ఒంగోలు
వికీపీడియా నుండి
| ?ఒంగోలు ఆంధ్ర ప్రదేశ్ • భారతదేశం |
|
|
|
|
| అక్షాంశరేఖాంశాలు: | |
| టైం జోన్ | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
| విస్తీర్ణం • ఎత్తు |
• 10 మీ (33 అడుగులు) |
| దూరాలు • నెల్లూరు నుండి • గుంటూరు నుండి • హైదరాబాదు నుండి |
• 125 కి.మీలు ఉ (భూమార్గం) • 150 కి.మీలు ద (భూమార్గం) • 300 కి.మీలు ఆ (భూమార్గం) |
| ముఖ్య పట్టణము | ఒంగోలు |
| ప్రాంతం | కోస్తా |
| జిల్లా(లు) | ప్రకాశం |
| జనాభా | 149,589 (2001) |
| మునిసిపల్ కమీషనర్ | చల్లా అనురాధ[1] |
| శాసన సభ ప్రతినిధి | బాలినేని శ్రీనివాసులు రెడ్డి |
| లోక్ సభ ప్రతినిధి | మాగుంట శ్రీనివాసులు రెడ్డి |
| కోడులు • పిన్‌కోడు • టెలీఫోను • వాహనం |
• 523001 • +08592 • ఎపి-27 |
అక్షాంశరేఖాంశాలు: ఒంగోలు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని ప్రకాశం జిల్లా యెక్క ముఖ్య పట్టణము మరియు ఒంగోలు మండలానికి కేంద్రము. పూర్వము దీని పేరు వంగవోలు. ఒంగోలుజాతి ఎద్దులు ప్రపంచంలోనే పేరెన్నిక కలిగిన ఎద్దులు. ప్రఖ్యాతిచెందిన జేబూ(Zebu)జాతి ఎద్దులలో ఇవి ఒకటి. ఆంధ్రప్రదేశ్ లో వర్జీనియా రకం పొగాకు పంటకు ఒంగోలు ఒక ప్రధాన ఉత్పత్తి, వాణిజ్య కేంద్రము. గ్రానైటు గనులకు ప్రసిద్ధి చెందినది.
విషయ సూచిక |
[మార్చు] చరిత్ర
ఒంగోలు సమీపంలోని చినగంజాంలో దొరికిన ఆధారాలను అనుసరించి మౌర్య, శాతవాహనుల పాలన కాలంలోనే ఈ పట్టణం రూపుదిద్దుకున్నట్లు ఋజువౌతుంది. శాతవాహనుల తరవాత కాకతీయుల పాలనలో ఈ పట్టణం వెలుగులోకి వచ్చింది. ఆ సమయలో మోటుపల్లి మరియు వాడరేవు ప్రసిద్ధ రేవు పట్టణాలుగా ఉన్నాయి. రెడ్డి రాజులు మొదట ఒంగోలు సమీపములోని అద్దంకి ని రాజధానిగా పాలించారు. కడప నవాబుల పాలనలో ఉన్న ఒంగోలు పట్టణాన్ని కర్ణాటక నవాబు హైదర్ అలీకి దత్తం చేయబడింది. 1801లో టిప్పూ సుల్తాన్ వద్ద నుండి బ్రిటీషు పాలనలోకి వచ్చింది.[2] ఒంగోలు పట్టణాన్ని మునిసిపాలిటీగా 1876లో వ్యవస్థీకరించారు.[3] ఆంధ్ర కేసరి గా సుప్రసిద్ధులైన శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారి బాల్యం ఒంగోలులోనే గడిచింది.
[మార్చు] ఆర్ధికం
ఒంగోలులోని పెద్ద వ్యాపార సంస్థలు రైతుకుటుంబాలచే స్తాపించబడ్డాయి. పొగాకు కంపెనీలు, పంట, వ్యాపారం బాగా జరుగుతూ వచ్చింది. 1970, 80 దశాబ్దాలలో షూ, పెయింట్, మందులకంపెనీ, పివిసి మొదలైన పరిశ్రమలు ప్రారంభించబడ్డాయి. కానీ వీటిలో చాలావరకు ఆంధ్ర ప్రదేశ్ లోపల వెలుపల ప్రాతాలలోని పోటీకి నిలిచి మనుగడ సాగించడంలో విఫలమయ్యాయి. మానవశక్తి, పెట్టుబడులు మరియు విజయవంతంగా నడపటానికి కావలసిన నాయకత్వం కొరతే దీనికి కారణం. ఎనభై(80), తొభైయవ(90)దశాబ్దంలో నూతన సెకండరీ, ఇంటర్మీడియట్ కళాశాలలు, ఆసుపత్రుల స్తాపనలు అధికమైనాయి. ఒంగోలు విద్యాపరంగా అభివృద్దిలో ఉన్న ప్రదేశం. ఎనభైయ్యవ(80) దశకంలో ఒంగోలు పశ్చిమ దిశలో గ్రానైట్ నిక్షేపాలు వెలుగు చూడటంతో వ్యాపార పరంగా సరికొత్త అధ్యాయం మొదలైంది.
[మార్చు] రవాణా సౌకర్యాలు
[మార్చు] రహదారి మార్గము
ఒంగోలు పట్టణం చెన్నై-కోల్ కతా జాతీయ రహదారి (NH-5) మీద నెల్లూరు - గుంటూరు నగరాల మధ్య ఉన్నది. ప్రస్తుతం ఈ రహదారి నాలుగు మార్గాలతో ఉన్నది. 2011 కల్లా ఇది ఆరు మార్గాలుగా విస్తరింపబడుతుంది. తిరుపతి, విజయవాడ, చెన్నై, హైదరాబాదు, కర్నూలు, శ్రీశైలం, విశాఖపట్టణం, బెంగళూరు .. మొదలగు ప్రదేశములకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సులు విరివిగా కలవు.
[మార్చు] రైలు మార్గము
ఒంగోలు పట్టణం గూడూరు - విజయవాడ రైలు మార్గములో ప్రధాన స్టేషను. ఇక్కడ నుండి తిరుపతి, విజయవాడ, చెన్నై, హైదరాబాదు, విశాఖపట్టణం, బెంగళూరు, న్యూఢిల్లి, హౌరా, తిరువనంతపురం, కన్యాకుమారి .. మొదలగు ప్రదేశములకు నిత్యం రైళ్ళ రాకపోకలు కలవు.
[మార్చు] విమాన మార్గము
(వివరాలు తెలియాల్సి ఉంది) ఆం.ప్ర రాష్ట్ర ప్రభుత్వం 2007 లో ఒంగోలు పట్టణంకు విమానాశ్రయం ఏర్పాటుకు ఉత్తర్వు మంజూరు చేసింది.