కురుమూర్తి
వికీపీడియా నుండి
మహబూబ్ నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలంలోని ఒక గ్రామము. ఈ గ్రామములో జిల్లాలోనే అతి పురాతనమైన దేవస్థానంగా పేరుగాంచిన కురుమూర్తి వేంకటేశ్వర దేవస్థానం కలదు. మహబూబ్ నగర్ నుండి కర్నూలు వెళ్ళు రైలు మార్గములో కురుమూర్తి కలదు. ఈ దేవస్థానానికి బస్సు సౌకర్యము కూడా కలదు. తిరుమల వేంకటేశ్వర ఆలయానికి, కురుమూర్తి ఆలయానికి పోలికలున్నాయి.
విషయ సూచిక |
[మార్చు] కురుమూర్తి దేవస్థానం
ఆత్మకూరు పట్టణానికి 13 కిలోమీటర్ల దూరంలో ఎత్తయిన ఏడు కొండలపై ఉన్న కురుమూర్తి శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్ర్హానం క్రీ.శ. 1268 ప్రాంతములో ముక్కెర వంశ మూలపురుషుడు గోపాలరాయుడు నిర్మించాడు. 1350లో చంద్రారెడ్డి అభివృద్ధిపర్చగా, సోమభూపాలరావు కొండపైకి మెట్లు నిర్మించి ఏటా జాతర నిర్వహించే సాంప్రదాయం అమలులోకి తెచ్చాడు.[1] 1870 లో ఉద్దాల మండపం ఏర్పాటు చేశారు. కురుమూర్తి బ్రహ్మోత్సవాలలో ఉద్దాల (పాదుకల) ఊరేగింపు ప్రధాన ఘట్టం. వేడుకలు మండల పరిధిలీని వడ్డేమాన్ నుంచి ప్రారంభమౌతాయి. ఆ పాదుకలను ఈ మండపంలో ఉంచుతారు. వీపుపై పాదుకలతో కొట్టించుకుంటే పాపాలు పోతాయని భక్తుల నమ్మకం. 1999 లో కొత్తగా మండపం ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్రతియేటా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాలలో స్వామి వారిని హంస వాహనంపై ఊరేగిస్తారు.[2]
[మార్చు] ఆలయ చరిత్ర
కుబేరుడి అప్పు తీర్చలేక పద్మావతి సమేతంగా తురుమల వీడి కృష్ణాతీరం చేరిన శ్రీ వేంకటేశ్వరుడు నదిలో సేద తీరిన అనంతరం పాదాలు కంది పోకుండా కృష్ణమ్మ పాదుకలు బహుకరించిందని, ఈ పాదుకలనే ఉద్దాల ఉత్సవంలో ఊరేగిస్తారని చరిత్రాత్మక కథనం ఉంది. నాడు శ్రీ వేంకటేశ్వరుడు సతీసమేతంగా కృష్ణానదిలో స్నానమాడిన ప్రదేశం నేడు ఆత్మకూరు ప్రదేశంలొ గుండాల జలాశయంగా ప్రసిద్ధి చెందినది.[3]
[మార్చు] బ్రహ్మోత్సవాలు
స్వామి వారికి ప్రతి యేటా బ్రహ్మోత్సవాలు జర్గుతాయి. వీటిలో ఉద్దాల ఉత్సవం అనగా పాదుకలను తయారు చేయడం ప్రధాన ఘట్టం. రాయలసీమ నుంచి తెచ్చిన ఆవు చర్మంతో వడ్డేమాన్ గ్రామంలో చర్మకారులు వారం రోజులు శ్రమించి పాదుకలను తయారుచేస్తారు. ఉత్సవం రోజున పాదుకలను ఆంజనేయ స్వామి ఆలయం దగ్గర పూజిస్తారు. కొండ దిగువన పాదుకలకు స్వాగతం పలికి కాంచనగుహ లోని కురుమూర్తి సన్నిధికి చేర్చి ఆ తర్వాత ఉద్దాల మండపంలో అలంకరిస్తారు. మాండపంలో ఉంచిన పాదుకలతో తల, వీపుపై కొట్టించుకుంటే పాపాలు తొలిగిపోతాయని భక్తుల నమ్మకం.
[మార్చు] తిరుమలకు కురుమూర్తికి పోలికలు
- తిరుపతి లోలాగే ఇక్కడా విఘ్నేశ్వరుడి విగ్రహం లేదు.
- తిరుపతిలో వలె ఇక్కడ కూడా ఏడు కొండల మద్య వేంకటేశ్వరుడు కొలువై ఉన్నాడు.
- తిరుపతిలో వలె ఇక్కడా స్వామి నిలుచున్న భంగిమలో ఉన్నాడు.
- తిరుమల కు మెట్లపై వెళ్ళేటప్పుడు శ్రీపాద చిహ్నాలు ఉన్నట్లుగానే ఇక్కడా ఉన్నాయి.
