Dzisiaj jest niedziela, 23 listopada 2008 r. 328 dzien roku
Languages:ar | id | bg | ca | ceb | cs | da | de | et | en | es | eo | fr | he | hr | it | ko | lt | hu | nl | ja | no | pl | pt | ru | ro | sk | sl | sr | fi | sv | te | tr | uk | zh






REKLAMA
mp3

కుందేరు

వికీపీడియా నుండి

కుందేరు (కుందూ లేక కుముదవతి అని కూడా వ్యవహరించబడుతోంది) నది ఆంధ్ర ప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో ఉన్న ఎర్రమల కనుమలలో పుట్టి దక్షిన దిశలో ప్రవహించి కడప జిల్లా, కమలాపురం సమీపములో పెన్నా నదిలో కలుస్తుంది. కుందూ నదీతీరాన ఉన్న పట్టణాలలో నంద్యాల ముఖ్యమైనది, అతి పెద్దది. నది నీటి పరివాహక పరిధిలో ఉన్న మండలాలు కర్నూలు జిల్లలోని ఓర్వకల్లు, మిడుతూరు, గడివేముల, నంద్యాల, గోస్పాడు, కోయిలకుంట్ల, దొర్నిపాడు మరియు చాగలమర్రి, కడప జిల్లాలోని మైదుకూరు.

కుందేరులో నీళ్లు పశ్చిమాన మద్దులేరు, జుర్రేరు నుండి తూర్పున కాళి మరియు వక్కలేరు నుండి చేరతాయి. కుందేరు మరియు మద్దులేరు నిండా నీటితో ప్రవహించినప్పుడు వాటి మధ్యన ఉన్న జలకనూరు వంటి గ్రామాలు నీటితో నిండిపోతాయి. జుర్రేరు బనగానపల్లె ప్రాంతము నుండి ప్రవహించి కుందేరులో చేరుతుంది.

కుందేరు నదీ అడుగులో రాతిమయము. ఇక్కడ సున్నపురాళ్లను త్రవ్వి తీస్తారు. నది అడుగున శిలల పొరల వలన నీరు భూమిలోకి ఇంకక పోవడము విశేషము. దీనివళ్ల నది వెంబడి ఉన్న బావుల్లో నీరు తాగే యోగ్యముగా లేదు.

నంద్యాల వద్ద కుందేరు కర్నూలు - కంభం రహదారి దాటే చోట 1864లో ఒక వంతెన నిర్మించారు.

[మార్చు] మూలాలు

  • మద్రాసు ప్రెసిడెన్సిలో కర్నూలు జిల్లా మాన్యువల్ - నరహరి గోపాలకృష్ణమ చెట్టి (పేజీ.14,15)

Polska, Dolar, Forex


Wikipedia jest zarejestrowanym znakiem towarowym Wikimedia Foundation
Wszystkie materiay pochodz z Wikipedii, obite s licencj GNU Free Documentation License