Dzisiaj jest niedziela, 23 listopada 2008 r. 328 dzien roku
Languages:ar | id | bg | ca | ceb | cs | da | de | et | en | es | eo | fr | he | hr | it | ko | lt | hu | nl | ja | no | pl | pt | ru | ro | sk | sl | sr | fi | sv | te | tr | uk | zh






REKLAMA
mp3

కోటప్ప కొండ

వికీపీడియా నుండి

కోటప్పకొండ సుందర దృశ్యం.
త్రికోటేశ్వరస్వామి ఆలయ దృశ్యం.

కోటప్పకొండ గుంటూరు జిల్లా, నరసరావుపేట దగ్గర ఉన్న త్రికూటేశ్వరుని సన్నిధి.

చేదుకో కోటయ్య మమ్మాదుకోవయ్యా!......

అంటూ, యల్లమంద కోటయ్యగా ప్రజల పూజలందుకొనే త్రికోటేశ్వరస్వామివారి దేవాలయము ఎప్పుడూ నిర్జనంగా ప్రశాంతంగా ఉంటుంది. రోజువారీ భక్తులరాక పరిమితంగా ఉంటూ కేవలం మహాశివరాత్రి సమయంలో మాత్రం కాలు పెట్టే సందుకూడాలేనంతగా భక్తజనంతో నిండిపోతుంది. సౌకర్యాల విషయంలో ఒకప్పటికంటే ఇప్పటి పరిస్థితి బావుంది.

విషయ సూచిక

[మార్చు] దేవాలయ చరిత్ర

త్రికోటేశ్వరస్వామి వారి అంతరాలయ దృశ్యం.

[మార్చు] ప్రభలసంభరం

శివరాత్రికి ఇక్కడ జరిగే ప్రభల సంభరం అత్యంత పేరు కలిగినది, విశేషమైనదీను. చుట్టుప్రక్కల గ్రామాలనుండి చిన్నపిల్లల చేతులలో చిన్న చిన్న ప్రభలనుండి దాదాపు డెభై ఎనభై అడుగుల వరకూ ఎత్తు గలిగిన ప్రభలు కోటప్పకొండకు శివరాత్రి సంబరాలకు తీసుకొస్తారు. వీటిని ట్రాక్టర్లలో బండ్లలో డప్పులు, బ్యాండు, రికార్డింగ్ డ్యాన్సులతోనూ, పగటి వేషాల వంటి పలు కార్యక్రమములతోనూ తీసుకొస్తారు. ఒక్కొక్క ప్రభను ఒక్కొక్క రకంగా అలంకరించి కొండక్రింద పొలాల్లో ఉంచుతారు. ఇవి పెద్దవే వందల సంఖ్యలో ఉంటాయి. చిన్నవయితే లక్షల సంఖ్యలో కనుపిస్తూ, కొండ పైభాగమునుండి చూసేవారికి సముద్రంలొ తెరచాపల్లా కనువిందు చేస్తూఉంటాయి.

[మార్చు] త్రికూట పర్వత దేవాలయము

త్రికూట పర్వతంఅనే త్రికోటేశ్వరుని సన్నిది కల ఈ దేవాలయ శిఖరమ్ మూడు భాగాలుగా ఉంటుంది.

  • ఈ క్షేత్రం మొదటి కొండపై ముసలి కోటయ్యగారిగుడి ఉంది ప్రస్తుతం శిదిలావస్థలో ఉంది.
  • రెండవ కొండ త్రికోటేశ్వరస్వామివారి దేవాలయము కలది. ఇక్కడ ఎర్రగా ఉండే కోతులు ఒక ప్రత్యేకత. గుడి పరిసరాలలో భక్తులు ఇచ్చే ప్రసాదాలను తీసుకొంటూ ఒక్కోసారి లాక్కుంటూ తిరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఒక పెద్దపుట్ట , నవగ్రహముల దేవాలయము, ద్యాన మందిరము, దేవాలయపు వెనుక బాగమున రెస్ట్ రూమ్స్ కలవు.
  • మూడవ భాగమైన కొండ క్రింద బొచ్చుకోటయ్యగారి మందిరము మరియు కళ్యాణ కట్ట, సిద్ధి వినాయక మందిరములు కలవు.

[మార్చు] వసతి సౌకర్యాలు

కొండపై తిరుమల దేవస్థానమువారి సత్రము,గవర్నమెంటువారి రెస్ట్ హవ్స్ కలవు.క్రింది భాగమున సామాన్యులకొరకై చాలా కాలముక్రితం నిర్మించిన బసవ మందిరము సేవలందిస్తూ ఉండెడిది. ఇప్పుడిప్పుడే కుల ప్రాతిపదికగా పలు సత్రములు నిర్మాణకార్యక్రమములలోనూ, అతి తక్కువగా పూర్తి అయినవీ ఉన్నవి.

[మార్చు] రవాణా సౌకర్యాలు

కోటప్పకొండకు దగ్గరలో కల నరసరావుపేట పాత బస్ స్టాండు, కొత్త బస్ స్టాండుల నుండి ప్రతి అరగంటకు ఇక్కడకు బస్సు కలదు. ఇవేకాక ప్రైవెటు వాహనములు కూడా ఈ దారిని ప్రయాణిస్తుంటాయి. కొండ పైకి వెళ్ళుటకు బస్సులు, జీపులు, ఆటోలు దొరకుతాయి.


[మార్చు] బయటి లింకులు


Polska, Dolar, Forex


Wikipedia jest zarejestrowanym znakiem towarowym Wikimedia Foundation
Wszystkie materiay pochodz z Wikipedii, obite s licencj GNU Free Documentation License