తూర్పు గోదావరి
వికీపీడియా నుండి
| ?తూర్పు గోదావరి ఆంధ్ర ప్రదేశ్ • భారతదేశం |
|
|
|
|
| అక్షాంశరేఖాంశాలు: | |
| టైం జోన్ | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
| విస్తీర్ణం | 10,807 కి.మీ² (4,173 చ.మై) |
| ముఖ్య పట్టణము | కాకినాడ |
| ప్రాంతం | కోస్తా |
| జనాభా • జనసాంద్రత • పట్టణ • మగ • ఆడ • అక్షరాశ్యత శాతం • మగ • ఆడ |
4,873,000 (2001) • 451/కి.మీ² (1,168/చ.మై) • 1137000 • 2446000 • 2427000 • 65.49 • 69.97 • 61 |
అక్షాంశరేఖాంశాలు: తూర్పు గోదావరి జిల్లా భారత దేశం లోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ఈశాన్యాన 16° 30' మరియు 18° 20' ఉత్తర అక్షాంశాల మధ్య, 81° 30' మరియు 82° 36' తూర్పు రేఖాంశాల మధ్య ఉన్నది. కాకినాడ దీని ముఖ్యపట్టణం. కాకినాడ రాష్ట్ర రాజధాని హైదరాబాదుకు 564కి.మీల దూరంలో ఉన్నది.
విషయ సూచిక |
[మార్చు] భౌగోళికము
తూర్పు గోదావరి జిల్లాకు ఉత్తరాన విశాఖపట్నం జిల్లా, ఒరిస్సా రాష్ట్రము, తూర్పున, దక్షిణాన బంగాళా ఖాతము, పశ్చిమాన పశ్చిమ గోదావరి జిల్లా, వాయవ్యాన ఖమ్మం జిల్లాలు సరిహద్దులుగా ఉన్నాయి. భౌగోళికంగా జిల్లాను మూడు ప్రాంతాలుగా వర్గీకరించవచ్చు. అవి: డెల్టా, మెట్ట ప్రాంతం, కొండ ప్రాంతాలు. వివిధ ప్రాంతాల ఎత్తులు సముద్ర మట్టం నుండి 300 మీ.ల వరకు ఉన్నాయి.
డెల్టా ప్రాంతంలో కోనసీమ, కాకినాడలోని ప్రాంతాలు, పూర్వపు రామచంద్రపురం, రాజమండ్రి తాలూకాలు ఉన్నాయి. ఈ ప్రాంతం వరి పొలాలతో, అరటి, కొబ్బరి, తమలపాకు తోటలతో, లెక్కలేనన్ని తాడి చెట్లతో కళకళ లాడుతూ ఉంటుంది. సారవంతమైన ఒండ్రు నేలలు, ఇసుకతో కూడిన మట్టి నేలలు డెల్టా ప్రాంతంలో కనిపిస్తాయి.
తుని, పిఠాపురం, పెద్దాపురం, కాకినాడ, రామచంద్రాపురం మరియు రాజమండ్రిలలో కొన్ని ప్రాంతాలను మెట్ట ప్రాంతాలుగా పిలుస్తారు. తూర్పు కనుమలు సముద్ర మట్టం నుండి అంచెలంచెలుగా లేస్తూ, పూర్వపు మన్యం తాలూకాలైన రంపచోడవరం, ఎల్లవరం అంతటా వ్యాపించాయి. గోదావరి, పంప, తాండవ మరియు ఏలేరులు జిల్లాలో ప్రవహిస్తున్న ప్రముఖ నదులు.
ప్రముఖ రైలు, రోడ్డు మార్గాలు జిల్లా గుండా పోతున్నాయి. చెన్నై, కోల్‌కతా లను కలిపే జాతీయ రహదారి, రైల్వే లైనులు జిల్లా గుండా పోతున్నాయి. రాజమండ్రికి 15 కి.మీ.ల దూరంలో ఉన్న మధురపూడి వద్ద ఒక విమానాశ్రయము ఉంటుంది.
[మార్చు] వాతావరణం
ఏడాది పొడుగునా వాతావరణం సాధారణంగా ఉంటుంది. ఏప్రిల్ నుండి జూన్ వరకు మాత్రం ఉష్ణోగ్రతలు 48 డిగ్రీల సెంటీగ్రేడు వరకు పెరుగుతాయి. జిల్లా లోని సాధారణ వర్షపాతం - 1280.0 మి మీ. సగానికి పైగా వర్షపాతం నైరుతి ఋతుపవనాల వలన కలగగా మిగిలినది ఈశాన్య ఋతుపవనాల వలన కలుగుతుంది.
[మార్చు] పాలనా వ్యవస్థ
రెవిన్యూ విభాగాలు 5
1.కాకినాడ 2.పెద్దాపురం 3.అమలాపురం 4.రాజమండ్రి 5.రంపచోడవరం పూర్వపు తాలూకాలు 19
మండలాలు 60 (58 గ్రామీణ + 2 పట్టణ)
మండల ప్రజా పరిషత్తులు 57
పంచాయితీలు 1,011
మునిసిపాలిటీలు, కార్పొరేషనులు 9
పట్టణాలు 14
గ్రామాలు 1379
2001 జనాభా లెక్కల ప్రకారం మొత్తం 59 మండలాలు ఉన్నాయి.
