తెనాలి రామకృష్ణుడు
వికీపీడియా నుండి
తెనాలి రామకృష్ణుడు శ్రీ కృష్ణదేవరాయలు ఆస్థానములోని కవీంద్రులు. వీరి స్వగ్రామము గుంటూరు జిల్లా తెనాలి సమీపములోని తుములూరు గ్రామము. స్మార్త శాఖలోని నియోగి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. అష్టదిగ్గజములలో సుప్రసిద్ధులు. ఈయనని తెనాలి రామలింగ కవి అని కూడా అంటారు. అవిభాజ్య విజయనగర సామ్రాజ్య చరిత్ర లో ఈయన ప్రముఖులు. తొలుత సాధారణ వ్యక్తి అయిన రామకృష్ణులు, కాళీమాత వర ప్రసాదం చేత కవీశ్వరులయ్యారు. గొప్ప కావ్యాలు విరచించారు. కానీ తెలుగు వారికి ఆయన ఎక్కువగా హాస్య కవిగానే పరిచయం. ఆయనకు వికటకవి అని బిరుదు కలదు. ఆయనపై ఎన్నో కథలు ఆంధ్ర దేశమంతా ప్రాచుర్యములో కలవు.
మొదట్లో రామకృష్ణుడి ఇంటి పేరు గార్లపాటి అని, తెనాలి నుండి వచ్చినారు కనుక తరువాతి కాలంలో తెనాలి అయినది అని ఒక నానుడి.
విషయ సూచిక |
[మార్చు] రచనలు
ఉద్బటారాధ్య చరిత్ర ఉద్భటుడు అనే యతి గాధ. ఘటికాచల మహాత్మ్యము తమిళనాడు రాష్ట్రంలోని వేలూరు మండలంలోని ఘటికాచల(ప్రస్తుతం షోళింగుర్)క్షేత్రంలో వెలసిన శ్రీ నరసింహ స్వామి వారిని స్తుతిస్తూ వ్రాసిన కావ్యం. పాండురంగ మహాత్మ్యము స్కాంద పురాణము నందలి విఠ్ఠలుని మహాత్మ్యాలు మరియు ఇతర పాండురంగ భక్తుల చరిత్రల సంపుటం.
[మార్చు] అలభ్య రచనలు
ఇవి అలభ్య గ్రంధములు. జగ్గన గారి ప్రబంధ రత్నాకరము లోని కొన్ని పద్యాల వల్ల ఈ గ్రంధ వివరాలు తెలుస్తున్నాయి.
[మార్చు] శైలి
తెనాలి వారు ప్రబంధ శైలిని అనుసరించేవారు. ఇంకనూ వారి కవిత్వంలో హాస్యము, వ్యంగ్యము రంగరించబడి ఉంటాయి
[మార్చు] చాటువులు
వీరు చాటువులు చెప్పడంలో బహు నేర్పరి.
[మార్చు] అల్లసాని పెద్దన వారితో
ఒకమారు అల్లసాని పెద్దన వారు ఒక కవితలో "అమావాశ్యనిశి" ని ఛందస్సు కోసం "అమవసనిసి" అని వాడగా దానికి రామలింగకవి చెప్పిన అద్భుతమైన చాటువు,
ఎమి తిని సెపితివి కపితము
బెమ పడి వెరి పుచ కాయ మరి తిని సెపితో
ఉమెతకాయ తిని సెపితో
అమవస నిసి యన్న మాట అలసాని పెదనా ||
ఇక్కడ "అలసని" అని హేళన చేస్తూ, అమవసనిసి అనేది స్వఛత లేని పదం అని కవీంద్రులు ఘాటుగానే సెలవిచ్చారు.
[మార్చు] ధూర్జటి వారితో
ధూర్జటి వారిని స్తుతిస్తూ రాయలు :
స్తుతమతి యైన యాంధ్ర కవి ధూర్జటి పల్కుల కేల కల్గెనీ
యతులిత మాధురీ మహిమ ?
దానికి రామకృష్ణుని చమత్కార సమాధానం:
హా తెలిసెన్! భువనైక మోహనో
ద్దత సుకుమార వార వనితా జనతా ఘన తాప హారి సం
తత మధురాధరోదత సుధా రస ధారల గ్రోలుటంజుమీ !!
అంటూ ధూర్జటి వారి వేశ్యా సాంగత్యాన్ని ఎత్తి చూపారు.
[మార్చు] కావలి తిమ్మడు
మరొకమారు వాకిటి కావలి తిమ్మడికి రాయలిచ్చిన పచ్చడాన్ని కాజేయటానికి ముగ్గురు ఇతర దిగ్గజాలతో పధకం వేసి
వాకిటి కావలి తిమ్మా !
ప్రాకటముగ సుకవివరుల పాలిటి కొమ్మా !
నీకిదె పద్యము కొమ్మా !
నాకీ పచ్చడమె చాలు నయముగ నిమ్మా !!
అంటూ చివరి పాదంతో పచ్చడం కొట్టేసాడు రామకృష్ణ కవి
[మార్చు] తిరుమలరాయల గురించి
రాయల వరి సోదరులైన తిరుమలరాయల వారు తనపై కవిత ఛెప్పుమని అష్టదిగ్గజములని అర్ధింపగా, అందవిహీనుడు, ఒంటి కన్ను వాడైన తిరుమలరాయల గూర్ఛి యేమి కవిత్వం చెప్పాలి అని సంశయంలో ఉండగా, రామకృష్ణ కవి ఇలా స్తుతించారు.
