కీసర
వికీపీడియా నుండి
|
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. |
| ?కీసర మండలం రంగారెడ్డి • ఆంధ్ర ప్రదేశ్ |
|
|
|
|
|
|
|
| అక్షాంశరేఖాంశాలు: | |
| టైం జోన్ | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
| ముఖ్య పట్టణము | కీసర |
| జిల్లా(లు) | రంగారెడ్డి |
| గ్రామాలు | 15 |
| జనాభా • మగ • ఆడ • అక్షరాశ్యత శాతం • మగ • ఆడ |
197,145 (2001) • 102191 • 94954 • 77.52 • 84.20 • 70.27 |
కీసర, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒక మండలము. కీసర, రాష్ట్ర రాజధాని హైదరాబాదు నుండి 25 కి.మీ దూరములో ఉన్నది. మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గములో భాగమైన ఈ మండలంలో 15 గ్రామాలు ఉన్నవి. కీసర ఇక్కడ ఉన్న అతి పురాతన కీసరగుట్ట శివుని ఆలయమునకు ప్రసిద్ధి. "మహాశివరాత్రి" పండుగ రోజు ఆలయమును దర్శించుటకు రాష్ట్రము నలుమూలలనుండి భక్తులు విచ్చేయుదురు.
విషయ సూచిక |
[మార్చు] శ్రీరామలింగేశ్వరస్వామి దేవాలయం
[మార్చు] స్థలపురాణము
త్రేతాయుగంలో అయోధ్యా నగరాన్ని పాలించిన శ్రీరాముడు సీతాదేవి, హనుమంతులతో వనవిహారమునకై వచ్చి, ఇక్కడి ప్రకృతి సౌందర్యానికి ఆనందభరితుడై ఇక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్టించడానికి నిశ్చయించారు. ఈ విషయమై అరణ్య ప్రాంతములోని మహర్షులను సంప్రదించగా వారు సంతోషించి శివలింగ ప్రతిష్టాపన కోసం సుముహూర్తాన్ని నిర్ణయించారు.
అప్పుడు శ్రీరామచంద్రుడు హనుమంతుని కాశీ క్షేత్రమునకు వెళ్ళి గొప్ప శివలింగమును తీసుకొని రావలసినదని ఆజ్ఞాపిస్తారు. ఆంజనేయుడు ఆకాశమార్గాన కాశీక్షేత్రానికి వెళ్ళగా, ఈశ్వరుడు నూటొక్క శివలింగముల రూపములో దర్శనమిచ్చాడు. అతడు పరమేశ్వరుని ప్రార్థించి నూటొక్క శివలింగములను తీసుకొని బయలుదేరాడు.
ఇక్కడ మహర్షులు నిర్ణయించిన సుముహూర్తము సమీపిస్తుండగా శ్రీరాముడి పరమేశ్వరుని ప్రార్థింపగా ముహూర్త సమయమునకు ఈశ్వరుడు ప్రత్యక్షమై శివలింగ రూపమును ధరించాడు. శ్రీసీతారామచంద్రులు ఆ శివలింగమును ప్రతిష్టించి అభిషేకించారు. అందువలన ఈ స్వామికి "శ్రీరామలింగేశ్వరస్వామి" అని పేరు వచ్చినది.
తరువాత హనుమంతుడు 101 శివలింగములను తీసుకువచ్చి, అప్పటికే ప్రతిష్ట జరగడంతో ఆవేశముతో తాను తెచ్చిన శివలింగములను తోకతో విసిరివేసెను. ఆ శివలింగాలన్నీ పరిసర ప్రాంతములలో అక్కడక్కడా పడినవి. హనుమంతుని శాంతింపజేయుటకు ఈ క్షేత్రము ఆచంద్రతారార్కం అతని పేరుమీద 'కేసరి గిరి'గా ప్రసిద్ధిచెందుతుందని ఆశీర్వదించెను. హనుమంతుడు శాంతించి తాను తెచ్చిన శివలింగములలో ఒకదానిని స్వామివారి వామభాగములో ప్రతిష్టించాడు. అదే మారుతీ కాశీ విశ్వేశ్వరాలయము.
కాలక్రమేణా కేసరి గిరి క్షేత్రము 'కీసరగుట్ట'గా రూపాంతరం చెందింది. ఇక్కడ స్వామివారు పశ్చిమ ముఖముగా ఉండుట విశేషము.
[మార్చు] చరిత్ర
చారిత్రక పరిశోధకుల అభిప్రాయము ప్రకారం క్రీ.శ. 4వ శతాబ్దం ఉత్తరార్ధం నుండి 7వ శతాబ్దం పూర్వార్థం వరకు ఆంధ్రదేశాన్ని ఏకచ్ఛత్రాధిపత్యంగా పరిపాలించిన విష్ణుకుండిన రాజవంశమునకు కీసరగుట్టతో సన్నిహిత సంబంధం ఉన్నట్లు తెలుస్తుంది. వీరి రాజముత్రిక లంఘించు సింహం (కేసరి).
