కుప్పం శాసనసభ నియోజకవర్గం
వికీపీడియా నుండి
| కుప్పం | |
| — శాసనసభ నియోజకవర్గం — | |
| Coordinates: | |
|---|---|
| దేశము | భారత దేశం |
| రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
| జిల్లా | చిత్తూరు |
| ప్రభుత్వము | |
| - శాసనసభ సభ్యులు | నారా చంద్రబాబు నాయుడు |
చిత్తూరు జిల్లాలో ఉన్న 14 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒకటైన కుప్పం అసెంబ్లీ నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దక్షిణాదిగా ఉన్న నియోజకవర్గం. తమిళనాడు, కర్ణాటక సరిహద్దులు కలిగిన కుప్పం నియోజకవర్గం రెండు సార్లు ముఖ్యమంత్రి అభ్యర్థిని గెలిపించి ప్రత్యేకతను చాటుకుంది. ఈ నియోజకవర్గానికి ఉన్న మరో ప్రత్యేకత రాష్ట్రంలోనే చిట్టచివరి శాసనసభ నియోజకవర్గపు సంఖ్యను కలిగి ఉండటం. 294 నియోజకవర్గాలు కలిగిన రాష్ట్రంలో ఈ నియోజకవర్గపు సంఖ్య 294. 2007లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రకారము ఈ శాసనసభ నియోజకవర్గం మరో 6 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు చిత్తూరు లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది.
విషయ సూచిక |
[మార్చు] నియోజకవర్గంలోని మండలాలు
1999 ఎన్నికలలో ఈ నియోజకవర్గంలో 1,61,872 మంది నమోదుచేసుకున్న ఓటర్లు ఉన్నారు. 2004 నాటికి ఈ సంఖ్య 1,85,813 కు పెరిగింది.
[మార్చు] నియోజకవర్గపు జనాభా
2001 జనాభా లెక్కల ప్రకారము కుప్పం నియోజకవర్గం జనాభా 3,18,172. ఇందులో మహిళలు 1,60,824 కాగా పురుషులు 1,57,348.
- మండలాల వారీగా జనాభా
-
-
క్రమ సంఖ్య మండలపు పేరు మొత్తం జనాభా మహిళలు పురుషులు ఓటర్ల సంఖ్య 1 కుప్పం 102947 52209 50738 2 శాంతిపురం 50952 25604 25348 3 గుడిపల్లె 38480 19207 19273 4 రామకుప్పం 50874 26035 24839 5 వెంకటగిరి కోట 74919 37769 37150 మొత్తము 3,18,172 1,60,824 1,57,348
-
[మార్చు] వివిధ రాజకీయ పార్టీల బలాబలాలు
1955లో ఏర్పడిన కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ మరియు కాంగ్రెస్ (ఐ) పార్టీలు కేవలం రెండుసార్లు మాత్రమే గెలిచాయి.[1] గాంధేయవాది, స్వాతంత్ర్య సమరయోధుడైన డి.రామబ్రహ్మం కుప్పం తొలి శాసనసభా సభ్యునిగా ఎన్నికయ్యాడు. ఆ తరువాత 1962లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో సి.పి.ఎంకు చెందిన వజ్రవేలు చెట్టి ఎన్నికయ్యాడు. 1967 ఎన్నికలలో కుప్పం ప్రజలు రాజకీయాలలోకి కొత్తగా ప్రవేశించిన ఒక స్వతంత్ర అభ్యర్ధి అయిన డి.వెంకటేశంను గెలిపించారు. రాజకీయ అతిరథులైన డి.రామబ్రహ్మం మరియు వజ్రవేలు చెట్టి వంటి వారిని ఓడించి ఈయన సాధించిన అనూహ్య విజయం అందరినీ ఆశ్చర్యపరచింది. డి.