తణుకు
వికీపీడియా నుండి
| ?తణుకు మండలం పశ్చిమ గోదావరి • ఆంధ్ర ప్రదేశ్ |
|
|
|
|
| అక్షాంశరేఖాంశాలు: (అక్షాంశరేఖాంశాలు కనుక్కోండి) | |
| టైం జోన్ | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
| ముఖ్య పట్టణము | తణుకు |
| జిల్లా(లు) | పశ్చిమ గోదావరి |
| గ్రామాలు | 8 |
| జనాభా • మగ • ఆడ • అక్షరాశ్యత శాతం • మగ • ఆడ |
140,181 (2001) • 69632 • 70549 • 82.40 • 86.02 • 78.82 |
తణుకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఒక మండలము. దీనినే తారకాపురం, తారకాసుర పట్నం అని కూడా ఆంటారు.
[మార్చు] పేరు పుట్టుక
స్థల పురాణాల ప్రకారం ప్రస్తుత తణుకు ప్రాతం అసురుల(రాక్షసులు) రాజైన తారకాసురుని రాజ్య రాజధానిగా చెప్పబడుచున్నది. పరిసర ప్రాంతాలలో ఈ కధనానికి సంబందించిన కొన్ని చారిత్రక ఆధారాలు కూడా లభ్యమవుచున్నాయి. అవి కొన్ని ఇక్కడ పొందు పరిచాము. ప్రస్తుత పాలంగి ఆ రోజులలో పూలంగి( పూల కొట్టు) గానూ, ప్రస్తుత చివటం గ్రామం శ్రీవతం(ఆర్ధిక కార్యకలాపాల కేంద్రం) గానూ, అప్పటి ధాన్యాగారమే ఇప్పటి వడ్లూరు గానూ, ఇప్పటి పైడిపర్రు అప్పటి స్వర్ణాగారం(బంగారం భద్రపరుచు ప్రాంతం) గానూ, బహుశా ఇప్పటి రేలంగి అప్పటి రత్నాల అంగడి గానూ భావిస్తారు.
ఈ తారకాసురుని సంహరించడానికి వీరభధ్రుడు దేవగణానికి సైన్యాధ్యక్షుడై వచ్చాడని ప్రతీతి. వీరిరువురి మధ్యన జరిగిన భీకర యుద్దంలో కుమారస్వామి తారకాసురుని వధించిన తరువాత ఇంద్రునికి అల్లుడైనాడు. ఈ యుద్దం నుండే చాలా గ్రామాలకు పేరు స్తిర పడినట్లుగా చెబుతారు. కుమారస్వామి భూమిపై అడుగిడిన ప్రాంతాన్ని కుమరవరం గా, తణుకు సరిహద్దు గ్రామమైన వీరభధ్ర పురం వీరభధ్రుడికి విడిది అని, అలాగే దేవతలు విడిదియై ఉన్న గ్రామమం వేల్పూరు(వేల్పుల ఊరు, వేల్పులు = దేవతలు) గా పిలవబడుచున్నదని చెబుతారు.ఈ కథను బలపరిచే విధంగానే వేల్పూరు గ్రామంలో ఎన్నో గుడులు(ఆలయాలు) ఉండడం మనము గమనించవచ్ఛు. ఈ ఆలయాల సంఖ్య 101 పైనే ఉన్నది.అలాగే ఇంద్రుడు విడిది చేసిన ప్రాంతాన్ని ఇల్లింద్రపర్రు గానూ, అలాగే కావలిపురం, మహాలక్ష్మి చెఱువు మొదలైన గ్రామాల పేర్లు ఈ కథను బలపరిచేవిగానే కనపడుచున్నవి. ఇవన్నీ ఎలా ఉన్ననూ తణుకు యొక్క ప్రశస్తి పురాణాలలో కూడా ఉన్నట్లు పండితులు చెబుతారు. ఆదికవి నన్నయ ఇక్కడే యాగం చేసినట్లు చరిత్ర చెబుతోంది.
