తిథి
వికీపీడియా నుండి
వేద సమయానుసారము ఒక చాంద్రమాన రోజును తిథి అంటారు లేదా శాస్త్రీయముగా సూర్యుడు మరియు చంద్రున్ని కలుపుతూ ఉన్న ఆక్షాంశ కోణము 12 డిగ్రీలు పెరగడానికి పట్టే కాలాన్ని తిధి అనవచ్చు. తిధులు రోజులోని ఏ వేళలలో అయినా మొదలయ్యి, అంతమయ్యే అవకాశము ఉన్నది. ఒక్కొక్క తిధి దాదాపు 19 నుండి 26 గంటల సమయము ఉంటుంది. ప్రతి చాంద్రమాసములో 30 తిధులు ఉంటాయి.
[మార్చు] పక్షంలోని తిథులు
- పాడ్యమి (అధి దేవత - అగ్ని)
- విదియ (అధి దేవత - బ్రహ్మ)
- తదియ (అధి దేవత - గౌరి)
- చవితి (అధి దేవత - వినాయకుడు)
- పంచమి (అధి దేవత - సర్పము)
- షష్టి (అధి దేవత - కుమార స్వామి)
- సప్తమి (అధి దేవత - సూర్యుడు)
- అష్టమి (అధి దేవత - శివుడు)
- నవమి (అధి దేవత - దుర్గా దేవి)
- దశమి (అధి దేవత - యముడు)
- ఏకాదశి (అధి దేవత - శివుడు)
- ద్వాదశి (అధి దేవత - విష్ణువు)
- త్రయోదశి (అధి దేవత - మన్మధుడు)
- చతుర్దశి (అధి దేవత - శివుడు)
- పున్నమి/పూర్ణిమ/పౌర్ణమి లేక అమావాస్య (అధి దేవత - చంద్రుడు)