తెలుగు సినిమా
వికీపీడియా నుండి
| భారతీయ సినిమా |
| వెండితెర సందడి |
|||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
|
|||||||||||
సినిమా తెలుగు వారి సంస్కృతిలో, జీవితంలో భాగమైపోయింది. ఏ ఇద్దరు కలుసుకున్నా, ఏ నెట్ గ్రూప్ చూసినా తెలుగు వాళ్ళు సినిమాల గురించి మాట్లాడకుండా ఉండలేరు. తెలుగు వారికి ఇతర సైటుల కంటే సినిమా సైటులే ఎక్కువగా ఉన్నాయి. భారతీయ సినిమాలో సంఖ్యాపరంగా అత్యధికంగానూ, వాణిజ్య పరంగా రెండవ స్థానంలోనూ (ఇంచుమించు తమిళ సినీరంగానికి కుడియెడంగా) తెలుగు సినిమా వర్ధిల్లుతోంది.
గిన్నీస్ ప్రపంచ రికార్డులు వారిచే గుర్తింపబడిన ప్రపంచములోనే
- అతిపెద్ద ఆధునికమైన ఫిల్మ్ స్టూడియోరామోజీ ఫిల్మ్ సిటీ మన హైదరాబాద్ శివార్లలో ఉంది,నిర్మించింది రామోజీరావు
- ఎక్కువ పాటలు(వివిధ బాషలలో)పాడిన గాయకుడు ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం30 వేలకు పైగా
- ఎక్కువ సినిమాలకి (వివిధ బాషలలో) దర్శకత్వం వహించిన దర్శకుడు దాసరి నారాయణ రావు(100 సినిమాలకి పైగా)
- ఎక్కువ సినిమాలు (వివిధ బాషలలో) నిర్మించిన నిర్మాత రామానాయుడు(100 సినిమాలకి పైగా)
- అతితక్కువ కాలములో ఎక్కువ సినిమాలలో నటించిన నటుడు బ్రహ్మానందం (750 సినిమాలకి పైగా)
- ఎక్కువ సినిమాలకి దర్శకత్వం వహించిన మహిళా దర్శకురాలు విజయనిర్మల[1](42 సినిమాలు)
మన తెలుగు చలనచిత్ర సీమకు గొప్పదనం,గౌరవం,ప్రపంచములో గుర్తింపు తెచ్చిన ప్రతిభావంతులు.
దక్షిణ భారతదేశంలో గల ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోని తెలుగు సినీ పరిశ్రమని టాలీవుడ్ అని సంభోదిస్తారు. హాలీవుడ్ పేరుని స్ఫూర్తిగా తీసుకున్న బాలీవుడ్ మాదిరిగా తెలుగు+హాలీవుడ్ ధ్వనించేటట్టు ఈ పేరుని కూర్చారు. ఒక్కోసారి బెంగాలీ సినిమా పరిశ్రమని కూడా (టాలీగంజ్+హాలీవుడ్) టాలీవుడ్ గా సంభోదిస్తారు.
విషయ సూచిక |
[మార్చు] చరిత్ర
(ప్రధాన వ్యాసం: తెలుగు సినిమా చరిత్ర)
[మార్చు] పరిశ్రమ
ప్రతీ ఏటా దాదాపు 100 నుండి 150 వరకు తెలుగు చిత్రాలు టాలీవుడ్ ద్వారా విడుదలవుతున్నాయి. 2005 వ సంవత్సరములో సగటున వారానికి రెండు సినిమాలు విదుదల కాగా, 32 బిలియన్ రూపాయల టిక్కెట్టు అమ్మకాల ద్వారా 23 బిలియన్ రూపాయల (522 మిలియన్ అమెరికా డాలర్లు) వార్షిక ఆదాయం వచ్చిందని అంచనా. పెద్ద చిత్రాలు చాలా వరకు పండుగ సమయాలైన సంక్రాంతి, ఉగాది, దసరాలకు లేదా వేసవి శెలవులకు విడుదల చేస్తారు.