[మార్చు] భౌగోళికము
- తణుకు 16o 45' ఉ , 81o 42' తూర్పు అక్షాంశ , రేఖాంశముల మధ్య ఉంది.
[మార్చు] చరిత్ర
గోస్తని నది పుణ్యజలధారలతో పునీతమైన తణుకు ప్రాంతంలోనే మహాభారతాన్ని ఆంధ్రీకరించిన ఆది కవి నన్నయ్య యజ్ఞం చేసినట్టుగా చారిత్రక ప్రశస్తి ఉంది. దీనిని బట్టి తణుకు ఫ్రాంతానికి కనీసం వెయ్యేళ్ళ చరిత్ర ఉన్నట్లు స్పష్టమవుతున్నది. మధ్యయుగాలలో, ఆధునిక యగంలో తణుకు ప్రశస్తి అనేక చోట్ల కన్పిస్తూవచ్చింది[ఆధారం కోరబడినది]. వర్తమానంలో తణుకు ప్రాధాన్యం అంతర్జాతీయ స్థాయిలో విన్పిస్తూవుంది. వ్యావసాయకంగాను, పారిశ్రామికంగాను, విద్య, వైద్య రంగాలలోను తణుకు ఎంతో అభివృద్ది చెందింది[ఆధారం కోరబడినది]. తణుకు మండలానికి చెందిన మండపాక గ్రామం , వేల్పూరు గ్రామం రాజకీయ చైతన్యానికి మరియు ఆధునిక వ్యవసాయ పరిజ్ఞాన వినియోగానికి జిల్లా మొత్తంలో ముందువరుసలో ఉన్నాయి[ఆధారం కోరబడినది].
[మార్చు] తణుకు లో కవులు
- ఆది కవి నన్నయ్య
- దేవరకొండ బాలగంగాధరతిలక్
- ముదిగంటి జగ్గన్న శాస్త్రి
- కళాప్రపూర్ణ పండిత పెనుమత్స సత్యనారాయణరాజు (తెలుగు రాజు)
- ఘండికోట సుబ్రహ్మణ్య శాస్త్రి
- రసరాజు
- డా.వేదుల సూర్యనారాయణ శర్మ
- వేదుల సూరి
- పామర్తి రమణ
- డా.తంగిరాల సుబ్బారావు
- డా.వి.వై.వి.సోమయాజి
- తాళ్లభట్టు పాపరాజు
- టి.వి.కె సోమయాజులు
- కొప్పర్తి వెంకటరమణమూర్తి
- పడాల సత్యనారాయణరెడ్డి
- సుశర్మ
- కోట.వేంకట లక్ష్మీనరసింహం - సహస్రావధాని
- మోటమర్రి సూర్య కిరణ్
- రంగావఝల రవి నాగ వెంకట శాష్త్రి
- అక్కిపెద్ది రామ సూర్యనారాయణ - అష్టావధాని
[మార్చు] తణుకు లో సాంస్కృతిక సేవా రంగాలు
- శ్రీ నన్నయ్య భట్టారక పీఠము
- స్త్రీ సమాజం
- రామకృష్ణ సేవాసమితి
- శ్రీ త్యాగరాజస్వామి ఆరాధన ఉత్సవ సోసైటి
- రోటరీ క్లబ్ ఆఫ్ తణుకు
- తణుకు లయస్స్ క్లబ్
[మార్చు] రవాణా వ్యవస్థ
[మార్చు] రైలు రవాణా
[మార్చు] రోడ్డు రవాణా
[మార్చు] పరిశ్రమలు
|
[మార్చు] విద్యాలయాలు
సంపూర్ణ అక్షరాస్యతకు మార్గదర్శి తణుకు
అక్షరాస్యతా వార్తలలో తణుకు పట్టణం ప్రత్యేక స్థానంలో ఉంది. 2000 సెప్టెంబర్ 8న అక్షరయజ్ఞం పేరుతో సంపూర్ణ అక్షరాస్యతా ఉద్యమానికి ఈ పట్టణం శ్రీకారం చుట్టింది.2001 మార్చి 15న శాసనసభలో పాఠశాల విద్యాశాఖ మంత్రి సంపూర్ణ అక్షరాస్యతా సాధించిన తొలి పట్టణంగా తణుకును ప్రకటించారు. ఇప్పుడు నిర్బంధ ప్రాధమిక విద్యను ప్రవేశపెట్టడానికి తీర్మానించిన తొలి తెలుగు పట్టణంగా ముందుకు వచ్చింది.
