Dzisiaj jest niedziela, 23 listopada 2008 r. 328 dzien roku
Languages:ar | id | bg | ca | ceb | cs | da | de | et | en | es | eo | fr | he | hr | it | ko | lt | hu | nl | ja | no | pl | pt | ru | ro | sk | sl | sr | fi | sv | te | tr | uk | zh






REKLAMA
mp3

కొండపల్లి

వికీపీడియా నుండి

ఉపోద్గాతం

ఒకసారి తయారు చేసిన దానిని మూసగా పోసి చేసే వీలులేదు. ఒకసారి తయారు చేసి దానిని ముద్రగుద్దే ప్రశ్నేలేదు. మొదటిది ఎంత సమయం,ఎంత కళాదృష్టి,ఎంత ఏకాగ్రతతో చేసారో రెండవదీ అంతే సమయం,దృష్తి,ఏకాగ్రతలతో చేయబడుతూ కొండపల్లి గ్రామస్తులకు మాత్రమే సాద్యమైన గొప్ప పనివాడితనం కొండపల్లి బొమ్మ.

విషయ సూచిక

[మార్చు] చరిత్ర

కొండపల్లి బొమ్మలకు ప్రసిద్ధి చెందిన ఈ కొండపల్లి కృష్ణా జిల్లా, ఇబ్రహీంపట్నం మండలానికి చెందిన గ్రామము.ఈ గ్రామము విజయవాడ కు 16.5 కి.మీ. ల దూరంలో ఉన్నది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కొండపల్లి బొమ్మలకు పుట్టినిల్లు. తేలికైన పొనికి చెక్కతో చేసిన ఈ బొమ్మలు దశాబ్దాల తరబడి ప్రజలను అలరిస్తున్నాయి. ఈ ప్రదేశాన్ని కోండవీటి రెడ్డి రాజులు 14 వ శతాబ్ధములో పరిపాలించారు. వారు నిర్మించిన కోట ఈ గ్రామములొ ఒక ఆకర్షణ. కొండపల్లి విజయవాడ గుండా పోయే జాతీయ రహదారి 221 మీద విజయవాడ కు 16 కి.మి దూరములో ఉన్నది. ఈ గ్రామానికి రైల్వే సౌకర్యం హైదరాబాదు-విజయవాడ రైల్వే లైను వల్ల కల్పించబడుతోంది.

[మార్చు] ఉనికి

అక్షాంశరేఖాంశాలు: 16°37′N, 80°32′E

[మార్చు] కొండపల్లి బొమ్మలు

ఆంధ్ర సంస్కృతి జన జీవనం. ఆంద్రుల కట్టు బొట్టు వేషదారణలను చూపిస్తున్న కొండపల్లి బొమ్మలు

కొండపల్లి బొమ్మలు తేలికైన పొనికి అనే చెక్క తో తయారు చేస్తారు. ముందుగా చెక్క మీద తయారు చేయవలసిన బొమ్మ ఆకారాన్ని చెక్కుతారు. తరువాత రంపపు చిత్రి పొట్టు, చింత గింజల నుండి వచ్చిన పొడి తొ కావలసిన ఆకారములొ మలుస్తారు. బొమ్మలకు ప్రత్యేకంగా వేరే అతకవలసిన భాగాలు, మార్పులు చేస్తారు. తరువాత వాటికి సున్నం పూసి ఎండపెడతారు. ఆ తరువాత ఆరిన సున్నం పై రంగులు పూస్తారు. కొండపల్లి బొమ్మలలొ ప్రసిద్ధి చెందినవి ఏనుగు అంబారి -మావటివాడు,నాట్యం చేస్తున్న నృత్యకళాకారిణిల బొమ్మ, పల్లెలలొ తలపాగా పంచె కట్టుకొన్న పురుషులు, చీరలు కట్టుకొన్న స్త్రీలు కల జీవనవ్యవస్థ సూచించే ప్రజల బొమ్మలు ముఖ్యమైనవి.పౌరాణిక ప్రముఖులు, పక్షులు, జంతువులు, పండ్లు, కూరగాయలు, ఇళ్ళు మొదలైన ఎన్నో రూపాల్లో ఈ బొమ్మలు తయారు చేస్తారు. అన్ని తీర్ధ యాత్రా స్థలాల్లోను, హస్తకళా కేంద్రాలలోను ఇవి లభిస్తాయి. ఈ కళాకారులు బొమ్మల తయారీ లొ ఉన్న శైలి, 17 వ శతాబ్ధంలొ రాజస్థాన్ రాష్ట్రములొ బొమ్మల తయారీ శైలి ఒకే విధంగా ఉండడం వల్ల ఈ కళాకారులు రాజస్థాన్ నుండి ఇక్కడకు వలస వచ్చారని భావిస్తారు.


[మార్చు] కొండపల్లి కొట

కొండపల్లి కోటను కొండవీటి రెడ్డి రాజ్య స్థాపకుడైన ప్రోలయ వేమారెడ్డి 14 వ శతాబ్దంలో నిర్మించినట్లు భావిస్తున్నారు. దీనిలో మూడంతస్తుల రాతి బురుజు ఉంది.ఇక్కడి విరూపాక్ష దేవాలయ సమీపంలో చక్కని పిక్నిక్‌ ప్రదేశం కలదు.

బొమ్మ:Kondapalli view.jpg
కొండపల్లి పట్టణ దృశ్యము


[మార్చు] బయటి లింకులు







Polska, Dolar, Forex


Wikipedia jest zarejestrowanym znakiem towarowym Wikimedia Foundation
Wszystkie materiay pochodz z Wikipedii, obite s licencj GNU Free Documentation License