కొల్లేటి సరస్సు
వికీపీడియా నుండి
|
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. |
కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలలో వ్యాపించి ఉన్న సహజ సిద్ధమైన మంచి నీటి సరస్సు - కొల్లేరు. లక్షకుపైగా ఎకరాల్లో వ్యాపించి ఉన్న ఈ సరస్సు, ప్రకృతి అందాలకు, అరుదైన వలస పక్షులకు ఆలవాలం. సరస్సు మధ్యలో ఎన్నో లంకలున్నాయి. ఎన్నో రకాల చేపలకు కొల్లేరు నిలయం. ఇక్కడకు వలసవచ్చే పక్షులలో ముఖ్యమైనవి - పరజ, పురాజము, నులుగు పిట్ట. సైబీరియా నుండి సైతం ఇక్కడకు పక్షులు వలసవస్తూ ఉంటాయి.
విషయ సూచిక |
[మార్చు] పెద్దింట్లమ్మ దేవాలయము
కొల్లేరు సరస్సు నడిబొడ్డున ఉన్న కొల్లేటికోట ప్రాంతమున ఉన్న ప్రసిద్ద ఆలయం పెద్దింట్లమ్మ వారి ఆలయము.
శతాబ్ధాల చరిత్ర కలగిన ఈ అమ్మవారి ఆలయంలో తొమ్మిది అడుగులపైబడి, విశాల నేత్రాలతో పద్మాసన భంగిమతో అత్యద్భుతంగా దర్శనమిచ్చే అమ్మవారిని దర్శించేందుకు ఇతర రాష్ట్రాలైన ఒరిస్సా, అస్సాం, తమిళనాడు ల నుండి సైతం భక్తులు వస్తుంటారు.
ఏటా పాల్గుణ శుద్ద పాడ్యమి నుండి పౌర్ణమి వరకూ జరిగే ఉత్సవాలలో పాల్గుణ శుద్ద ద్వాదశి రోజున పెద్దింట్లమ్మ సమేత జలదుర్గకు కొల్లేటి కోట సమీపాన కల గోకర్ణేశ్వరస్వామి వారికి కళ్యాణము జరిపిస్తారు.
- రవాణా సౌకర్యాలు
సమీపాన కల ఆకివీడు నుండి లాంచీ ల ద్వారా, లేదా ఆలపాడు నుండి చిన్న రవాణా సాధనాలతో కర్రల వంతెన ద్వారా, ఏలూరు నుండి కైకలూరు మీదుగా బస్సు ద్వారా ఇక్కడికి చేరవచ్చు.
[మార్చు] వార్తా కధనాలలో కొల్లేరు
అయితే కొన్ని సంవత్సరాలుగా కొల్లేరు పలు విధాలైన ఆక్రమణలకు గురైంది. ప్రభుత్వం ఇక్కడి లంకల గ్రామాల ప్రజలకు అధికారికంగా ఇచ్చినది, ప్రజలు సరస్సును అక్రమంగా ఆక్రమించుకుని, కట్టలు పోసి, చేపల చెరువులుగా మార్చినది పోగా కేవలం 40 శాతం సరస్సు మాత్రమే మిగిలి ఉంది. చేపల పెంపకం కారణంగా సరస్సులో కాలుష్యం కూడా పెరిగింది.
ప్రకృతిని ప్రేమించే కొందరు, పర్యావరణ సంస్థలతో కలసి జరుపుతున్న పోరాటాల పలితంగా 2005 లో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఈ ఆక్రమణలను తొలగించే పనికి పూనుకుని సరస్సుకు పూర్వవైభవం తెచ్చే కార్యక్రమం చేపట్టింది. ప్రస్తుతం ఇక్కడ ప్రభుత్వం కేటాయించిన నిధులతో సరస్సు అభివృద్ది కార్యక్రమములు జరుగుతున్నవి.
