Dzisiaj jest czwartek, 04 grudnia 2008 r. 339 dzien roku
Languages:ar | id | bg | ca | ceb | cs | da | de | et | en | es | eo | fr | he | hr | it | ko | lt | hu | nl | ja | no | pl | pt | ru | ro | sk | sl | sr | fi | sv | te | tr | uk | zh






REKLAMA
mp3

కడప

వికీపీడియా నుండి


  ?కడప
ఆంధ్ర ప్రదేశ్ • భారతదేశం
కడపను చూపిస్తున్న పఠము
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని గుర్తిస్తున్న భారతదేశ పఠము
Location of కడప
అక్షాంశరేఖాంశాలు: 14°29′N 78°49′E / 14.48, 78.81
టైం జోన్ భాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణం 15,359 కి.మీ² (5,930 చ.మై)
ముఖ్య పట్టణము కడప
ప్రాంతం రాయలసీమ
జనాభా
జనసాంద్రత
పట్టణ
• మగ
• ఆడ
అక్షరాశ్యత శాతం
• మగ
• ఆడ
2,573,000 (2001)
• 168/కి.మీ² (435/చ.మై)
• 600000
• 1303000
• 1270000
• 64.02
• 76.98
• 50.76

అక్షాంశరేఖాంశాలు: 14°29′N 78°49′E / 14.48, 78.81 కడప - ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని రాయలసీమ ప్రాంతమునకు చెందిన జిల్లా. సుప్రసిద్ధ వాగ్గేయకారుడు మరియు సంకీర్తనాచార్యుడయిన అన్నమయ్య, ఆంధ్ర కవితా పితామహుడు అల్లసాని పెద్దన, తెలుగు జాతీయ కవి వేమన, తొలి తెలుగు కవయిత్రి తాళ్ళపాక తిమ్మక్క, మరో ప్రసిద్ధ కవయిత్రి మొల్ల, మహోన్నతమైన యోగి శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి, అయ్యలరాజు రామభద్రుడు ఈ జిల్లాకు చెందినవారే. ప్రపంచ ప్రఖ్యాత సురభి నాటక సమాజం ప్రస్థానం 1885లో కడప జిల్లా సురభి గ్రామంలో 'కీచక వధ'నాటక ప్రదర్శనతో మొదలయ్యింది. ఈ సమాజ వ్యవస్థాపకుడు వనారస గోవిందరావు. కడప జిల్లా బెరైటీస్(ముగ్గురాయి) గనులు మరియు కడప బండలకు ప్రసిద్ధి చెందినది. కడప జిల్లాకు తూర్పున నెల్లూరు, పశ్చిమాన అనంతపురం మరియు దక్షిణాన చిత్తూరు జిల్లాలు కలవు. కర్నూలు మరియు ప్రకాశం జిల్లాలు ఉత్తరాన సరిహద్దులు. పూర్వము ఈ జిల్లాకు హిరణ్యదేశమని పేరు కలదు. ఈ ప్రదేశము పల్లవులు, తెలుగు చోళులు, కాకతీయులు, విజయనగర రాజులు,గండికోట పెమ్మసాని నాయకులు, నిజాము నవాబులు,సిద్ధవటం నుంచి పరిపాలించిన మట్లి రాజులు, మరియు కడప నవాబుల చే పరిపాలించబడినది. అసలు తెలుగు ఇక్కడే పుట్టినది అని చెప్పటానికి చాలా అధారాలు వున్నాయి[ఆధారం కోరబడినది].


ప్రస్తుతం ఈ జిల్లాకి చెందిన శ్రీ వై.ఎస్.రాజశేఖర రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు.

విషయ సూచిక

[మార్చు] జిల్లా గణాంకాలు

[మార్చు] భౌగోళికము

Climate: Tropical

  • ఉష్ణోగ్రత శ్రేణి:
    • వేసవికాలము: 30°C. - 44°C. (దాదాపు 81.56F - 119.6F)
    • శీతాకాలము: 21°C. - 30°C. (దాదాపు 57F - 81.56F)
  • వర్షపాతము: 695 మి.మీ (Seasonal)
  • అటవీ సంపద: జిల్లాలోని అటవీ ప్రాంతము కలప సమకూర్చడమే కాక దేశానికి విదేశీమారకము తెచ్చిపెట్టే ఎర్రచందనము జిల్లాలోనే లభ్యమవుతుంది. ప్రపంచంలో మరెక్కడా కనిపించకుండా ఆంతరించి పోయిందనుకున్న కలివికోడి ఇక్కడి శ్రీ లంకమల్లేశ్వర అభయారణ్యంలో కనిపించింది. సింహాలు, చిరుతపులులు, మెదలయిన వన్యప్రాణులు ఈ అడవులలో నివసిస్తున్నాయి.

ధార్మిక వ్యవస్థకు పునాదులైన ఎన్నో దేవాలయాలు, క్షేత్రాలు, తీర్థాలు ఈ జిల్లాలో ఉన్నాయి. రాజులు, రాజ్యాలు అంతరించినా ఆనాటి చరిత్రకు గుర్తులుగా గండికోట, సిద్ధవటం కోటలు మిగిలి ఉన్నాయి. ప్రకృతి రమణీయాలైన కొండలు, కోనలు, చందన వృక్షాలు, వన్యమృగాలు ఈ జిల్లాలో ఉన్నాయి.

