Dzisiaj jest niedziela, 23 listopada 2008 r. 328 dzien roku
Languages:ar | id | bg | ca | ceb | cs | da | de | et | en | es | eo | fr | he | hr | it | ko | lt | hu | nl | ja | no | pl | pt | ru | ro | sk | sl | sr | fi | sv | te | tr | uk | zh






REKLAMA
mp3

కూచిమంచి జగ్గకవి

వికీపీడియా నుండి

కూచిమంచి జగ్గకవి 18వ శతాబ్దపు కవి. పిఠాపురానికి చెందినవాడు. కూచిమంచి తిమ్మకవికి తమ్ముడు. చంద్రరేఖా విలాపం అనే బూతు ప్రబంధం రాశాడు. పుదుచ్చేరిలోని కామ గ్రంధమాల సంపాదకులు యస్.చిన్నయ్య 1922 లో ఈ పుస్తకాన్ని ప్రచురిస్తే ప్రభుత్వం దీన్ని నిషేదించిందట.

ఈయన 1700-1765 కాలానికి చెందిన కవి. డబ్బు కక్కుర్తితో నీలాద్రిరాజు వేశ్యమీద మొదట 'చంద్రరేఖా విలాసం'అనే కావ్యం వ్రాసి, తరువాత కృతి స్వీకరింప నిరాకరించిన ఆ నీలాద్రిరాజు మీద కోపంతో 'చంద్రరేఖా విలాపం' అనే బూతుల బుంగ కావ్యం వ్రాసి తిట్టు కవిగా సుప్రసిద్ధుడైన ఈ ప్రబుద్ధుడు వ్రాసిన ఒక చాటు శతకం కూడా ఉంది. (తెలుగులో తిట్టుకవులు పుటలు 133-145). 'రామా! భక్తమందారమా!' అనే మకుటంతో వ్రాసిన ఈ శతకంలోని పద్యాలు అనేకం కవి ఆర్తిని, ఆనాటి కవుల హీనస్థితినీ వర్ణించేవిగా ఉన్నాయి. ఈ పద్యం చూడండి;

మ.  గడియల్ రెండిక సైచి రా, వెనుక రా, కాసంతసేపుండి రా.
     విడిదింటం గడె సేద దీర్చుకొని రా, వేగంబె భోంచేసి రా,
     ఎడపొద్దప్పుడు రమ్మటంచు సుకవిన్ హీనప్రభుండీ గతిన్
     మడతల్ పల్కుచు త్రిప్పు కా సిడక రామా ! భక్తమందారమా !

ఈయన అన్న కూచిమంచి తిమ్మకవి 'నిరాఘాట నత చ్చాటు కవిత్వాంకు డరయ జగ్గన ధరణిన్' అని ఇతడిని వర్ణించాడు.

[మార్చు] మూలాలు

తెలుగుచాటువు పుట్టుపూర్వోత్తరాలు--బాలాంత్రపు నళినీకాంతరావు


Polska, Dolar, Forex


Wikipedia jest zarejestrowanym znakiem towarowym Wikimedia Foundation
Wszystkie materiay pochodz z Wikipedii, obite s licencj GNU Free Documentation License