కర్నూలు
వికీపీడియా నుండి
| ?కర్నూలు ఆంధ్ర ప్రదేశ్ • భారతదేశం |
|
|
|
|
| అక్షాంశరేఖాంశాలు: | |
| టైం జోన్ | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
| విస్తీర్ణం | 17,658 కి.మీ² (6,818 చ.మై) |
| ముఖ్య పట్టణము | కర్నూలు |
| ప్రాంతం | రాయలసీమ |
| జనాభా • జనసాంద్రత • పట్టణ • మగ • ఆడ • అక్షరాశ్యత శాతం • మగ • ఆడ |
3,512,000 (2001) • 199/కి.మీ² (515/చ.మై) • 792000 • 1787000 • 1724000 • 54.43 • 67.36 • 41.07 |
కర్నూలు దక్షిణ భారత దేశములోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన నగరము మరియు అదే పేరుగల జిల్లా యొక్క ముఖ్య పట్టణం. ఒకప్పుడు కందెనవోలు గా ప్రసిద్ధి చెందిన పట్టణం ఇప్పుడు కర్నూలుగా మారింది. 1953 నుండి 1956 నవంబర్ 1 వరకు ఆంద్రరాష్ట్రం రాజధాని గా కొనసాగిందిజిల్లాలో ఆపరేషన్ టైగర్ ప్రాజెక్టు కింద అభివృద్ధి చేసిన, ప్రపంచంలోకెల్లా పెద్దదైన, వన్యమృగ సంరక్షణ కేంద్రం (శ్రీశైలం - నాగార్జునసాగర్) ఉంది. ఎప్పుడో అంతరించి పోయిందని భావించబడిన బట్టమేక పిట్ట ఇటీవల జిల్లాలోని రోళ్ళపాడు వద్ద కనిపించడంతో ఆ ప్రాంతాన్ని అభయారణ్యంగా ప్రకటించారు.
మధ్వాచార్యులు అయిన రాఘవేంద్ర స్వామి పుణ్యక్షేత్రం మంత్రాలయం కర్నూలు జిల్లాలోదే. మంత్రాలయం తుంగభద్రానదీ తీరంలో ఉన్న పుణ్యక్షేత్రం. అహోబిలంలో నరసింహస్వామి దేవాలయం ఉంది. ఇక్కడ నరసింహస్వామిని నవరూపాలుగా కొలుస్తారు. మహానందిలో నందీశ్వరుడు ఉన్నాడు. ఇక్కడి కోనేరులో అన్ని కాలాల్లోను నీరు ఒకే మట్టంలో ఉంటుంది. దేశంలోని ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైలం ఈజిల్లాలోదే. ఇక్కడ మల్లికార్జున స్వామి, భ్రమరాంబ దేవాలయాలు ఉన్నాయి. కృష్ణా నదిపై ఇక్కడ నిర్మించబడ్డ ఆనకట్ట దేశంలోని అతిపెద్ద వాటిలో ఒకటి. లక్షలాది ఎకరాలకు నీరందించడమే కాక, విద్యుదుత్పత్తిలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికే ప్రధాన వనరుగా ఉంది.
విషయ సూచిక |
[మార్చు] చరిత్ర
ఇప్పుడు కర్నూలుగా పిలువబడే ఈ నగరం పూర్వ నామధేయం కందెనవోలు. 11వ శతాబ్దిలో ఆలంపూరు లో కడుతున్న ఆలయం కోసం బళ్ల మీద రాళ్లను తరలించే క్రమంలో, ఈ ప్రాంతంలో బండి చక్రాలకు కందెన రాయడానికి ఆపేవారట. దీని వల్ల ఈ ప్రాంతానికి కందెనవోలు అనే పేరు వచ్చింది. అదే రానురాను కర్నూలుగా రూపాంతరం చెందింది.
బాదామి చాళుక్యులు, తెలుగు చోళులు, కాకతీయులు ఈ ప్రాంతాన్ని పాలించినట్లుగా చరిత్ర చెబుతోంది. అటు తర్వాత విజయనగర రాజులు ఈ ప్రాంతాన్ని జయించి తమ ఆధీనం లోనికి తెచ్చుకొన్నారు. శ్రీకృష్ణదేవరాయల కాలంలో ప్రస్తుత జిల్లా అంతా ఆయన ఏలుబడి లోనికి వచ్చింది. కర్నూలులో ప్రఖ్యాతి గాంచిన కొండారెడ్డి బురుజు, అచ్యుతదేవరాయలు విజయనగర రాజుగా ఉన్నప్పుడు కట్టబడిన కోటలో ఓ భాగం మాత్రమే, ఆ తర్వాత ఎప్పుడో కొండారెడ్డి అనే విప్లవవీరుణ్ణి అక్కడ బంధించడం వల్ల ఆ పేరు వచ్చింది.