వెంకటేశం 1972లో తిరిగి కుప్పం నుండి రెండవ పర్యాయము శాసనసభకు ఎన్నికయ్యాడు. ఆ తరువాత ఎన్నికలలో దేశమంతటా జనతా పార్టీ ప్రభంజనం వచ్చినా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం మాత్రం ఇందిరాగాంధీ పక్షాన నిలచింది. కుప్పం కూడా అందుకు అతీతం కాక ఇందిరా కాంగ్రేసుకు చెందిన బి.ఆర్.దొరస్వామి నాయున్ని శాసనసభకు ఎన్నుకున్నది. అయితే 1982లో ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపనతో కుప్పంలో కాంగ్రేసు పార్టీ తుడిచిపెట్టుకుపోయింది.[2] తెలుగుదేశం అధికారంలోకి వచ్చేదాక ఈ నియోజకవర్గము నుండి సి.పి.ఐ మరియు స్వతంత్ర అభ్యర్ధులు మూడు పర్యాయాలు గెలుపొందారు. 1982లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో ఈ నియోజకవర్గంలో రాజకీయ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. తెలుగుదేశం పార్టీ బలమైన రాజకీయ పక్షంగా అవతరించినది. 1985 తరువాత జరిగిన ఎన్నికలలో 75% ఓట్లతో సత్తాచాటింది. దీనితో 1983 ఎన్నికల తరువాత తెలుగుదేశం పార్టీలో చేరిన చంద్రబాబునాయుడి దృష్టి ఈ నియోజకవర్గంపై పడింది. 1989 నుంచి చంద్రబాబు వరుసగా ఘనవిజయం సాధిస్తున్నాడు. తెలుగుదేశం మరియు కాంగ్రెస్ పార్టీలు కలిపి దాదాపు 95% ఓట్లు రాబట్టడం చూస్తే ఈ నియోజకవర్గంలో మూడవ పార్టీ ఉనికి అస్సలు లేదనిచెప్పవచ్చు. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ నుంచి బలమైన అభ్యర్థి ఉండుటకూడా మూడవ పార్టీకి అవకాశం లభించుటలేదు.
[మార్చు] ఈ నియోజకవర్గం నుండి ఎన్నికైన శాసన సభ్యులు
-
-
సంవత్సరం మొత్తం ఓట్లు పోలైన ఓట్లు చెల్లిన ఓట్లు ఎన్నికైన అభ్యర్థి పార్టీ ఓట్లు సమీప ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ ఓట్లు 1955 62,467 25,757 డి.రామబ్రహ్మం కాంగ్రెస్ పార్టీ 14,212 ఎ.పి.వజ్రవేలు చెట్టి సి.పి.ఐ 11,545 1962 69,732 40,045 37,988 ఎ.పి.వజ్రవేలు చెట్టి సి.పి.ఐ 22,534 ఆర్.నాయుడు కాంగ్రెస్ పార్టీ 13,866 1967 69,361 42,189 38,707 డి.వెంకటేశం స్వతంత్ర అభ్యర్ధి 13,542 డి.రామబ్రహ్మం కాంగ్రెస్ పార్టీ 12,945 1972 84,436 48,796 47,001 డి.వెంకటేశం స్వతంత్ర అభ్యర్ధి 25,915 వి.రామస్వామి కాంగ్రెస్ పార్టీ 16,916 1978 93,102 61,713 59,596 బి.ఆర్.దొరస్వామి నాయుడు [3] కాంగ్రెస్ (ఐ) 24,664 డి.వెంకటాచలం జనతా పార్టీ 14,222 1983 98,715 65,821 64,212 ఎన్.రంగస్వామి నాయుడు స్వతంత్ర అభ్యర్ధి 38,543 బి.ఆర్.దొరస్వామి నాయుడు కాంగ్రెస్ పార్టీ 24,550 1985 1,10,080 62,726 61,385 ఎన్.రంగస్వామి నాయుడు తెలుగుదేశం పార్టీ 46,548 ఎస్.కృష్ణ కాంగ్రెస్ పార్టీ 9,584 1989 1,33,954 99,605 95,157 నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ 50,098 బి.ఆర్.దొరస్వామి నాయుడు కాంగ్రెస్ పార్టీ 43,180 1994 1,44,513 1,10,309 1,07,582 నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ 81,210 ఆర్.గోపీనాథ్ కాంగ్రెస్ పార్టీ 24,622 1999 1,61,905 1,29,512 1,25,390 నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ 93,288 ఎం.సుబ్రమణ్యం రెడ్డి కాంగ్రెస్ పార్టీ 27,601 2004 1,85,813 1,40,297 నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ 98,123 ఎం.సుబ్రమణ్యం రెడ్డి కాంగ్రెస్ పార్టీ 38,538
