Dzisiaj jest niedziela, 23 listopada 2008 r. 328 dzien roku
Languages:ar | id | bg | ca | ceb | cs | da | de | et | en | es | eo | fr | he | hr | it | ko | lt | hu | nl | ja | no | pl | pt | ru | ro | sk | sl | sr | fi | sv | te | tr | uk | zh






REKLAMA
mp3

తలకోన

వికీపీడియా నుండి

తలకోనలోని జలపాత దృశ్యం

తలకోన చిత్తూరు జిల్లా యెర్రావారిపాలెం మండలంలో ఉన్న ఒక ప్రసిద్ధ పర్యాటక కేంద్రం. తిరుపతి కి 45 కి.మీ దూరంలో నల్లమల పర్వతశ్రేణుల మధ్యలో ఉన్నది. ఇక్కడ 60 మీటర్ల ఎత్తు నుండి పడుతున్న జలపాతాలు చాలా అకర్షణీయంగా ఉంటాయి. ఓషధీ లక్షణాలు కల మొక్కలు అనేకం ఉన్నాయి. ఇక్కడ చేరగానే మొదట మనం కనుగొనేది సిద్దేశ్వరాలయము మరియు అమ్మవారు, విఘ్నేశ్వరుడు, సుబ్రమణ్యస్వామి ఆలయాలు. అలయానికి అతిసమీపముగా వాగు ఒకటి ఎల్లపుడూ ప్రవహిస్తూంటుంది. ఇందులోని నీరు చాల తేటగాను చాల చల్లగాను ఉంటాయి.

తలకోనలో ఆంధ్ర ప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ వారి పున్నమి అతిథి గృహం ఉంది.

ఆలయము నుండి కొంత ముందుకు సాగిన నెలకోన, దిగువ ఝరి, ఎగువ ఝరి లకు వళ్ళవచ్చు. ఈ మూడింటికి చాల ప్రాముఖ్యత ఉంది. నెలకోన అన్నది దట్టమైన కొండల మద్య ఉంది. ఇక్కడి రెండు కొండల నడుమ ఒక నీటి ప్రవాహము వచ్చి ఒక కొలనులో దూకుతూ ఉంటుంది. ఈ కొలను యొక్క లోతు ఎవరూ కనుగొనలేదు. అంత సాహసము ఎవరూ చేయలేదు. ఇక్కడ చెప్పుకోదగ్గ ఇంకొక అంశము రెండు కొండల నడుమ ఉండే పెద్ద గుండు రాయి. ఇది ఎప్పడు మీద పడుతందో అని భయపడక మానరు, చూసిన వారు.

తలకోన జలపాతం - మరో దృశ్యం
"http://te.wikipedia.org/wiki/%E0%B0%A4%E0%B0%B2%E0%B0%95%E0%B1%8B%E0%B0%A8" నుండి వెలికితీశారు

Polska, Dolar, Forex


Wikipedia jest zarejestrowanym znakiem towarowym Wikimedia Foundation
Wszystkie materiay pochodz z Wikipedii, obite s licencj GNU Free Documentation License