2004 వ సంవత్సరములో ఒక్క సంక్రాంతి సమయంలోనే 150 కోట్లకు వ్యాపారం జరిగినట్టు అంచనా. ఇది బాలీవుడ్ పరిశ్రమ ఆ సంవత్సరంలో అర్జించినదానికన్నా ఎక్కువ. తెలుగు సినిమాకు సంబందించిన కార్యక్రమాలను ప్రసారం చెయ్యడానికి ప్రత్యేకంగా మూడు టీవీ ఛానళ్ళు పైనే ఉన్నాయి.
టాలీవుడ్ బాక్సాఫీస్ వసూళ్ళ ట్రెండ్ కు సంబందించిన చార్టు మిలియన్ రూపాయిలలో :
| సం. | టాలీవుడ్ బాక్సాఫీస్ |
|---|---|
| 1980 | 819 |
| 1985 | 1,526 |
| 1990 | 3,333 |
| 1995 | 7,985 |
| 2000 | 14,011 |
| 2005 | 23,044 |
ఆంధ్ర ప్రదేష్ రాష్ట్ర దేశీయ ఉత్పత్తుల ద్వారా వచ్చే స్థూల ఆదాయంలో 1 శాతం తెలుగు సినిమా పరిశ్రమ నుండి వచ్చింది.
[మార్చు] కోలీవుడ్ బాలీవుడ్ లతో సంబందం
ప్రముఖ తారలు త్రిష, ఇలియానా 75 లక్షల వరకు; శ్రియ, జెనీలియ, సదా, భూమిక చావ్లా, ఛార్మి (వీళ్ళంతా ముంబాయికి సంబందించిన వాళ్ళు) 50 నుండి 60 లక్షల వరకు తీసుకుంటారు. నయన తార, ఆసిన్, అనుష్క వంటి వారు నటించే రోజులు బట్టి 30 నుండి 40 లక్షల వరకు తీసుకుంటారు.
టాలీవుడ్ నుండి కోలీవుడ్ కి, అక్కడ నుండి ఇక్కడికి కధలను ఇచ్చిపుచ్చుకోవడం మామూలే. హీరోయిన్లు కూడా ఈ రెండు పరిశ్రమల మధ్య మారుతుంటారు. తెలుగువాడైన విద్యాసాగర్ కోలీవుడ్ లో మంచి సంగీత దర్శకుడిగా పేరు సంపాదించుకుంటే, అక్కడివాడైన లారెన్స్ రాఘవేంధ్ర ఇక్కడ గొప్ప నృత్య దర్శకుడిగా, దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. బాగా ఆడిన తెలుగు సినిమాలను తమిళంలో పునర్నిర్మిస్తుంటారు. అక్కడి సినిమాలను ఇక్కడ డబ్ చేస్తుంటారు. మణిరత్నం, శంకర్, ఏ.ఎమ్.రత్నం వంటి వాళ్ళు ఈ రెండు భాషలలోను ఒకేసారి సినిమాలను తీస్తుంటారు.
[మార్చు] ప్రత్యేకతలు
(ప్రధాన వ్యాసం: తెలుగు సినిమా ప్రత్యేకతలు)
[మార్చు] నిర్మాణ వ్యయం
తెలుగు సినిమా నిర్మాణ వ్యయం సాదారణంగా ఒక్కో సినిమాకు 7 నుండి 10 కోట్ల మధ్య ఉంటుంది. రిలీజుకి ముందు పేరున్న చిత్రాలకి 12 నుండి 20 కోట్ల వరకు ఆదాయం వస్తుంది. సినిమా విజయం సాధిస్తే 25 నుండి 45 కోట్ల వరకు వ్యాపారం జరగోచ్చు.
[మార్చు] అభిమానులు
ప్రముఖ టాలీవుడ్ నటీనటులందరికీ దక్షిణ భారతదేశంలో అభిమానులున్నారు. ముఖ్యంగా ఎన్.టి.రామారావు, చిరంజీవి, బాలకృష్ణ వంటి వారిని అభిమానులు దైవంలా ఆరాధిస్తున్నారు.
[మార్చు] విశేషాలు
- పాతతరం అగ్ర కధానాయకుడు ఎన్.టి.రామారావు గారు చాలా కాలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసారు.
- గిన్నీస్ ప్రపంచ రికార్డులు వారిచే గుర్తింపబడిన ప్రపంచములోనే అతిపెద్ద ఆధునికమైన ఫిల్మ్ స్టూడియో రామోజీ ఫిల్మ్ సిటీ మన హైదరాబాద్ శివార్లలో ఉంది.
