క్రైస్తవ మతము
వికీపీడియా నుండి
|
ఈ వ్యాసము మొలక. ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. |
క్రైస్తవ మతము ప్రపంచంలోని అతి పెద్ద మతం. క్రీస్తును ఏకకాలంలో దేవుని కుమారుడు గానూ దేవుడు గానూ నమ్ముతూ ఏక దైవారాధన ను ప్రబోధించే మతం. నజరేయుడైన యేసు జీవితం అంటే ఆయన జననం, ప్రబోధం, శ్రమ, మరణం, పునరుత్థానాలగురించి పౌలు నిర్మించిన సిద్ద్ధాంతాలే క్రైస్తవ మత పునాదులు. బైబిలు లోని క్రొత్త నిబంధన లో యేసు జీవితం, బోధలతో పాటు క్రైస్తవ విశ్వాసానికి సంబంధించిన అనేక విషయాలు వివరించబడ్డాయి. యేసు దేవుని కుమారుడని, పాత నిబంధన లో ప్రవచింప బడిన మెస్సయ్యా అని క్రైస్తవులు నమ్ముతారు. 2001 వ సంవత్సరపు అంచనా ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా క్రైస్తవాన్ని అనుసరించే వాళ్ళు 210 కోట్ల మంది ఉన్నారు.
యేసు పునరుత్థానం చెందిన ఏభై రోజుల తర్వాత వచ్చిన పెంతెకోస్తు అనే పండుగ దినాన క్రైస్తవం ఒక సమాజంగా ఏర్పడిందని అపోస్తలుల కార్యాల గ్రంథం పేర్కొంటుంది. తొలుత యూదా మతం లో ఒక శాఖగా మొదలైన ఇది అనతికాలంలోనే ఒక ప్రత్యేక మతంగా ఆవిర్భవించింది. యూదుల మత గ్రంథమైన హెబ్రీ బైబిలు ను విశ్వసిస్తూ దాన్ని పాత నిబంధన గా క్రైస్తవులు పేర్కొంటారు. యూదా మరియు ఇస్లాం మతము లతో పాటు క్రైస్తవం కూడా అబ్రహాము సంబంధిత మతం గా పేర్కొన బడుతుంది. అంతియొకయలోని శిష్యులు మొట్ట మొదటి సారిగా క్రైస్తవులని పిలువ బడ్డారు.
క్రైస్తవులని పిలువబడుతున్న వాళ్ళు సిద్ధాంత పరంగా, ఆచారాల పరంగా వేరు వేరు 3652 సమూహాలుగా తమలో తాము విడిపోయారు. డినామినేషనులు అని పిలువబడే ఈ క్రైస్తవ మత శాఖలను వారనుసరిస్తున్న సంప్రదాయాల ననుసరించి మూడు ప్రధాన శాఖలుగా విభజించ వచ్చు. 1. రోమన్ కాథలిక్ సంఘం 2. సనాతన తూర్పు సంఘం 3. ప్రొటెస్టెంట్ సంఘం
యూదులు, [[క్రైస్తవ మతము|క్రైస్తవుల]క్రైస్తవ మతము:
క్రీస్తుయేసుకు 12 మంది శిష్యులు.అందరూ యూదులే.ఒక వ్యక్తి యూదుడు కావాలంటే యూదా మతంలోపుట్టాల్సిందే గానీ కొత్తవాళ్ళెవరూ చేరలేరు.యూదులలో నశించినవారిని వెదికి రక్షించటానికి వచ్చానని ఏసుచెబుతాడు.యూదులు ఆయన్ని చంపారు.కానీ క్రైస్తవ మతం విశ్వమానవాళికి ఆయన్ని ప్రభువుగా చేసి ఆరాధిస్తోంది. ఈ మతంలో ఎవరయినా చేరవచ్చు.ఆయన మార్గము ప్రేమమార్గము.నమ్మి బాప్తిస్మం పొందితే రక్షణ..క్రీస్తు శిష్యుడు తోమా 1 వ శతాబ్దం లో భారత దేశానికి క్రీస్తు సందేశాలను తెచ్చాడు.ఇది ప్రేమమార్గం.నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించు అనేది మూల సూత్రం.
[మార్చు] క్రైస్తవమతం గురించి ఖురాన్, హదీసు వాక్యాలు
- గ్రంధాలుగల ప్రజలు (యూదులు , క్రైస్తవులు ) ఏదో ఒకలాగా మిమ్మల్ని అవిశ్వాసంలో పడేస్తారు.(ఖురాన్ 2:109).
- .క్రైస్తవులు సరైన మార్గంలో లేరని యూదులు అంటారు.యూదులే సరైన మార్గంలో లేరని క్రైస్తవులు అంటారు.వాళ్ళిద్దరూతోరా ,సువార్త అనే వారి పవిత్ర గ్రంధాలను చదువుతూనే ఉంటారుగానీ వాటి గురించిన జ్ఞానం వారికి లేదు. కాబట్టి అల్లాహ్ తీర్పుదినాన వారి వివాదాన్ని తీరుస్తాడు(ఖురాన్2:113)
- .ఓ గ్రంధాలుగల ప్రజలారా, ఇబ్రాహీం గురించి ఆయన యూదుడా క్రైస్తవుడా అని వాదిస్తారెందుకు?తౌరాత్ (తోరా ),ఇంజీల్ (సువార్త ) ఆయన తరువాత చాలాకాలానికి వచ్చాయని మీకు తెలియదా?ఇబ్రాహీం యూదుడూ కాదు క్రైస్తవుడూ కాదు ఆయనొక ముస్లిము .(ఖురాన్3:65-67)
- ప్రతి శిశువూ సహజవిశ్వాసం (ఇస్లాం ) తోనే పుడతాడు.తల్లిదండ్రులే అతన్ని యూదుడిగానో,క్రైస్తవుడిగానో,జొరాష్ట్రియను గానో చేస్తారు. (బుఖారీ 6:298)
- క్రైస్తవ అరబ్బులు కోసిన జంతువుల్ని ముస్లిములు తినొచ్చు(అల్ మువత్త24:5)
- ముస్లిములు యూదులకు క్రైస్తవులకు శుభాకాంక్షలు చెప్పాలి.(అల్ మువత్త53:3)
|
|
|
|---|---|
| ఇబ్రాహీం మతములు | ఇబ్రాహీం మతము, యూద మతము, క్రైస్తవ మతము, ఇస్లాం మతం, బహాయి విశ్వాసము |
| భారతీయ మతములు | హిందూ మతము, బౌద్ధ మతము, జైన మతము, సిక్కు మతము, |
| తూర్పు దేశాల మతములు (టావో మతములు) | టావో మతము, షింటో మతము, కోండోగ్యో, కావోడైజమ్, యుగిండావో, కన్ఫ్యూషియానిజం, |
| ఇరానీయ మతములు | జొరాస్ట్రియన్ మతము, యజ్దానీ మతము |