- శతవసంతాల పాఠశాల జడ్.పి.బాలుర ఉన్నత పాఠశాల
- శ్రీమతి జాస్తి సీతామహాలక్ష్మి జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల
- శ్రీ తిమ్మరాజు ఉన్నత పాఠశాల
- యస్.ఎం.వి.యం పాలిటిక్నిక్
- ఆకుల శ్రీ రాములు సాంకేతిక కళాశాల
- అంద్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల
- శ్రీ చిట్టూరి ఇంద్రయ్య మెమోరియల్ గవర్నమెంటు డిగ్రీ కళాశాల
- ఎస్.ఎన్.వి.టి ప్రభుత్వ జూనియర్ కళాశాల
- శ్రీమతి కొండేపాటి సరోజినిదేవి మహిళా కళాశాల
- మున్సిపల్ పాఠశాలలు
- భారతీ విద్యాలయం
- శశి విద్యాసంస్థలు
- గురజాడ విద్యానికేతన్
ఎస్.ఎఫ్.ఎస్ విద్యాలయం
[మార్చు] దేవాలయాలు
ఆద్యాత్మికతకు ఆనవాళ్ళు తణుకు దేవాలయాలు
సిరిసంపదలతో,వ్వవసాయ,పారిశ్రామిక రంగాలలో పరిపుష్టిగా ఉన్న తణుకు పట్టణం, ఆద్యాత్మిక రంగంలో కూడా ప్రత్యేకస్దానం పోందింది.
- కపర్దీశ్వరస్వామి ఆలయం
- శ్రీ కేశవస్వామి వారి దేవస్థానము
- సిద్దేశ్వరస్వామి ఆలయం
- వేంకటేశ్వరస్వామి దేవాలయం
- శ్రీ సీతారామాంజనేయస్వామి ఆలయం
- సూర్య దేవాలయం
- సాయిబాబా గుడి
- వినాయకుని గుడి
- కన్యకాపరమేశ్వరి ఆలయం
- జైన దేవాలయం
- శ్రీ రామసుబ్రహ్మణ్యశ్వరస్వామి దేవాలయం
- ముత్యాలమ్మ గుడి
- రామాలయమ్
- పామర్తి వారి గుడి (నటరాజ స్వామి ఆలయం)
- యల్లారమ్మ దేవాలయం (మండపాక)
[మార్చు] పండుగలు
తణుకు లో జరుపుకొనే ముఖ్యమైన పండుగలు:
- సంక్రాంతి: సూర్యుడు మకరరాశిలో ప్రవేశించినపుడు సంక్రాంతి పండుగ ను జరుపుకుంటారు. సాధారణంగా ఇది జనవరి 14 న వస్తుంది.
- కేశవశ్వామి తిరునాళ్ళు : తిరునాళ్ళు, రధోత్సవం, గరడ వాహన సేవ
- ముత్యాలమ్మ జాతర
- ఉగాది: తెలుగు నూతన సంవత్సర ప్రారంభ దినమైన చైత్ర శుద్ధ పాడ్యమిని ఉగాదిగా జరుపుకుంటారు. సాధారణంగా ఇది మార్చి/ఏప్రిల్ నెలల లో వస్తుంది.
- వినాయక చవితి: భాద్రపద శుద్ధ చవితి. ఆగష్టు/సెప్టెంబర్ నెలలలో వస్తుంది.
- దసరా: ఆశ్వయుజ శుద్ధ దశమి. అక్టోబర్ నెలలో వస్తుంది.
- దీపావళి: ఆశ్వయుజ బహుళ అమావాస్య. నవంబర్ నెలలో వస్తుంది .
