Dzisiaj jest niedziela, 23 listopada 2008 r. 328 dzien roku
Languages:ar | id | bg | ca | ceb | cs | da | de | et | en | es | eo | fr | he | hr | it | ko | lt | hu | nl | ja | no | pl | pt | ru | ro | sk | sl | sr | fi | sv | te | tr | uk | zh






REKLAMA
mp3

తిక్కవరపు పఠాభిరామిరెడ్డి

వికీపీడియా నుండి

తిక్కవరపు పఠాభిరామిరెడ్డి

తిక్కవరపు పఠాభిరామిరెడ్డి ప్రముఖ తెలుగు కవి, తెలుగు, కన్నడ సినిమా నిర్మాత, దర్శకుడు. పఠాభిగా ఆయన ప్రసిద్ధుడు. ఫిడేలు రాగాల డజన్, పఠాభి పన్‌చాంగం అనేవి ఆయన ప్రసిద్ధ రచనలు. ఆయన తెలుగులో పెళ్లినాటి ప్రమాణాలు, శ్రీకృష్ణార్జున యుద్ధం, భాగ్యచక్రం సినిమాలు నిర్మించాడు. కన్నడ సినిమా రంగానికి తొలి స్వర్ణ కమలం సాధించిపెట్టిన సంస్కార చిత్రాన్ని నిర్మించి, దర్శకత్వం వహించాడు. చండ మారుత, శృంగార మాస, దేవర కాడు అనే కన్నడ సినిమాలను నిర్మించాడు. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. సాహిత్యం, సినిమాలేగాక రాజకీయ, సామాజిక రంగాల్లో కూడా కృషి చేసాడు.

విషయ సూచిక

[మార్చు] జీవిత విశేషాలు

పఠాభి - స్నేహలత

పఠాభి 1919 ఫిబ్రవరి 2నెల్లూరులో స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబంలో జన్మించాడు. తండ్రి పేరు రామిరెడ్డి. భూస్వామి. మహాత్మా గాంధీ వారి ఇంటికి వచ్చినపుడు, ఆయన స్ఫూర్తితో అంతా స్వాతంత్య్ర సమరంలోకి దూకారు. రవీంద్రనాధ టాగూరు స్ఫూర్తితో పఠాభి శాంతి నికేతన్‌కు వెళ్ళి చదువుకున్నాడు. పట్టభద్రుడయ్యాక కలకత్తా విశ్వవిద్యాలయంలో ఆంగ్ల సాహిత్యంలో మాస్టర్స్ డిగ్రీ చదివాడు. 1938లో కలకత్తా నుండి తిరిగివచ్చి కొన్నాళ్ళు గూడూరులో కుటుంబ వ్యాపారమైన అభ్రకం ఎగుమతి వ్యాపారం చేసాడు. తరువాత అమెరికాలోని కొలంబియా విశ్వవిద్యాలయంలో గణితం చదివాడు. అమెరికా వెళ్లేముందే ఫిడేలు రాగాల డజన్‌ రచించాడు. తెలుగు ఆధునిక కవిత్వంలో ఇది కొత్త పుంతలు తొక్కింది. ఇప్పటికీ దానికి ఆదరణ ఉండడం గమనార్హం. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో సైన్యంలో చేరాలని అమెరికా బలవంతపెట్టింది. బ్రిటిష్‌వాళ్లు భారతీయుల్ని జైళ్లలో నెట్టినందుకు నిరసనగా సైన్యంలో చేరేందుకు నిరాకరించారు. సాహసోపేత యాత్రతో అమెరికా వదిలి దక్షిణ అమెరికా, ఆఫ్రికాల మీదుగా నౌకలో భారత్‌ చేరుకున్నాడు.

పఠాభి కుటుంబ సభ్యులు

దేశంలో అడుగుపెట్టాక 1947లో స్నేహలతా పావెల్‌ అనే స్పానిష్‌ మహిళను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆమె నటి. సామాజిక కార్యకర్త కూడా. ఆమె కోసం అపారమైన ఐశ్వర్యాన్ని సైతం వదులుకున్నాడు. దంపతులిద్దరూ ఎమర్జెన్సీ వ్యతిరేక ఉద్యమంలో పాలుపంచుకున్నారు. పీపుల్స్‌ యూనియన్‌ ఆఫ్‌ సివిల్‌ లిబర్టీస్ వ్యవస్థాపక సభ్యుల్లో ఆయనొకడు. సోషలిస్టు పార్టీలో పనిచేశాడు. వీరికి ఇద్దరు సంతానము. కుమారుడు కోనార్క్ రెడ్డి ప్రముఖ ఫ్లెమెంకో గిటార్ వాద్యకారుడు. కూతురు నందనారెడ్డి కార్మిక న్యాయవాది, సామజిక సేవ కార్యకర్త


కె.వి.రెడ్డితో కలిసి జయంతి పిక్చర్స్‌ను స్థాపించి తెలుగు చిత్రాలు తీశారు. పెళ్లినాటి ప్రమాణాలు చిత్రం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ అవార్డు దక్కించుకుంది. 1971లో సంస్కార చిత్రం రాష్ట్రపతి నుంచి స్వర్ణకమలం అందుకుంది. ఈ సినిమాలో ఆయన భార్య స్నేహలత కథానాయిక. ఎమర్జెన్సీ సమయంలో జైలు జీవితం అనుభవించి, అనారోగ్యంతో స్నేహలత 1977లో మరణించింది.