అయితే జివో నంబరు 31 ద్వారా రౌతులపూడి అనే కొత్త మండలాన్ని 44 గ్రామాలతో ఏర్పరచారు. శంఖవరం నుండి 12 గ్రామాలు, కోటనందూరు నుండి 31 గ్రామాలు, తుని నుండి ఒక గ్రామాన్ని విడదీసి ఈ కొత్త మండలాన్ని ఏర్పరచారు. దీనితో మొత్తం 60 మండలాలు అయ్యాయి.
[మార్చు] గణాంకాలు
0-6 ఏళ్ళ మధ్య వయసు గల పిల్లల జనాభా
| మొత్తం | పురుషులు | స్త్రీలు | నిష్పత్తి | |
|---|---|---|---|---|
| గ్రామీణ: | 456003 | 231005 | 224998 | 97.4% |
| పట్టణ: | 121418 | 60911 | 60507 | 99.3% |
| మొత్తం: | 577421 | 291916 | 285505 | 97.8% |
[మార్చు] చరిత్ర
చూడండి తూర్పు గోదావరి జిల్లా చరిత్ర
[మార్చు] మండలాలు
భౌగోళికంగా తూర్పు గోదావరి జిల్లాను 57 రెవిన్యూ మండలాలుగా విభజించిరు[1]. క్రింద ఇచ్చిన పట్టికలో ఉన్నా కాకినాడ (పట్టణ) మరియు రాజమండ్రి (పట్టణ) అనే ప్రాంతాలు రెండూ పట్టణ ప్రాంతాలు మాత్రమే అవి మండలాలు కావు.
![]() |
|||||
| సంఖ్య | పేరు | సంఖ్య | పేరు | సంఖ్య | పేరు |
|---|---|---|---|---|---|
| 1 | మారేడుమిల్లి | 21 | పిఠాపురం | 41 | కపిలేశ్వరపురం |
| 2 | వై.రామవరం | 22 | కొత్తపల్లె | 42 | ఆలమూరు |
| 3 | అడ్డతీగల | 23 | కాకినాడ(గ్రామీణ) | 43 | ఆత్రేయపురం |
| 4 | రాజవొమ్మంగి | 24 | కాకినాడ (పట్టణ) | 44 | రావులపాలెం |
| 5 | కోటనందూరు | 25 | సామర్లకోట | 45 | పామఱ్ఱు |
| 6 | తుని | 26 | రంగంపేట | 46 | కొత్తపేట |
| 7 | తొండంగి | 27 | గండేపల్లి | 47 | పి.గన్నవరం |
| 8 | గొల్లప్రోలు | 28 | రాజానగరం | 48 | అంబాజీపేట |
| 9 | శంఖవరం | 29 | రాజమండ్రి (గ్రామీణ) | 49 | ఐనవిల్లి |
| 10 | ప్రత్తిపాడు | 30 | రాజమండ్రి (పట్టణ) | 50 | ముమ్మిడివరం |
| 11 | ఏలేశ్వరం | 31 | కడియం | 51 | ఐ.పోలవరం |
| 12 | గంగవరం | 32 | మండపేట | 52 | కాట్రేనికోన |
| 13 | రంపచోడవరం | 33 | అనపర్తి | 53 | ఉప్పలగుప్తం |
| 14 | దేవీపట్నం | 34 | బిక్కవోలు | 54 | అమలాపురం |
| 15 | సీతానగరం | 35 | పెదపూడి | 55 | అల్లవరం |
| 16 | కోరుకొండ | 36 | కరప | 56 | మామిడికుదురు |
| 17 | గోకవరం | 37 | తాళ్ళరేవు | 57 | రాజోలు |
| 18 | జగ్గంపేట | 38 | కాజులూరు | 58 | మలికిపురం |
| 19 | కిర్లంపూడి | 39 | రామచంద్రాపురం | 59 | సఖినేటిపల్లి |
| 20 | పెద్దాపురం | 40 | రాయవరం | 60 | రౌతులపూడి |
[మార్చు] మూలాలు
- ↑ పంచాయత్ రాజ్ మంత్రిత్వ శాఖ వెబ్‌సైటులో తూర్పు గోదావరి జిల్లా తాలూకాల వివరాలు. జూలై 26, 2007న సేకరించారు.
[మార్చు] బయటి లింకులు
|
|
|
|---|---|
| ఆంధ్ర ప్రదేశ్ విషయాలు · చరిత్ర · రాజకీయాలు · తెలుగు ప్రజలు | |
| రాజధాని | హైదరాబాద్ |
| జిల్లాలు | అనంతపురం · అదిలాబాదు · కడప · కరీంనగర్ · కర్నూలు · కృష్ణ · ఖమ్మం · గుంటూరు · చిత్తూరు · తూర్పు గోదావరి · నల్గొండ · నిజామాబాదు · నెల్లూరు · పశ్చిమ గోదావరి · ప్రకాశం · మహబూబ్ నగర్ · మెదక్ · రంగారెడ్డి · వరంగల్ · విజయనగరం · విశాఖపట్నం · శ్రీకాకుళం · హైదరాబాదు |
| ప్రధాన నగరాలు | హైదరాబాదు · విశాఖపట్నం · విజయవాడ · తిరుపతి · వరంగల్ · గుంటూరు · రాజమండ్రి · కాకినాడ · నెల్లూరు · కర్నూలు · అనంతపురం · ఏలూరు · మచిలీపట్నం · కరీంనగర్ · కడప · ఖమ్మం · నిజామాబాదు · మహబూబ్ నగర్ |