- శ్రీరామనవమి: చైత్ర శుద్ధ నవమి. మార్చి/ఏప్రిల్ నెలలలో వస్తుంది.
- సుబ్రమణ్య షష్టి
[మార్చు] తణుకు లో బ్యాంకులు
- ఇండియన్ బ్యాంక్(1938)
- ఆంధ్రాబ్యాంక్(1954)
- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(1957)
- సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(1959)
- ది వైశ్యా బ్యాంక్(1976)
- విజయా బ్యాంక్(1976)
- జిల్లా సహకర కేంద్ర బ్యాంక్(1976)
- స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్(1979)
- యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(1993)
- ది లక్ష్మి విలాస్ బ్యాంక్(1993)
- భీమవరం కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్(1996)
- బ్యాంక్ ఆఫ్ ఇండియా(1997)
- ది వాణి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్(1999)
- కోస్టల్ బ్యాంక్(2001)
- కెనరా బ్యాంక్(2003)
- యూనిటి ట్రాస్ట్ ఆఫ్ ఇండియా(2005)
- యౌ.టి.ఐ.బ్యాంక్
- హెచ్.డి.ఎఫ్.సి.బ్యాంక్
- ఐ.సి.ఐ.సి.ఐ.బ్యాంక్
- కారొఎరేషన్
[మార్చు] రెస్టారెంట్లు:
1) జే.కే
2)ఫుడ్-ఎక్స్ (ఇది వరకు డైమెండ్)
3)స్కందపుర్వజ
4)తాజ్ దర్బార్
5)గ్రీన్ ల్యాండ్
[మార్చు] సినిమాథియేటర్లు
- శ్రీ వీరనారాయణ
- శ్రీ శ్రీనివాసా
- వెంకటకృష్ణా
- లక్ష్మి
- పద్మశ్రీ
- శ్రీచిత్ర
- వెంకటేశ్వర
- నరేంద్ర
- మినీ నరేంద్ర
- ప్రత్యూష
- మినీ ప్రత్యూష
- వెంకట్రామయ్య
- ప్రసాద్
- నాగా
[మార్చు] తణుకు చిత్రపటం
[మార్చు] తణుకు చిత్రాలు
[మార్చు] ఇతర సమాచారం
- తణుకు గ్రామ దేవత : ముత్యాలమ్మ
- తణుకు పిన్ కోడ్ : 534211
- తణుకు టెలిపోన్ యస్.టి.డి కోడ్ : 08819
- తణుకు ఆర్టీసీ మరియు షాట్ కట్ కోడ్ : TNK
- తణుకు రైల్వే కోడ్ : TNKU
[మార్చు] వికిమాపియా లో తణుకు
[మార్చు] బయటి లింకులు
[మార్చు] మండలంలోని పట్టణాలు
[మార్చు] గ్రామాలు
|
|
|
|---|---|
|
జీలుగుమిల్లి · బుట్టాయగూడెం · పోలవరం · తాళ్ళపూడి · గోపాలపురం · కొయ్యలగూడెం · జంగారెడ్డిగూడెం · టి.నరసాపురం · చింతలపూడి · లింగపాలెం · కామవరపుకోట · ద్వారకా తిరుమల · నల్లజర్ల · దేవరపల్లి · చాగల్లు · కొవ్వూరు · నిడదవోలు · తాడేపల్లిగూడెం · ఉంగుటూరు · భీమడోలు · పెదవేగి · పెదపాడు · ఏలూరు · దెందులూరు · నిడమర్రు · గణపవరం · పెంటపాడు · తణుకు · ఉండ్రాజవరం · పెరవలి · ఇరగవరం · అత్తిలి · ఉండి · ఆకివీడు · కాళ్ళ · భీమవరం · పాలకోడేరు · వీరవాసరము · పెనుమంట్ర · పెనుగొండ · ఆచంట · పోడూరు · పాలకొల్లు · యలమంచిలి · నరసాపురం · మొగల్తూరు |
|