అన్నాతి గూడ హరుడవే
అన్నాతి గూడనపుడసురగురుడవే
అన్నా తిరుమలరాయా
కన్నొకటి లేదు కాని కౌరవపతివే||
(భార్యతో ఉన్నపుడు నీవు హరుడవు, భార్య ప్రక్కన లేనపుడు రాక్షసగురువైన శుక్రాచార్యుడవు, అన్నా తిరుమలరాయా, నీకు ఇంకో కన్ను లేనిచో కురుపతి దృతరాష్టుడివి)
[మార్చు] తాతాచార్యుల వారితో
ఒకసారి తెనాలి రామకృష్ణుడు లేని సమయంలో శ్రీ కృష్ణ దేవరాయలు "కుంజర యూధంబు దోమ కుత్తుక జొచ్చెన్" అనే సమస్యను పూరణకివ్వగా, సభలో ఎవ్వరూ పూరించలేకపొయారు. అది తెనాలి రామలింగడు ఎలా పూరిస్తాడా అని రాజగురువు తాతాచార్యులవారు అదే సమస్యని ఒక ద్వారపాలకుడితో అడిగిస్తాడు. దానికి తెనలి రామలింగడి పూరణః
గంజావి త్రావి తురకల
సంజాతుల కూడి కల్లు చవిగొన్నావా?
లంజల కొడకా ఎచ్చట
కుంజర యూధంబు దోమ కుత్తుక జొచ్చెన్
అదే సమస్యని రామలింగ కవి శ్రీ కృష్ణ దేవరయల సమక్షంలో పూరించిన విధం:
రంజన చెడి పాందవులరి
భంజనులై ...చెరే విరటు కొల్వు
అకటా విధి నేమందును
కుంజర యూధంబు దొమ కుత్తుక జొచ్చెన్
ఈ పద్యాలు రామలింగని సమయ స్పూర్తిని, కవితా పటిమను చాటి చెపుతాయి.
[మార్చు] సమస్యా పూరణం
రంజన చెడి పాండవులరి
భంజనులై విరటుగొల్వ పాల్పడిరకటా
సంజయ!ఏమని చెప్పుదు
కుంజరయూధంబు దోమ కుత్తుక జొచ్చెన్.
[మార్చు] ప్రెగడరాజు నరస కవి వారి పరాభవం
ఒకమారు, ప్రెగడరాజు నరస కవి అనే ఒక ఉద్దండ పండితుడు రాయల వారి కొలువు సందర్శించి, వారికి ఒక క్లిష్ట సమస్య ఇచ్చినారు. అదేమంటే, ఈ కొలువు లో ఎవరైనా తను రాయలేనంత కఠినమైన చాటువు చెప్పగలరా అని. ఆ సమయములో రాయలు వారు మొదట అల్లసాని పెద్దన వారి వైపు చూసారట. అల్లసాని వారు కొంత సమయము తీసుకొంటుండగా, తెనాలి వారు అందుకొని పండితుల వారిని తికమక పెట్టేలా ఈ చాటువు వల్లించారట.
త్పృ....వ్వట బాబా తల పై
బౄ....వ్వట జాబిల్లి వల్వ బూదట చేదే
బువ్వట చూడగ హుళుళులు....
క్కవ్వట నరయంగ నట్టి హరునకు జేజే !!
ఇది ఆయన సమయస్ఫూర్తికి మచ్చుతునక.ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ అల్లసాని పెద్దన వారు, "షఠ్ఝా మఠ్ఝ కరాడ్ఝ్య వేడ్ఝ్య వసు తఢ్ఝా తఠ్ఝ తఠ్ఝ్యా ఖరే ..." అంటూ చెప్పిన చాటువు అద్భుతం అద్వితీయం.
ఏ పద్యానికైనా అర్ధం చెప్పెదనన్న నరస కవి కి,"మేకతోక, మేకకొక తోక, మెక మేకతోక ......." అనే పద్యము అప్పగించిరి. ఇంకనూ నరస కవి గారు ఇతరుల కవిత్వంలో తప్పులు ఎంచెదననినందులకు కోపంతో,
ఒకని కవిత్వమందెనయునొప్పులు తప్పులు నా కవిత్వమం
దొకనికి తప్పు బట్ట పని యుండదు కాదని తప్పు బట్టినన్
మొకమటు క్రిందుగా దిగిచి మ్రొక్కలు వోవ నినుంప కత్తితో
సికమొదలంట గోతు మరి చెప్పున గొట్టుదు మోము దన్నుదున్ !!
అంటూ, ఇంకనూ శాంతింపక,
తెలియని వన్ని తప్పులని దిట్ట తనాన సభాంతరంబునన్
పలుకగ కాదు రోరి పలు మారు పిశాచపు పాడె గట్ట నీ
పలికిన నోట దుమ్ము వడ భావ్య మెరుంగక పెద్దలైన వా
రల నిరసింతురా ప్రగడ రాణ్ణరసా విరసా తుసా భుసా !!
అని దులిపివైచెను.
[మార్చు] మూలాలు
- తెనాలి రామలింగ[1]
- Tenali Ramakrishna
- K.A. Nilakanta Sastry, History of South India, From Prehistoric times to fall of Vijayanagar, 1955, OUP, New Delhi (Reprinted 2002) ISBN 0-19-560686-8
- Golden age of Telugu Literature
- Literary activity in Vijayanagara Empire
- Tenali Ramakrishna's entry into Bhuvana Vijayam
[మార్చు] బయటి లింకులు
| అష్టదిగ్గజములు |
|---|
| అల్లసాని పెద్దన | నంది తిమ్మన | ధూర్జటి | మాదయ్యగారి మల్లన | అయ్యలరాజు రామభధ్రుడు | పింగళి సూరన | రామరాజభూషణుడు | తెనాలి రామకృష్ణుడు |