-
[మార్చు] 1999 ఎన్నికలు
| 1999 ఎన్నికల గణాంకాలు | ||||
|---|---|---|---|---|
| ఓట్లు | ||||
| మొత్తం ఓటర్లు | 1,61,872 | |||
| పోలైన ఓట్లు | 1,29,479 | |||
| నారా చంద్రబాబు నాయుడు* | 93,288 | |||
| ఎం.సుబ్రమణ్యం రెడ్డి* | 27,601 | |||
| బి.ఆర్.దొరస్వామినాయుడు* | 4,468 | |||
| * చెల్లిన ఓట్లలో గెలుచుకున్న ఓట్లు | ||||
1999 శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి పోటీచేసిన తెలుగుదేశం పార్టీ అద్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వరుసగా మూడవ సారి ఘనవిజయం సాధించాడు. సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన ఎం.సుబ్రమణ్యం రెడ్డిపై 65,687 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. చంద్రబాబు నాయుడుకు 93,288 ఓట్లు రాగా, సుబ్రమణ్యం రెడ్డికి 27,601 ఓట్లు లభించాయి. పోటీలో ఉన్న మూడవ అభ్యర్థి అన్నా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన మాజీ శాసనసభ్యుడు బి.ఆర్.దొరస్వామి నాయుడు కేవలం 4,468ోట్లు మాత్రమే సాధించి డిపాజిట్ కోల్పోయాడు.
- 1999 ఎన్నికల గణాంకాలు [4]
- మొత్తం ఓటర్లు : 1,61,872.
- పోలైన ఓట్లు : 1,29,479.
- చెల్లిన ఓట్లు : 1,25,357.
- పోలింగ్ శాతం : 79.9%.
- పోటీలో ఉన్నఅభ్యర్థుల సంఖ్య : 3.
[మార్చు] 2004 ఎన్నికలు
| 2004 ఎన్నికల గణాంకాలు | ||||
|---|---|---|---|---|
| ఓట్లు | ||||
| మొత్తం ఓటర్లు | 1,85,813 | |||
| పోలైన ఓట్లు | 1,40,297 | |||
| నారా చంద్రబాబు నాయుడు* | 98,123 | |||
| ఎం.సుబ్రమణ్యం రెడ్డి* | 38,535 | |||
| నాగన్న* | 3,639 | |||
| * చెల్లిన ఓట్లలో గెలుచుకున్న ఓట్లు | ||||
2004 శాసనసభ ఎన్నికలలో కుప్పం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎన్. చంద్ర బాబు నాయుడు కాంగ్రెస్ పార్టీకి చెందిన సమీప ప్రత్యర్థి ఎం. సుబ్రమణ్యం రెడ్డిని 59588 ఓట్ల తేడాతో ఓడించాడు.[5] చంద్రబాబు నాయుడుకి 98123 ఓట్లు రాగా, సుబ్రమణ్యం రెడ్డికి 38535 ఓట్లు లభించాయి. త్రిముఖ పోటీ జరిగిన ఈ నియోజకవర్గంలో పోటీ చేసిన మరో అభ్యర్థి నాగన్న. ఇండిపెండెంట్ గా పోటీచేసిన ఇతడు డిపాజిట్ కోల్పోయాడు.
- 2004 ఎన్నికల గణాంకాలు [6]
- మొత్తం ఓటర్లు : 1,85,813.
- చెల్లిన ఓట్లు : 1,40,297.
- పోలింగ్ శాతం : 75.5%.
- పోటీలో ఉన్నఅభ్యర్థుల సంఖ్య : 3.
- పోలింగ్ స్టేషన్ల సంఖ్య : 187.
