Dzisiaj jest niedziela, 23 listopada 2008 r. 328 dzien roku
Languages:ar | id | bg | ca | ceb | cs | da | de | et | en | es | eo | fr | he | hr | it | ko | lt | hu | nl | ja | no | pl | pt | ru | ro | sk | sl | sr | fi | sv | te | tr | uk | zh






REKLAMA
mp3

జాయప నాయుడు

వికీపీడియా నుండి

జాయప నాయుడు లేక జాయప సేనాని కాకతీయ చక్రవర్తి గణపతిదేవుని కడ పనిచేసిన సేనాధిపతి. 1241 లో వెలనాటి చోడులపై గణపతి విజయము పిదప వెలనాడు, కమ్మనాడు లోని వీరులందరు ఓరుగల్లు కు తరలిపోయారు. అట్టివారిలో జాయప ఒకడు. ఆతనిని చక్రవర్తి గజబలగానికి అధిపతిగా చేశాడు. జాయప చెల్లెళ్ళగు నారమ్మ పేరమ్మలను గణపతి పెండ్లి చేసుకున్నాడు. హనుమంతరావు గారి అభిప్రాయము ప్రకారము కాకతీయ కమ్మ నాయకులకు జాయప ఆద్యుడు.

జాయప దుర్జయ వంశము అయ్య పరివారమునకు చెందినవాడు. తండ్రి పిన్న చోడుడు. తాత నారప్ప. ఈతను దివిసీమను పాలించాడు. కొడుకులు చోడ, పిన్న చోడ, భీమ మరియు బ్రహ్మ వెలనాటి చోడులవద్ద సైన్యములోవున్నారు.


జాయప కళింగదేశదండయాత్ర లో పాల్గొని సాధించిన విజమునకు గణపతిదేవుడు వైరిగోధూమ ఘరట్ట అను బిరుదు ఇచ్చాడు. 1231 లో మహారాజు పై గౌరవపూర్వకముగా గణపేశ్వరునిపేరుపై గుడి కట్టించి గ్రామాలను దానమిచ్చాడు. తన తండ్రి పేరుమీద చేబ్రోలు లో చోడేశ్వరాలయము కట్టించి గుడి ఖర్చులకు మోదుకూరు గ్రామమము రాసి ఇచ్చాడు. 1325 చేబ్రోలు శాసనము ప్రకారము గుడి ముందు రెండు వరుసలలో రెండంతస్థుల ఇళ్ళు కట్టించి దేవదాసీలకు ఇచ్చాడు.

జాయప భారతదేశమందలి నాట్యములపై నృత్యరత్నావళి అను సంస్కృత గ్రంథము వ్రాశాడు. దీనినిబట్టి జాయప నాట్యములో, నాట్యశాస్త్రములో నిష్ణాతుడని తెలుస్తుంది.

[మార్చు] వనరులు

  • ఆంధ్రుల చరిత్ర, చిలుకూరి వీరభద్రరావు
  • కమ్మవారి చరిత్ర, కొత్త భావయ్య, 1939, కొత్త ఎడిషను, పావులూరి పబ్లిషర్సు, గుంటూరు, 2006.
  • బౌద్ధము-ఆంధ్రము, హనుమంతరావు, బి.యస్.యల్, 1995, తెలుగు విశ్వవిద్యాలయము, హైదరాబాదు.(http://www.archive.org/details/bouddamuandhramu018708mbp).
  • నృత్య రత్నావళి.(http://www.telugupeople.com/discussion/article.asp?id=111)

Polska, Dolar, Forex


Wikipedia jest zarejestrowanym znakiem towarowym Wikimedia Foundation
Wszystkie materiay pochodz z Wikipedii, obite s licencj GNU Free Documentation License