రసిద్ధ ఆలయాలు

ప్రధాన వ్యాసం: ప్రపంచ దేవాలయాల జాబితా

[మార్చు] ఆంధ్ర ప్రదేశ్‌లో

[మార్చు] తక్కిన భారత దేశంలో

[మార్చు] ఇతర దేశాలలో

[మార్చు] ఇవి కూడా చూడండి

[మార్చు] మూలాలు, వనరులు


[మార్చు] బయటి లింకులు


Polska, Dolar, Forex


Wikipedia jest zarejestrowanym znakiem towarowym Wikimedia Foundation
Wszystkie materiay pochodz z Wikipedii, obite s licencj GNU Free Documentation License