[మార్చు] నియోజకవర్గ ప్రముఖులు
- నారా చంద్రబాబు నాయుడు
- ప్రధాన వ్యాసం: నారా చంద్రబాబు నాయుడు
- తొమ్మిదేళ్ళపాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వ్యవహరించిన నారా చంద్రబాబు నాయుడు కుప్పం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యాడు. రాష్ట్రంలోనే కాకుండా దేశ రాజకీయాలలో ప్రముఖ పాత్ర పోషిస్తున్న చంద్రబాబు నాయుడు 1951, ఏప్రిల్ 20న చిత్తూరు జిల్లాలోని నారావారిపల్లె గ్రామంలో జన్మించాడు. కళాశాల దశలోనే రాజకీయాలపై ఆసక్తి చూపి అనతికాలంలోనే శాసనసభ్యుడిగా, రాష్ట్ర మంత్రిగా ఎదిగాడు. అప్పటివరకు కాంగ్రెస్ పార్టీ సభ్యుడైన చంద్రబాబు 1983 ఎన్నికలలో పరాజయం అనంతరం మామ ఎన్.టి.రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీలో చేరి ఆ పార్టీలోనే తనదైన స్థానాన్ని ఏర్పర్చుకున్నాడు. 1994 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ విజయం సాధించి ఎన్టీరామారావు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన పిదప లక్ష్మీ పార్వతి జోక్యం పెరగడంతో రాజకీయ చాకచక్యంతో శాసనసభ్యులను తనవైపు తిప్పుకొని పార్టీ వ్యవస్థాపకుడైన ఎన్టీరామారావునే ముఖ్యమంత్రి పీఠంపై నుంచి దింపి తను ఆ స్థానాన్ని పొందటం దేశ రాజకీయాలనే ఆశ్చర్యపరిచింది. ఆ తరువాత తొమ్మిదేళ్ళ అతని పాలన "హైటెక్" పాలనగా పలువురు ప్రశంసించిననూ 2004 ఎన్నికలలో పార్టీ పరాజయం పొందినది. అప్పటినుంచి శాసనసభలో ప్రతిపక్షనేతగా వ్యవహరిస్తున్నాడు.
- సుబ్రమణ్యం రెడ్డి
- 1999 మరియు 2004 శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి పోటీచేసిన నియోజకవర్గపు ప్రముఖ కాంగ్రెస్ నేత సుబ్రమణ్యం సర్పంచు పదవి నుంచి పైకి ఎదిగిన నాయకుడు. గత రెండు ఎన్నికలలో చంద్రబాబు నాయుడుపై పోటీచేసి ఓడిపోయిననూ దాదాపు 25% ఓట్లు సాధించాడు. 2006 జూలైలో జరిగిన జిల్లాపరిషత్తు ప్రాదేశిక నియోజకవర్గపు(ZPTC) ఎన్నికలలో శాంతిపురం నియోజకవర్గం నుంచి గెలుపొందినాడు.[7]
[మార్చు] మూలాలు
- ↑ తెలుగుతీర్పు 1952-2002 ఏభై ఏళ్ల రాజకీయ విశ్లేషణ - కొమ్మినేని శ్రీనివాసరావు (2003) ప్రజాశక్తి బుక్ హౌస్, పేజీ.145
- ↑ 2004 ఎలక్షన్ వార్తలు
- ↑ (ఆంగ్లము) భారతీయ ఎలక్షన్ కమిషన్, ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల ఫలితాలు.1978-2004
- ↑ http://archive.eci.gov.in/se99/pollupd/ac/states/S01/Aconst142.htm
- ↑ http://news.indiainfo.com/2004/05/11/1105naidu.html
- ↑ http://archive.eci.gov.in/March2004/pollupd/ac/states/s01/aconst142.htm
- ↑ http://chittoor.ap.gov.in/zpctr/chairman.html
|
|
|
|---|---|
| 281. తంబళ్ళపల్లె · 282. పీలేరు · 283. మదనపల్లె · 284. పుంగనూరు · 285. చంద్రగిరి · 286. తిరుపతి · 287. శ్రీకాళహస్తి · 288. సత్యవేడు · 289. నగరి · 290. గంగాధరనెల్లూరు · 291. చిత్తూరు · 292. పూతలపట్టు · 293. పలమనేరు · 294. కుప్పం | |
| జిల్లాల వారీగా నియోజకవర్గాలు |
ఆదిలాబాదు · అనంతపురం · కడప · కరీంనగర్ · కర్నూలు · కృష్ణా · ఖమ్మం · గుంటూరు · చిత్తూరు · తూర్పు గోదావరి · నల్గొండ · నిజామాబాదు · నెల్లూరు · పశ్చిమ గోదావరి · ప్రకాశం · మహబూబ్నగర్ · మెదక్ · రంగారెడ్డి · వరంగల్ · విజయనగరం · విశాఖపట్నం · శ్రీకాకుళం · హైదరాబాదు |