Dzisiaj jest niedziela, 23 listopada 2008 r. 328 dzien roku
Languages:ar | id | bg | ca | ceb | cs | da | de | et | en | es | eo | fr | he | hr | it | ko | lt | hu | nl | ja | no | pl | pt | ru | ro | sk | sl | sr | fi | sv | te | tr | uk | zh






REKLAMA
mp3

గోరా

వికీపీడియా నుండి

గోరా (Gora) (1902 -1975) గా ప్రసిద్ధి చెందినహేతువాది భారతీయ నాస్తికవాద నేత గోపరాజు రామచంద్రరావు. 15.11.1902 న ఒరిస్సా లోని చత్రపురం లో పుట్టారు.పెళ్ళికి ముందే సెక్స్ పై అవగాహనలు, కుటుంబనియంత్రణ, వీటితో పాటు ఎన్నో విప్లవాత్మక మార్పులను తెచ్చిపెట్టిన ఘనత గోరాదే. ఉన్నతకుల హిందూ కుటుంబంలో జన్మించిన రామచంద్రరాజు వృక్షశాస్త్రంలో డిగ్రీ చదివి, మద్రాసు ప్రేసిడెన్సే కాలేజీలో అదే శాస్త్రంలో మాష్టర్ డిగ్రీలో ఉత్తీర్ణుడయ్యాడు. గోరా అనేక రచనలను వ్రాశారు. 1922 లో సరస్వతి గోరా ని ఆమె 10 ఏళ్ళ ప్రాయంలోనే వివాహం చేసుకున్నాడు. సంఘం ఆర్ధిక సమత పత్రికలు నడిపారు.

వర్ణవ్యవస్థ , అంటరానితనం పై తన యుద్ధాన్ని ప్రకటించిన గోరా 1940 లో ఆయన భార్య తో కలసి నాస్తికకేంద్రం ను కృష్ణాజిల్లా లోని ఒక గ్రామంలో ప్రారంభించడం జగిరింది. దేశస్వాతంత్ర్యం సందర్భంగా, 1947 లో, కేంద్రాన్ని విజయవాడ కు తరలించడం జరిగింది.కుమారులు లవణం, విజయం, సమరం, నియంత. కుమార్తెలు మనోరమ, మైత్రి .

25 ఏళ్ళ వయసు వరకు ఆస్తికుడే.తరువాత నాస్తిక సిద్ధాంతాలతో జీవితాంతం కృషిసల్పిన గోరా విజయవాడ లో ప్రసంగిస్తూ 1975, జూలై 26న మరణించారు. 2002 లో భారతప్రభుత్వం, తపాలాశాఖవారు, ప్రత్యేక తపాళబిళ్ళ ను 5 రూపాయల స్టాంపుని విడుదల చేశారు. గోరా శత జయంతి సందర్భంగా విడుదల చేశారు.

[మార్చు] గోరా మాటలు

  • దేవుడు అబద్దం నీతి పెరగాలంటే దైవభావం పోవాలి.జాతి మతం కులం పేరుతో ప్రజల మధ్య విషం పెరుగుతున్నాయి.నాస్తికంలో ఈ వివక్షలకు తావులేదు.దేవుడు కర్మ అనే భావాలు పోతే మనిషి మతస్తుడిగా కాకుండా మానవుడిగా మిగులుతాడు.సోదరభావం పెరుగుతుంది.

[మార్చు] రాసిన పుస్తకాలు


--Nalinimohankumarkalva 06:35, 29 సెప్టెంబర్ 2008 (UTC)==మూలాలు== http://www.telugujournal.com/ShowNews.asp?NewsID=10502&NewsType=sams

  • గోరా గారు ఆచరణ వాది . గ్రహణాల సందర్బం లొ గర్బిణి గా వున్న తన భార్య ను మూడు సార్లు ఆరు బయట త్రిప్పి ఏ విధమఇన మొర్రిలు ఏర్పడవని ప్రజలకు తెలిసె విధం గా ఆచరించి ఛూపారు. తన పిల్లల పేర్లు సైతమ్ ఉప్పు సత్యాగ్రహం సందర్బమ్ లొ పుట్టిన అబ్బాయి కి లవణం అని, భారతీయులు చట్ట సభల్లొ గెలిచిన సందర్భంలొ పుట్టిన అబ్బాయి కి విజయం, రెండవ ప్రపంచ యుద్దమ్ సందర్భమ్ లొ పుట్టిన అబ్బాయి కి సమరం, గాంధి ఇర్విన్ వడంబడిక సందర్భం లొ పుట్టిన అమ్మాయి కి మైత్రి ,అని ,తొమ్మిదవ సంతానమ్ కు పేరు నౌ, అని పెట్టి సముచిత నామములు పెట్టే విధానానికి ఆధ్యుడు గా మారారు.
"http://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B1%8B%E0%B0%B0%E0%B0%BE" నుండి వెలికితీశారు

Polska, Dolar, Forex


Wikipedia jest zarejestrowanym znakiem towarowym Wikimedia Foundation
Wszystkie materiay pochodz z Wikipedii, obite s licencj GNU Free Documentation License