క్షేత్రయ్య
వికీపీడియా నుండి
కర్ణాటక సంగీతంలో పేరెన్నికగన్న వాగ్గేయకారులలో క్షేత్రయ్య (1600-1680) ఒకడు. ఈయన అసలు పేరు మొవ్వా వరదయ్య గా భావిస్తున్నారు. అనేక పుణ్యక్షేత్రాలు, దేవాలయాలను సందర్శిస్తూ వాటి గురించిన వివరాలు తెలుసుకుంటూ ఉండటం చేత ఈయనకు క్షేత్రజ్ఞుడనే పేరు వచ్చింది. క్రమేణా అది క్షేత్రయ్య గా మారింది. ఆంధ్ర ప్రదేశ్‌లోని, కృష్ణా జిల్లా మొవ్వ గ్రామంలో నివసించి, మువ్వగోపాలుని ఆరాధించాడు. బాల్యంలో విద్యాగంధం లేని వరదయ్య పశువుల కాపరిగా ఉండేవాడు. ఒక యోగి ఇతనికి 'గోపాల మంత్రం' ఉపదేశించాడు. ఆనాటి నుండి అతనికి గొప్ప కవితా శక్తి అలవడింది.
ఆంధ్ర దేశంలోని తిరుపతి, కడప, శ్రీశైలం మున్నగు క్షేత్రాలలో నెలకొన్న దేవతలపైనే కాక కంచి, శ్రీరంగం, మధుర, తిరువళ్ళూరులలో వెలసిన స్వామి వార్లపై కూడా క్షేత్రయ్య పదాలు రచించారు. కాని, అన్నిటిని మువ్వ గోపాలునికి అంకితం గావించి ఆ స్వామితో ఆయా దేవతలకు అభేదం కల్పించారు.
భక్తుడు తనను నాయికగా భావించి భగవంతుని పొందుకోసం చెందే ఆరాటమే మధుర భక్తి. ఇలాంటి మధుర భక్తి ప్రబలంగా ఉన్న 17 వ శతాబ్దం లో క్షేత్రయ్య జీవించాడు. పదకవితలకు ఆద్యుడిగా క్షేత్రయ్యను భావిస్తున్నారు. ఆయన పదకవితలు నేటికీ సాంప్రదాయ నృత్యరీతులకు వెన్నెముకగా నిలిచి ఉన్నాయి. ఆయన 4,500 కు పైగా పదాలు రచించాడు. వాటిలో 1,500 పదాల వరకు గోల్కొండ నవాబు అబ్దుల్లా కుతుబ్ షా కు అంకితమిచ్చాడు.
క్షేత్రయ్యను ఎందరో ప్రభువులు సన్మానించారు. వారిలో మధురనేలిన తిరుమల నాయకుడు, గోల్కొండ నవాబు, తంజావూరు రఘునాధ నాయకుడు ప్రముఖులు. రఘునాధ నాయకునిపై క్షేత్రయ్య వేయి పదాలు చెప్పాడు.
క్షేత్రయ్య పదాలలో లలితమైన తెలుగుతనంతో పాటు చక్కని అలంకారాలు మరియు జాతీయాలు ఎక్కువగా కనిపిస్తాయి. సంగీతానికి, సాహిత్యానికి సరైన ప్రాధాన్యము యిచ్చిన పదకర్తగా ఆధునికులు క్షేత్రయ్యను మిక్కిలి ప్రశంసించారు.
[మార్చు] ఇవి కూడా చూడండి
- మహాకవి క్షేత్రయ్య సినిమా.
[మార్చు] మూలాలు
- క్షేత్రయ్య, దక్షిణాది భక్తపారిజాతాలు, శ్యామప్రియ, యస్.వి.యస్.గ్రాఫిక్స్, హైదరాబాదు, 2003.
|
|
|
|---|---|
|
సికింద్రాబాదు నుండి వరసగా సమర్పణ ఫలకం • రుద్రమదేవి • మహబూబ్ ఆలీఖాన్ • సర్వేపల్లి రాధాకృష్ణన్ • సి.ఆర్.రెడ్డి • గురజాడ అప్పారావు • బళ్ళారి రాఘవ • అల్లూరి సీతారామరాజు • ఆర్థర్ కాటన్ • త్రిపురనేని రామస్వామిచౌదరి • పింగళి వెంకయ్య • మగ్దూం మొహియుద్దీన్ • సురవరం ప్రతాపరెడ్డి • జాషువ • ముట్నూరి కృష్ణారావు • శ్రీశ్రీ • రఘుపతి వెంకటరత్నం నాయుడు •త్యాగయ్య • రామదాసు • శ్రీకృష్ణదేవరాయలు • క్షేత్రయ్య • పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి • బ్రహ్మనాయుడు • మొల్ల • తానీషా • సిద్ధేంద్ర యోగి • వేమన • పోతనామాత్యుడు • అన్నమాచార్య • ఎర్రాప్రగడ • తిక్కన సోమయాజి • నన్నయభట్టు • శాలివాహనుడు |
|