- శ్రీశ్రీ ఒకే రోజు 11 పాటలు రాశారు.
- భారతదేశంలోని పలువురి ప్రశంసలు పొందిన శంకరాభరణం సినిమాని 1979లో కె . విశ్వనాథ్ దర్శకత్వంలో పూర్ణోదయా ఆర్ట్ క్రియేషన్స్ బేనర్ పై ఏడిద నాగేశ్వరరావు, ఆకాశం శ్రీరాములు నిర్మించారు.
- భారతదేశ తొలి కౌబాయ్ చిత్రాన్ని నిర్మించినది తెలుగు చిత్ర సీమే! మోసగాళ్ళకు మోసగాడు చిత్రాన్ని కృష్ణ కధానాయకుడిగా కె.యస్.ఆర్.దాస్ దర్శకత్వంలో నిర్మించారు.
- 70ఎమ్ ఎమ్ సినిమాను,ఈస్ట్ మన్ కలర్ ను పరిచయం చేసినది కూడా 'కృష్ణ'గారు.
[మార్చు] సంవత్సరాల వారిగా విడుదలైన సినిమాల సంఖ్య
| సంవత్సరము | డైరెక్ట్ చిత్రాలు | డబ్బింగ్ చిత్రాలు | మొత్తము |
| 1931 | 1 | 1 | |
| 1932 | 2 | 2 | |
| 1933 | 5 | 5 | |
| 1934 | 3 | 3 | |
| 1935 | 7 | 7 | |
| 1936 | 12 | 12 | |
| 1937 | 10 | 10 | |
| 1938 | 10 | 10 | |
| 1939 | 12 | 12 | |
| 1940 | 14 | 14 | |
| 1941 | 15 | 15 | |
| 1942 | 8 | 8 | |
| 1943 | 6 | 6 | |
| 1944 | 6 | 6 | |
| 1945 | 5 | 5 | |
| 1946 | 10 | 10 | |
| 1947 | 6 | 6 | |
| 1948 | 7 | 7 | |
| 1949 | 7 | 7 | |
| 1950 | 17 | 2 | 19 |
| 1951 | 22 | 1 | 23 |
| 1952 | 25 | 1 | 26 |
| 1953 | 24 | 4 | 28 |
| 1954 | 30 | 30 | |
| 1955 | 19 | 3 | 22 |
| 1956 | 21 | 5 | 26 |
| 1957 | 27 | 7 | 34 |
| 1958 | 20 | 12 | 32 |
| 1959 | 25 | 16 | 41 |
| 1960 | 38 | 15 | 53 |
| 1961 | 26 | 29 | 55 |
| 1962 | 26 | 20 | 46 |
| 1963 | 27 | 13 | 40 |
| 1964 | 26 | 13 | 39 |
| 1965 | 32 | 18 | 50 |
| 1966 | 33 | 30 | 63 |
| 1967 | 45 | 19 | 64 |
| 1968 | 57 | 20 | 77 |
| 1969 | 44 | 11 | 55 |
| 1970 | 59 | 17 | 76 |
| 1971 | 65 | 20 | 85 |
| 1972 | 56 | 15 | 71 |
| 1973 | 61 | 10 | 71 |
| 1974 | 60 | 10 | 70 |
| 1975 | 59 | 13 | 72 |
| 1976 | 64 | 22 | 86 |
| 1977 | 71 | 16 | 87 |
| 1978 | 81 | 14 | 95 |
| 1979 | 95 | 26 | 121 |
| 1980 | 113 | 24 | 137 |
| 1981 | 98 | 26 | 124 |
| 1982 | 88 | 47 | 135 |
| 1983 | 104 | 32 | 136 |
| 1984 | 117 | 51 | 168 |
| 1985 | 114 | 69 | 183 |
| 1986 | 122 | 44 | 166 |
| 1987 | 121 | 32 | 153 |
| 1988 | 110 | 28 | 138 |
| 1989 | 89 | 58 | 147 |
| 1990 | 76 | 90 | 166 |
| 1991 | 99 | 47 | 146 |
| 1992 | 107 | 42 | 149 |
| 1993 | 88 | 49 | 137 |
| 1994 | 84 | 74 | 158 |
