దాశరథి రంగాచార్య
వికీపీడియా నుండి
దాశరధి రంగాచార్యులు ఖమ్మం జిల్లాలోని చిన్న గూడూరు లో జన్మించినారు. నిజామునకు వ్యతిరేకంగా పోరాటంచేసిన యోధుడు,కవి. ఎల్ ఎల్ బి చేశారు. కొంతకాలం టీచర్ గా పని చేశారు. హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్‌లో 32 ఏళ్ళు పనిచేసి రిటైరయ్యారు. చిల్లర దేవుళ్ళు, జనపథం, మోదుగుపూలు, జీవనయానం, శ్రీమద్రామాయణం, శ్రీ మహాభారతం వీరి ప్రసిద్ద రచనలు. ఎన్నో అవార్డులూ, సన్మానాలూ అందుకున్నారు. అభినవ వ్యాసుడు గా పేరుపొందారు.
నిజామాబాదు జిల్లాలో ఉన్నప్పుడు
"ఓ నిజాము పిశాచమా కానరాడు నిన్ను బోలిన రాజు మాకెన్నడేని తీగలను తెంచి అగ్నిలో దింపినావు నా తెలంగాణ కోటి రత్నాల వీణ"
అని రాసినారు. ఇది చాలా ప్రాచుర్యము పొందినది. వీరి రచనలు వేదం, జీవన నాదం, మోదుగు పూలు