[మార్చు] పురాతన గ్రంధాలలో కొల్లేరు ప్రస్తావన
రామాయణం అరణ్యకాండలో వర్ణింపబడిన పెద్ద సరస్సు కొల్లేరే నని ఆంధ్ర దేశపు చరిత్ర అధ్యయనం చేసినవారిలో ఆద్యుడయిన చిలుకూరి వీరభద్రరావు భావించాడు. ఈ విషయమై "ఆంధ్రుల చరిత్రము - ప్రధమ భాగము"లో ఇలా వ్రాశాడు - [1]
- ఈ దండకారణ్య మధ్యమున యోజనాయుతమైన (100 చతురపు మైళ్ళ వైశాల్యము గల) మహా సరస్సొకటి గలదనియు, అది జల విహంగములతో నత్యంత రమణీయమై యొప్పుచున్నదనియు .... ఆప్రదేశమంత నిర్జంతుకముగా నున్నదనియు నగస్త్యుడు శ్రీరామ చంద్రునితో జెప్పినట్లు రామాయణమున చెప్పబడినది.... ఈ సరస్సెక్కడనున్నదని విచారింపగా నయ్యది యాంధ్ర దేశములోనిదిగా జూపట్టుచున్నది. ఏమన గొప్పదై దండకారణ్య మధ్యగతమై కొంగలకాకరమై యుండు తియ్యని కొలను మన యాంధ్ర దేశముననే గాని మఱియెచ్చటను గానరాదు.
- మఱియు దండియను మహాకవి తన దశకుమార చరిత్రములో నీ యాంధ్రదేశము నభివర్ణించుచు నిందొక మహా సరస్సు గలదనియు నది సారస నిలయమనియు నది యాంధ్రనగరికి ననతి దూరముగా నున్నదనియు బేర్కొని యుండుటచేత నట్లభివర్ణింపబడిన కొలను కొల్లేరు గాక మఱియొక్కటి కానేరదు. (ఆంధ్ర నగరి యనగా వేంగి కావచ్చునని చిలుకూరి వీరభద్రరావు అభిప్రాయం). "కొల్లేటికొంగ" యను లోకోక్తియె కొల్లేరు కొంగలకు ప్రసిద్ధమను విషయమును వేనోళ్ళ జాటుచున్నది. దక్షిణ హిందూస్థానమున నెన్నందగిన పెద్ద తియ్య నీటికొలను "కొల్లేరు" మాత్రమేయై దండి చెప్పినట్లుగా జలరాశి.
[మార్చు] మూలాలు, వనరులు
- ↑ ఆంధ్రుల చరిత్రము - చిలుకూరి వీరభద్రరావు ప్రచురణ: విజ్ఞాన చంద్రికా గ్రంధమండలి - 1910లో చెన్నపురి ఆనంద ముద్రణాశాల యందు ముద్రింపబడియెను. వెల ౧-౪-౦. రాజపోషకులు: బొబ్బిలి రాజా, పిఠాపురం రాజా, మునగాల రాజా
|
|
|
|---|---|
| అయిభీమవరం · అజ్జమూరు · ఆకివీడు · చెరుకుమిల్లి · చినకాపవరం · అప్పారావుపేట · ధర్మాపురం · దుంపగడప · గుమ్ములూరు · కోళ్ళపఱ్ఱు · కొల్లేరు (నిర్జన గ్రామము) · కుప్పనపూడి · మాదివాడ · పెదకాపవరం · సిద్దాపురం · తరటావ |
|
|
|
|---|---|
| ప్రముఖ పట్టణాలు | ఏలూరు · తణుకు · తాడేపల్లి గూడెం · కొవ్వూరు · భీమడోలు · భీమవరం · నరసాపురం · నిడదవోలు · పాలకొల్లు · ఆకివీడు · జంగారెడ్డి గూడెం · దేవరపల్లి |
| ప్రముఖ దేవాలయాలు | ద్వారకా తిరుమల · గౌరీపట్నం · ఆచంట · భీమారామము · క్షీరారామము |
| పర్యాటక ప్రదేశాలు | కొల్లేటి సరస్సు · పాపి కొండలు · పట్టిసీమ · పేరుపాలెం |
| నదులు | గోదావరి |
| లోకసభ నియోజకవర్గాలు | ఏలూరు · నరసాపురం |
| శాసనసభ నియోజకవర్గాలు | కొవ్వూరు · నిడదవోలు · ఆచంట · పాలకొల్లు · నర్సాపురం · భీమవరం · ఉండి · తణుకు · తాడేపల్లిగూడెం · ఉంగుటూరు · దెందులూరు · ఏలూరు · గోపాలపురం · పోలవరం చింతలపూడి |