| 1995 | 79 | 62 | 141 |
| 1996 | 64 | 73 | 137 |
| 1997 | 79 | 48 | 127 |
| 1998 | 77 | 45 | 122 |
| 1999 | 65 | 82 | 147 |
| 2000 | 143 | 40 | 183 |
| 2001 | 206 | 83 | 289 |
| 2002 | 114 | ||
| 2003 | 95 | 26 | 121 |
| 2004 | 121 | 57 | 178 |
| 2005 | 129 | 62 | 191 |
| 2006 | 110 | 88 | 198 |
| మొత్తము** | 3383 | 1505 | 4888 |
** ఈ మొత్తాలు 2000 సంవత్సరము వరకే కూడినవి.
[మార్చు] వీటిని చూడండి
- తెలుగు సినిమా నటులు
- తెలుగు సినిమా నటీమణులు
- తెలుగు సినిమా దర్శకులు
- తెలుగు సినిమా నిర్మాతలు
- తెలుగు సినిమా పాటలు
- తెలుగు సినిమా పాటల రచయితలు
- తెలుగు సినిమా 75 సంవత్సరాల హిట్ జాబితా
- తెలుగు సినిమాల జాబితా
- భారతీయ సినిమా
[మార్చు] మూలాలు
- ↑ ది హిందూ ఆంగ్ల పత్రికలో(Tuesday, Apr 30, 2002) Vijayanirmala enters the Guinness శీర్షికన వివరాలు 22 జులై, 2008న సేకరించబడినది.
[మార్చు] వనరులు
[మార్చు] బయటి లింకులు
- తెలుగు సినిమా - తొలి తెలుగు పోర్టల్
- తెలుగు సినిమా నటీమణులు
- తెలుగు సినిమా,ప్రపంచ సినిమా గురించి సమీక్షలు,విశ్లేషణలు,సమాచారం
- సినీవినోదం.కాం
- "అప్పజోస్యుల-విష్ణుభొట్ల-కందాళం ఫౌండేషన్" వారి వెబ్సైటు - తెలుగు పుస్తకాల ఉద్యానవనం-లో తెలుగు సినిమా గురించిన పుస్తకాలు
- ఐడిల్ బ్రెయిన్ - ప్రముఖ పోర్టల్
- ఆంధ్రకేఫ్ - రివ్యూలు,చిత్రాలు,వార్తలు
- గ్రేట్ ఆంధ్రా - వార్తలు, పుకార్లు
- మరికొంత సమాచారం కోసం ప్రాజెక్టు పేజీ చూడండి.
| తెలుగు సినిమాలు | |
|---|---|
| అ | ఆ | ఇ | ఈ | ఉ | ఊ | ఋ | ౠ | ఎ | ఏ | ఐ | ఒ | ఓ | ఔ | అం | అః | క | ఖ | గ | ఘ | ఙ | చ | ఛ | జ | ఝ | ఞ | ట | ఠ | డ | ఢ | ణ | త | థ | ద | ధ | న | ప | ఫ | బ | భ | మ | య | ర | ల | వ | శ | ష | స | హ | ళ | క్ష | ఱ | |
| తెలుగు సినిమాలు | |
|---|---|
| 1931 | 1932 | 1933 | 1934 | 1935 | 1936 | 1937 | 1938 | 1939 | 1940 | 1941 | 1942 | 1943 | 1944 | 1945 | 1946 | 1947 | 1948 | 1949 | 1950 | 1951 | 1952 | 1953 | 1954 | 1955 | 1956 | 1957 | 1958 | 1959 | 1960 | 1961 | 1962 | 1963 | 1964 | 1965 | 1966 | 1967 | 1968 | 1969 | 1970 | 1971 | 1972 | 1973 | 1974 | 1975 | 1976 | 1977 | 1978 | 1979 | 1980 | 1981 | 1982 | 1983| 1984| 1985| 1986| 1987| 1988| 1989| 1990| 1991| 1992| 1993| 1994| 1995| 1996| 1997| 1998| 1999| 2000| 2001| 2002| 2003| 2004| 2005| 2006 | 2007 | 2008 | |