1565లో తళ్ళికోట యుద్ధంలో విజయనగర సామ్రాజ్య పతనం తర్వాత గోల్కొండ కుతుబ్ షాహీ సుల్తాన్ కర్నూలును వశపరచుకొన్నాడు. 1687లో ఔరంగజేబు కృష్ణానది తీరాన్ని దాటి దండయాత్ర చేసినప్పుడు, గియాసుద్ధీన్ అనే సేనాని కర్నూలును జయించాడు. 1733లో ఇక్కడి నవాబు హిమాయత్ ఖాన్, కర్ణాటక యుద్ధాలుగా ప్రసిద్ధి గాంచిన ఆంగ్లేయ-ఫ్రెంచి వారి గొడవల్లో పాలుపంచుకొన్నాడు. 1741లో మరాఠా విజృంభణ కొనసాగినప్పుడు, కర్నూలు వారి హయాంలోనికి వచ్చింది.
1751 లో సలాబత్ జంగ్, ఫ్రెంచి జనరల్ బుస్సీ (పిల్లల పాటల్లోని బూచాడు) కర్నూలును ముట్టడించారు. 1755 లో మైసూరుకు చెందిన హైదర్ అలీ ఈ ప్రాంతాన్ని వశపరచుకొన్నాడు. 1799లో శ్రీరంగపట్టణంలో జరిగిన యుద్ధంలో టిప్పు సుల్తాన్ మరణించగా అప్పుడు ఈ జిల్లా హైదరాబాద్ నిజాం నవాబు సొంతం అయింది. తన రక్షణ కోసం బ్రిటిషు సైనికులని ఉపయోగించుకొన్నందుకు ప్రతిగా 1800లో ఈ ప్రాంతాన్ని బ్రిటిషు వారికి దత్తత ఇచ్చాడు నిజాం నవాబు. అందుకే ఈ ప్రాంతాన్ని అప్పటి నుంచి 'దత్తమండలం' (సీడెడ్) అనేవారు. 1928 లో ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు, గాడిచర్ల హరిసర్వోత్తమ రావు ఇప్పటి రాయలసీమ అనే పేరు పెట్టాడు. ఇప్పటికీ సినీపరిభాషలో 'సీమ'ను సీడెడ్ అనే పిలుస్తారు.
18వ శతాబ్ధం లో కర్నూలు, అర్ధ స్వత్రంత్రుడైన పఠాన్ నవాబు యొక్క జాగీరు లో భాగముగా ఉండేది. 1838 లో ఈ నవాబు యొక్క వారసుని, బ్రిటీషు ప్రభుత్వము రాజద్రోహ నేరంమోపి గద్దె దింపినది. నవాబు యొక్క జాగీరు కర్నూలు రాజధానిగా మద్రాసు ప్రెసిడెన్సీలో ఒక జిల్లా అయినది. జిల్లా మధ్యలో బనగానపల్లె సంస్థానము నలువైపులా కర్నూలు జిల్లాచే చుట్టబడి ఉన్నది. 1947లో భారత దేశ స్వాతంత్రానంతరము కర్నూలు, పూర్వపు మద్రాసు ప్రెసిడెన్సీనుండి ఏర్పడిన మద్రాసు రాష్ట్రములో భాగమైనది. బనగానపల్లె సంస్థానము జిల్లాలో విలీనమైనది. 1953లో మద్రాసు రాష్ట్రములోని పదకొండు ఉత్తర జిల్లాలు కలసి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు కర్నూలు ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని అయినది. 1956లో ఆంధ్ర రాష్ట్రము విస్తరించి, పూర్వపు హైదరాబాద్ రాష్ట్రములో భాగమైన తెలంగాణ ప్రాంతమును కలుపుకొని ఆంధ్ర ప్రదేశ్ అవతరించినది. కొత్తగా ఏర్పడిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి హైదరాబాదును రాజధానిగా చేశారు.
[మార్చు] ఆర్థిక రంగం
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలలాగే కర్నూలు జిల్లాలో కూడా వ్యవసాయమే ప్రధాన వృత్తి.