- కురుమూర్తి దర్శనానికి వెళ్ళ్తున్నప్పుడు మోకాళ్ళ గుండు ఉంది.
- శేషశైలంలో స్వామి వారికి అలిపిరి మండపం లాగే ఇక్కడ ఉద్దాల మండపం ఉంది.[4]
[మార్చు] కురుమూర్తి దేవాలయానికి చేరు విధానం
- జిల్లా కేంద్రమైన మహబూబ్ నగర్ నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. మహబూబ్‌నగర్ నుంచి దేవరకద్ర, కౌకుంట్ల మీదుగా కురుమూర్తి చేరుకోవచ్చు
- కురుమూర్తి రైల్వేస్టేషన్ నుంచి 7 కిలోమీటర్ల దూరంలో ఉంది.
- 7 వ నెంబర్ జాతీయ రహదారి పై ఉన్న కొత్తకోట నుంచి కొత్తపల్లి, దుప్పల్లి మీదుగా 18 కిలోమీటర్ల దూరంలో ఉంది.
[మార్చు] వనరులు
- ↑ ఈనాడు దినపత్రిక, మహబూబ్‌నగర్ జిల్లా ఎడిషన్, పేజీ 9, తేది జూన్ 11, 2008
- ↑ ఈనాడు దినపత్రిక, మహబూబ్ నగర్ జిల్లా ఎడిషన్, తేది నవంబర్ 11, 2007
- ↑ ఈనాడు దినపత్రిక, మహబూబ్ నగర్ జిల్లా ఎడిషన్, నవంబర్ 17, 2007
- ↑ ఈనాడు దినపత్రిక, మహబూబ్ నగర్ జిల్లా ఎడిషన్, తేది అక్టోబర్ 19, 2006
|
|
||
|---|---|---|
| ప్రముఖ పట్టణాలు | మహబూబ్ నగర్ · గద్వాల · వనపర్తి · నారాయణపేట · షాద్నగర్ · నాగర్కర్నూల్ · కల్వకుర్తి · జడ్చర్ల · ఆత్మకూరు | |
| ప్రముఖ దేవాలయాలు | మన్యంకొండ · కురుమూర్తి · ఆలంపూర్ · వట్టెం వెంకటేశ్వర స్వామి దేవాలయం · మల్లెలతీర్థం · ఊర్కొండ అభయాంజనేయ స్వామి దేవాలయం | |
| పర్యాటక ప్రదేశాలు | పిల్లలమర్రి (వృక్షం) · బీచుపల్లి | |
| ప్రాజెక్టులు | ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు · కోయిల్ సాగర్ ప్రాజెక్టు · సరళా సాగర్ ప్రాజెక్టు · రాజోలిబండ డైవర్షన్ స్కీం · | |
| చారిత్రక కోటలు | గద్వాల కోట · రాజోళి కోట · కోయిలకొండ కోట · చంద్రగఢ్ కోట · ఆత్మకూరు కోట | |
| నదులు | కృష్ణా నది · తుంగభద్ర నది · దిండి నది · మూసీ నది | |
| లోకసభ నియోజకవర్గాలు | మహబూబ్ నగర్ · నాగర్కర్నూల్ | |
| శాసనసభ నియోజకవర్గాలు | కోడంగల్ · నారాయణపేట · మహబూబ్ నగర్ · జడ్చర్ల · దేవరకద్ర · మక్తల్ · షాద్నగర్ · వనపర్తి · గద్వాల · ఆలంపూర్ · నాగర్కర్నూల్ · అచ్చంపేట · కల్వకుర్తి · కొల్లాపూర్ | |
|
|
|
|---|---|
| తిమ్మాపూర్ · కొత్తూర్ · షాద్నగర్ · బాలానగర్ · రంగారెడ్డిగూడ · రాజాపూర్ · గొల్లపల్లి · జడ్చర్ల · మహబూబ్ నగర్ · మన్యంకొండ · కోటకద్ర · దేవరకద్ర · కౌకుంట్ల · కురుమూర్తి · కొన్నూర్ · వనపర్తిరోడ్ · అజ్జకోల్ · శ్రీరాంనగర్ · ఆరేపల్లి · గద్వాల · పూడూర్ · పెద్దదిన్నె · ఇటిక్యాల్ · మనోపాడ్ · ఆలంపూర్ రోడ్ |
|
|
|
|---|---|
| బంద్రెపల్లి · లాల్కోట · ఫరీద్పూర్ · పాలమర్రి · ముచ్చింతల · నెల్లికొండి · సీతారాంపేట · దమగ్నాపూర్ · వడ్డెమాన్ · అప్పంపల్లి · దాసర్పల్లి · తిర్మలాపూర్ · ఏదులాపూర్ · లక్ష్మిదేవిపూర్ · ఉండ్యాల · చిన్నచింతకుంట · గూడూర్ · అమ్మాపూర్ · కురుమూర్తి · మద్దూర్ · అల్లిపూర్ · దుప్పల్లి · కొత్తపల్లి |