విష్ణుకుండినులు మొదట ఇంద్రపురిని (నేటి నల్గొండ జిల్లా రామన్నపేట మండలంలోని తుమ్మలగూడెం) రాజధానిగా చేసుకొని ప్రజారంజకంగా పరిపాలన చేశారు. కీసరగుట్ట ప్రాంతం వారి సైనిక స్థావరం. ఈ ప్రాంతంలో పురావస్తు శాఖవారి త్రవ్వకపు పరిశోధనలలో 3 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉన్న ఒక శిథిలమైన కోట, భవనాలు, ఆభరణాలు, అలంకార వస్తువులు, నాణెములు, మట్టి పాత్రలు, యజ్ఞ కుండాలు వెలుగుచూశాయి. ఈ వంశంలోని మొదటి గోవింద వర్మ బలపరాక్రమ సంపన్నుడై అనేక రాజ్యాలను జయించి బౌద్ధారామ విహారాలను, చైత్యములను, దేవాలయములను నిర్మించి ప్రసిద్ధిచెందినట్లుగా ఇంద్రపురి (ఇంద్రపాల నగరం) లో లభించిన తామ్రశాసనం ద్వారా తెలుస్తోంది.
ఈ వంశీయులు అపురూపమైన దేవాలయాలను, గుహాలయాలను నిర్మించారు. నల్గొండ జిల్లాలోని చెరువుగట్టు జడల రామలింగేశ్వర ఆలయం, తుమ్మలగూడెం లోని రామేశ్వర, అమరేశ్వర, మల్లికార్జున ఆలయాలు, మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్ సమీపంలోని ఉత్తరరాజ రామలింగేశ్వరాలయం, కందూరు రామలింగేశ్వరాలయం, గుంటూరు జిల్లా వేల్పూరు రామలింగేశ్వరాలయం వీటిలో కొన్ని దేవాలయాలు.
క్రీ.శ. 17వ శతాబ్దంలో గోల్కొండ కుతుబ్ షాహీ వంశంలోని అబ్దుల్ హసన్ తానీషా నవాబు వద్ద మహా మంత్రులుగా ఉన్న అక్కన్న, మాదన్నలు కేసరిగిరి శ్రీరామలింగేశ్వరస్వామిని దర్శించి, ఈ క్షేత్రాన్ని హరిహర క్షేత్రముగా అభివృద్ధి చేయదలచి హిందూ మహమ్మదీయ సమ్మిళిత సంప్రదాయం ఉట్టిపడేలా ఒక దేవాలయాన్ని నిర్మించారు. దానిలో శ్రీ లక్ష్మీనృశింహస్వామి వారి విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఈ దేవాలయం వెనుక ఒక ఏకశిలా విజయస్థూపం కలదు. ఈ స్తంభంపై మత్స్య, కూర్మ, వరాహ, గణపతి, ఆంజనేయ విగ్రహాలు చెక్కబడి ఉన్నవి.
[మార్చు] మండలంలోని పట్టణాలు
[మార్చు] మండలంలోని గ్రామాలు
| గ్రామము | విస్తీర్ణము(ఎకరాలు) | జనాభా |
| అహ్మద్‌గూడా | 576 | 1,803 |
| బోగారం | 2,347 | 1,954 |
| చీర్యాల్ | 2,792 | 3,070 |
| దమ్మాయిగూడ | ||
| ధర్మారం | 1,083 | 418 |
| గోదుమకుంట | 886 | 1,276 |
| హరిదాస్‌పల్లి | 784 | 135 |
| కుందన్‌పల్లి | 1,645 | 1,084 |
| నర్సంపల్లి | 510 | 505 |
| తిమ్మాయిపల్లి | 1,500 | 768 |
| యాద్గార్‌పల్లి (తూర్పు) | 1,449 | 2,968 |
| యాద్గార్‌పల్లి (పడమర) | 1,122 | 729 |
| కీసర | 7,449 | 6,232 |
| కీసర దాయిరా | 772 | 818 |
| రాంపల్లి (కీసర) | ||
| రాంపల్లి దాయర | ||
| నాగారం | 3,643 | 6,291 |
[మార్చు] బయటి లింకులు
|
|
|
|---|---|
|
మర్పల్లి • మోమిన్‌పేట్ • నవాబ్‌పేట్ • శంకర్పల్లి • మల్కాజ్గిరి • శేరిలింగంపల్లి • కుత్బుల్లాపూర్ • మేడ్చల్ • షామీర్పేట్ • బాలానగర్ • కీసర • ఘటకేసర్ • ఉప్పల్ • హయాత్‌నగర్ • సరూర్‌నగర్ • రాజేంద్రనగర్ • మొయినాబాద్ • చేవెల్ల • వికారాబాద్ • ధరూర్ • బంట్వారం • పెద్దేముల్ • తాండూరు • బషీరాబాద్ • యేలాల్ • దోమ • గందీద్ • కుల్కచర్ల • పరిగి • పూడూర్ • షాబాద్ • శంషాబాద్ • మహేశ్వరం • ఇబ్రహీంపట్నం • మంచాల్ • యాచారం • కందుకూర్ |
|
|
|
|
|---|---|
| అహ్మద్‌గూడా · బోగారం · చీర్యాల్ · దమ్మాయిగూడ · ధర్మారం · గోదుమకుంట · హరిదాస్‌పల్లి · కుందన్‌పల్లి · నర్సంపల్లి · తిమ్మాయిపల్లి · యాద్గార్‌పల్లి (తూర్పు) · యాద్గార్‌పల్లి (పడమర) · కీసర · కీసర దాయిరా · నాగారం |