ఇక్కడ ఎక్కువ భాగం వ్యవసాయం వర్షాధారితమే అయినా కె.సి. కెనాల్, తెలుగుగంగ కింద చాలా ప్రాంతం సాగుబడికి వస్తుంది. వీటి పరీవాహక ప్రాంతాల్లో వరి పండిస్తారు. ఇవి కాకుండా వెలుగోడు, అవుకు, పోతిరెడ్డిపాడు, శ్రీశైలం రిసర్వాయర్స్ కింద చాలా ప్రాంతం సాగుబడికి వస్తుంది. ఇక్కడ బేతంచెర్ల ప్రాంతంలో సున్నపు రాయి విరివిగా లభిస్తుంది. ఇల్లలో ఫ్లోరింగుకు ఉపయోగించే నాపరాయి కూడా ఇక్కడ విరివిగా లభిస్తుంది. ఇక్కడ లభించే సున్నపురాయి ఆధారంగా ఆంధ్ర ప్రదేశ్ పభుత్వం పాణ్యం సిమెంట్ స్తాపించింది.
టిజివి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్, నంది గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్,చెప్పుకోదగిన వ్యాపార సంస్తలు. తాడిపత్రి దగ్గరి ఎల్ అండ్ టి లో కొంత భాగం కర్నూలు భూభాగంలోనే ఉంది.
ఇక్కడి బస్టాండు రాష్ట్రములొ మూడో పెద్దది. ఇక్కడి ఆసుపత్రి రాష్ట్రములొ రెండో పెద్దది.
[మార్చు] కొన్ని గణాంకాలు
- రెవిన్యూ డివిజన్లు - 3 కర్నూలు, ఆదోని, నంద్యాల
- లోక్సభ స్థానాలు - 2 నియోజకవర్గాల పేర్లు: కర్నూలు నంద్యాల
- శాసన సభ స్థానాలు - 13 నియోజకవర్గాల పేర్లు: ఆలూరు, కోడుమూరు, ఆదోని, ఎమ్మిగనూరు, కర్నూలు, పత్తికొండ, ద్రోణాచలం, కోయిలకుంట్ల, ఆళ్ళగడ్డ, పాణ్యం, నందికోట్కూరు, నంద్యాల, ఆత్మకూరు.
- నదులు: తుంగభద్ర, హగరి, కుందేరు, సగిలేరు. తుంగభద్ర, హగరి కృష్ణానదికి ఉపనదులు. కుందేరు, సగిలేరు పెన్నానదికి ఉపనదులు.
- దర్శనీయప్రదేశాలు: మంత్రాలయం, సంగమేశ్వరం,శ్రీశైలం, మహానంది, అహోబిలం, యాగంటి, బెలూం గుహలు
[మార్చు] జిల్లాకు ఖ్యాతి తెచ్చిన ప్రముఖులు
- కోట్ల విజయభాస్కరరెడ్డి: ఆంధ్ర ప్రదేశ్ కు రెండు సార్లు (1982-83, 1992-94) ముఖ్యమంత్రి.
- దామోదరం సంజీవయ్య: ఆంధ్ర ప్రదేశ్ రెండవ ముఖ్యమంత్రి (1960-62), పూర్వ అఖిల భారత కాంగ్రెసు కమిటీ అధ్యక్షులు.
- పెరుగు శివారెడ్డి: నేత్ర వైద్య నిపుణుడు.
- పెండేకంటి వెంకటసుబ్బయ్య: పూర్వ కేంద్ర మంత్రి, బీహారు మరియు కర్ణాటక గవర్నరు, ఆరు మార్లు నంద్యాల నియోజకవర్గ లోక్ సభ సభ్యులు.
- పోతులూరి వీరబ్రహ్మం: యోగి, కాలజ్ఞాన సృష్టికర్త.
- బుడ్డా వెంగళరెడ్డి: మాజి మంత్రి ,రెండు మార్లు ,దాత
- ఉయ్యాళవాడ నరసిమ్హారెడ్డి: స్వాతంత్ర సమరయోధుడు
- పి.వి.నరసింహారావు: పూర్వ ప్రధానమంత్రి, రెండు మార్లు నంద్యాల నియోజకవర్గ లోక్ సభ సభ్యులు.