[మార్చు] చరిత్ర

కడప జిల్లా చరిత్ర చాలా ప్రాచీనమైనది. క్రీ.పూ. 274-236 ప్రాంతంలో అశోక చక్రవర్తి ఈ ప్రాంతాన్ని పాలించాడు.ఆ తరువాత శాతవాహనులు పాలించారు. శాతవాహనుల నాణేలు పెద్దముడియం, దానవులపాడు గ్రామాల్లో దొరికాయి. క్రీ.శ. 250-450 ప్రాంతంలో పల్లవరాజులు పాలించారు. ఇంకా రాష్ట్రకూటులు, చోళులు, కళ్యాణి చాళుక్యులు, వైదుంబులు, కాకతీయులు మొదలైన రాజవంశాలు ఈ ప్రాంతాన్ని పాలించాయి. క్రీ.శ. 1336-1565 కాలంలో విలసిల్లిన విజయనగర సామ్రాజ్యంలో కడప జిల్లా ఒక భాగం. గండికోట ను పాలించిన పెమ్మసాని నాయకులు విజయనగర రాజులకు సామంతులుగా విధేయులై పేరుప్రఖ్యాతులుపొందారు. నంద్యాల రాజులు, మట్లి రాజులు కూడ ఈ ప్రాంతం మీద పెత్తనం సాగించారు. విజయనగర పతనం తర్వాత గోల్కొండ నవాబులు, బీజాపూరు సుల్తానులు, ఔరంగజేబు మొదలైన మహమ్మదీయ రాజులు పాలించారు. క్రీ.శ. 1710 ప్రాంతంలో అబ్దుల్ నబీ ఖాన్ కడపలో కోటను నిర్మించాడు. నవాబుల తర్వాత పాళెగాళ్ళు విజృంభించారు.

ఆ తరువాత ఈస్టిండియా కంపెనీ ఈ ప్రాంతం మీద ఆధిపత్యం వహించింది. సర్ థామస్ మన్రో కడప జిల్లా కలెక్టరు గా పని చేశాడు. పాలెగాళ్ళను అణచాడు. రైత్వారీ విధానాన్ని ప్రవేశపెట్టాడు. ఈ ప్రాంతపు అభివృద్ధికి తెల్లదొరలు కొంతవరకు కృషి చేశారు. మన్రో ఈ ప్రాంతపు దేవాలయాల అభివృద్ధికి మడిమాన్యాలిచ్చాడు. సి.పి.బ్రౌన్ తెలుగుభాషను సముద్ధరించాడు. మనుచరిత్ర, వసుచరిత్ర వంటి తెలుగు కావ్యాలను ముద్రించాడు. మూడు వేలకు పైగా వేమన పద్యాలను సేకరించాడు. వాటిని ఇంగ్లీషులోకి అనువదించి అచ్చు వేయించాడు. ఇక కల్నల్ మెకంజీ గ్రామాల చరిత్రను సేకరించి కైఫియత్తుల పేరుతో భద్రపరిచాడు.

[మార్చు] పర్యాటక ఆకర్షణలు

[మార్చు] సంగ్రహాలయం

  • భగవాన్ మహావీర్ ప్రభుత్వ సంగ్రహాలయం, కడప

[మార్చు] చారిత్రక కట్టడాలు

  • చాంద్ పీరా గుంబద్, కడప
  • గండికోట దుర్గం, గండికోట

[మార్చు] పుణ్య క్షేత్రాలు

[మార్చు] వన్యప్రాణులు

చేరుకొను విధము : కడప, రాష్ట్ర రాజధాని హైదరాబాదుకు 405 కి.మీ దూరమున ఉన్నది.

[మార్చు] మండలాలు

భౌగోళికంగా కడప జిల్లాను 51 రెవిన్యూ మండలాలుగా విభజించినారు[1].

బొమ్మ:Cudapah mandals.jpg

1 కొండాపురం

2 మైలవరం

3 పెద్దముడియం

4 రాజుపాలెం

5 దువ్వూరు

6 మైదుకూరు

7 బ్రహ్మంగారిమఠం

8 బి.కోడూరు

9 కలసపాడు

10 పోరుమామిళ్ల

11 బద్వేలు

12 గోపవరం

13 ఖాజీపేట

14 చాపాడు

15 ప్రొద్దుటూరు

16 జమ్మలమడుగు

17 ముద్దనూరు

18 సింహాద్రిపురం

19 లింగాల

20 పులివెందల

21 వేముల

22 తొండూరు

23 వీరపునాయునిపల్లె

24 యర్రగుంట్ల

25 కమలాపురం

26 వల్లూరు

27 చెన్నూరు

28 అట్లూరు

29 ఒంటిమిట్ట

30 సిద్ధవటం

31 కడప

32 చింతకొమ్మదిన్నె

33 పెండ్లిమర్రి

34 వేంపల్లె

35 చక్రాయపేట

36 లక్కిరెడ్డిపల్లె

37 రామాపురం

38 వీరబల్లె

39 రాజంపేట

40 నందలూరు

41 పెనగలూరు

42 చిట్వేలు

43 కోడూరు

44 ఓబులవారిపల్లె

45 పుల్లంపేట

46 టి.సుండుపల్లె

47 సంబేపల్లి

48 చిన్నమండెం

49 రాయచోటి

50 గాలివీడు

51 కాశి నాయన

[మార్చు] మూలాలు

  1. పంచాయత్ రాజ్ మంత్రిత్వ శాఖ వెబ్‌సైటులో కడప జిల్లా తాలూకాల వివరాలు. జూలై 26, 2007న సేకరించారు.

[మార్చు] బయటి లింకులు

"http://te.wikipedia.org/wiki/%E0%B0%95%E0%B0%A1%E0%B0%AA" నుండి వెలికితీశారు

Polska, Dolar, Forex


Wikipedia jest zarejestrowanym znakiem towarowym Wikimedia Foundation
Wszystkie materiay pochodz z Wikipedii, obite s licencj GNU Free Documentation License