87 ఏళ్ళ వయసులో 2006 మే 6న పఠాభి బెంగుళూరులో మరణించాడు.

[మార్చు] పఠాభి గురించి

  • పఠాభి పంచాంగంలోని పసిడి పలుకుల విటమిన్‌-బి గుళికలను రోజుకొకటి చొప్పున సేవిస్తే తెలుగువాడి మనస్సుకి ఆరోగ్యము, ఉల్లాసము సిద్ధిస్తాయని నేను గ్యారంటీగా చెప్పగలను. ఏ సిద్ధ మకరధ్వజానికి, వసంత కుసుమాకరానికీ లేని పునరుజ్జీవన శక్తి ఈ మాత్రలకుంది. - అని మహాకవి శ్రీశ్రీ ఆయనకు కితాబిచ్చాడు.
  • భావ కవిత్వం మీద పనిగట్టుకుని దండయాత్ర చేసినవాడు పఠాభి. ఫిడేలు రాగాల డజన్ భావకవిత్వ హేళన ప్రతిభావంతంగా చేసిన కావ్యం. శుక్లపక్షంలా జడ దృక్పథంతో భావకవిత్వాన్ని హేళన చేసిన కావ్యం కాదిది. భావకవిత్వం వల్ల ఏర్పడిన జడత్వాన్ని తొలగించే దృక్పథంతో చేసిన ప్రాణవంతమైన హేళన ఇది. - వెల్చేరు వారాయణరావు [1]
  • 1930-40ల మధ్య భావ కవిత్వం మీద తిరుగుబాటు చేసి క్రొత్త ప్రయోగాలు చేసిన కవులు ... భావ ప్రధానంగా తిరుగుబాటు చేసినవారు శ్రీశ్రీ, శ్రీరంగం నారాయణబాబు. ఛందస్సు ప్రధానంగా తిరుగుబాటు చేసినవారు శిష్ట్లా, పఠాభి. - రావి రంగారావు[2]
  • తెలుగులో ముద్రింపబడ్డ తొలి తెలుగు వచనల సంపుటి "ఫిడేలు రాగాల డజన్"

[మార్చు] రచనలు

ఉదాహరణగా కొన్ని కవితలు

నా యీ వచన పద్యాలనే దుడ్డుకర్రల్తో
పద్యాల నడుముల్ విరగ దంతాను
చిన్నయసూరి బాల వ్యాకరణాన్ని
చాల దండిస్తాను...
అనుసరిస్తాను నవీన పంథా, కానీ
భావకవిన్ మాత్రము కాను నే
నహంభావకవిని.




మహానగరము మీద మబ్బుగమ్మి
గర్జిస్తున్నది
దేవుని ఏరోప్లేనుల్ భువికి దిగుచుననటుల



క్రాస్వర్డు పజిల్ లాగున్న
నీ కన్నులను సాల్వుజేసే మహాభాగ్యం
ఏ మానవునిదోగదా!



వాకు విచిత్రంబగు భావాలు కలవు
నా కన్నులందున టెలిస్కోపులు
మయిక్రాస్కోపులున్నవి


[మార్చు] సినిమాలు


[మార్చు] మూలాలు, వనరులు

  1. #భావ కవిత్వం మీద దండయాత్ర: ఫిడేల్ రాగాల డజన్ - "ఈమాట" అంతర్జా పత్రికలో వెల్చేరు నారాయణరావు వ్యాసం
  2. "శత వసంత సాహితీ మంజీరాలు - వంద పుస్తకాలపై విశ్లేషణ - ప్రచురణ: ఆంధ్ర ప్రదేశ్ గ్రంధాలయ సంఘం, సర్వోత్తమ భవనం, విజయవాడ - ఇందులో "ఫిడేలు రాగాల డజన్" గురించిన వ్యాసం రావి రంగారావు రచించాడు. (రేడియో ఉపన్యాసం ముద్రించబడింది)
  1. ఈనాడు
  2. హిందూ పత్రిక

[మార్చు] బయటి లింకులు

  1. హిందూలో వ్యాసం
  2. ఈమాట నివాళి
  3. భావ కవిత్వం మీద దండయాత్ర: ఫిడేల్ రాగాల డజన్
  4. మా లిఖ

Polska, Dolar, Forex


Wikipedia jest zarejestrowanym znakiem towarowym Wikimedia Foundation
Wszystkie materiay pochodz z Wikipedii, obite s licencj GNU Free Documentation License