- గుణంరెడ్డి పుల్లారెడ్డి : ప్రఖ్యాత వ్యాపారవేత్త, విద్యావేత్త (స్వచ్ఛమైన నేతి మిఠాయిలు)
- యమ్.యెన్.యెస్:ప్రఖ్యాత వ్యక్తి
[మార్చు] ఉన్నత విద్యా సంస్థలు
- మాంటిస్సొరి విద్యాసంస్థలు, కర్నూలు
- కర్నూలు వైద్య కళాశాల, కర్నూలు
- పుల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాల, కర్నూలు
- సిల్వర్ జూబిలీ డిగ్రీ కళాశాల, కర్నూలు
- కె.వి.ఆర్ డిగ్రీ కళాశాల (కశి రెడ్డి వెంకట రెడ్డి), కర్నూలు
- రాజీవ్ గాంధీ స్మారక వైజ్ఞానిక సంస్థ, నంద్యాల
- ప్రభుత్వ వ్యవసాయ కళాశాల, మహానంది
- యస్.టి.బి.సి.కళాశాల,
- బాలశివ డిగ్రీ కళాశాల
- వాసవి డిగ్రీ కళాశాల,
- కర్నూలు డిగ్రీ కళాశాల, కర్నూలు,
- ఊస్మానియా డిగ్రీ కళాశాల, కర్నూలు
- కేశవ రెడ్డి విద్యాసంస్థలు, కర్నూలు
[మార్చు] మండలాలు
భౌగోళికంగా కర్నూలు జిల్లాను 54 రెవిన్యూ మండలాలుగా విభజించినారు[2].
|
1.కౌతాలం 2.కోసిగి 4.నందవరము 6.గూడూరు 7.కర్నూలు 9.పగిడ్యాల 10.కొత్తపల్లె 11.ఆత్మకూరు 12.శ్రీశైలం 13.వెలుగోడు 14.పాములపాడు 16.మిడ్తూరు 17.ఓర్వకల్లు 18.కల్లూరు |
19.కోడుమూరు 20.గోనెగండ్ల 21.యెమ్మిగనూరు 22.పెద్ద కడబూరు 23.ఆదోని 24.హొలగుండ 25.ఆలూరు 26.ఆస్పరి 27.దేవనకొండ 28.క్రిష్ణగిరి 29.వెల్దుర్తి 30.బేతంచెర్ల 31.పాణ్యం 32.గడివేముల 34.నంద్యాల 35.మహానంది 36.సిర్వేల్ |
37.రుద్రవరము 38.ఆళ్లగడ్డ 39.చాగలమర్రి 40.ఉయ్యాలవాడ 41.దోర్ణిపాడు 42.గోస్పాడు 43.కోయిలకుంట్ల 44.బనగానపల్లె 45.సంజామల 46.కొలిమిగుండ్ల 47.ఔకు 48.ప్యాపిలి 49.ధోన్ 50.తుగ్గలి 51.పత్తికొండ 53.చిప్పగిరి 54.హాలహర్వి |
[మార్చు] జిల్లాలో చూడదగిన విశేషాలు
- బెలూం గుహలు
- మంత్రాలయం
- అహోబిలం
- శ్రీశైలం
- మహానంది
- అయ్యప్ప స్వామి ఆలయము,కర్నూలు
- కొండారెడ్డి బురుజు
- జగన్నాథ గుట్ట ఆలయము
[మార్చు] కర్నూలులో చూడవలసినవి
|
Kondareddyfort.jpg
కొండారెడ్డి బురుజు |
[మార్చు] మూలాలు
- ↑ http://asihyd.ap.nic.in/kurnool/index.htm
- ↑ పంచాయత్ రాజ్ మంత్రిత్వ శాఖ వెబ్‌సైటులో కర్నూలు జిల్లా తాలూకాల వివరాలు. జూలై 26, 2007న సేకరించారు.
[మార్చు] బయటి లింకులు
|
|
|
|---|---|
| ఆంధ్ర ప్రదేశ్ విషయాలు · చరిత్ర · రాజకీయాలు · తెలుగు ప్రజలు | |
| రాజధాని | హైదరాబాద్ |
| జిల్లాలు | అనంతపురం · అదిలాబాదు · కడప · కరీంనగర్ · కర్నూలు · కృష్ణ · ఖమ్మం · గుంటూరు · చిత్తూరు · తూర్పు గోదావరి · నల్గొండ · నిజామాబాదు · నెల్లూరు · పశ్చిమ గోదావరి · ప్రకాశం · మహబూబ్ నగర్ · మెదక్ · రంగారెడ్డి · వరంగల్ · విజయనగరం · విశాఖపట్నం · శ్రీకాకుళం · హైదరాబాదు |
| ప్రధాన నగరాలు | హైదరాబాదు · విశాఖపట్నం · విజయవాడ · తిరుపతి · వరంగల్ · గుంటూరు · రాజమండ్రి · కాకినాడ · నెల్లూరు · కర్నూలు · అనంతపురం · ఏలూరు · మచిలీపట్నం · కరీంనగర్ · కడప · ఖమ్మం · నిజామాబాదు · మహబూబ్ నగర్ |
