ఎస్.వి. రంగారావు
వికీపీడియా నుండి
| ఎస్.వి. రంగారావు | |
నట యశస్వి, నటసామ్రాట్ , విశ్వనట చక్రవర్తి |
|
| జన్మ నామం | సామర్ల వెంకట రంగారావు |
|---|---|
| జననం | జులై 3, 1918 నూజివీడు, కృష్ణా జిల్లా |
| మరణం | జులై 18, 1974 గుండెపోటు వల్ల, మదరాసులో |
| నివాసం | మద్రాసు(ఇప్పటి చెన్నై) |
| ఇతర పేర్లు | ఎస్వీయార్ |
| ప్రాముఖ్యత | నటయశస్వి |
| వృత్తి | అగ్నిమాపక శాఖ ఉన్నతోద్యోగి, నటుడు |
| సంతానం | విజయ, ప్రమీల, కోటేశ్వరరావు |
| తండ్రి | కోటేశ్వరరావు |
| తల్లి | లక్ష్మీ నరసాయమ్మ |
సుప్రసిద్ధ తెలుగు సినిమా నటుడు ఎస్వీ రంగారావు పూర్తి పేరు సామర్ల వెంకట రంగారావు. నట యశస్వి గా పేరు పొదిన ఈ నటుడు మూడు దశాబ్దాలపాటు మూడొందల చిత్రాలకు పైగా అద్భుతంగా నటించి ఘటోత్కచుడిగా, కీచకుడిగా, రావణాసురుడిగా తనకు తానే సాటిగా ఖ్యాతి గడించాడు. ఆయా పాత్రలలో ఆయన ఎంత మమేకమై పొయ్యరంటే, వేరెవరు కూడా ఆ పాత్రలలో ఇప్పటివరకు ఇమడ లేకపొయ్యారు.
విషయ సూచిక |
[మార్చు] తొలి జీవితం
కృష్ణా జిల్లా లోని నూజివీడు లో 1918 జూలై 3 వ తేదీన లక్ష్మీ నరసాయమ్మ, కోటేశ్వరరావులకు ఎస్వీ రంగారావు జన్మించాడు. తండ్రి ఎక్సైజు శాఖలో పనిచేసేవాడు. యస్.వి.రంగారావు హిందూ కాలేజిలో చదివాడు. డిగ్రీ వరకూ చదివి, అగ్నిమాపక దళంలో ఉన్నతోద్యోగిగా పనిచేస్తూ, షేక్సిపియర్ ఆంగ్ల నాటకాలలో ఒథెల్లో, షైలాక్ తదితర పాత్రలు పోషించి ప్రముఖ రంగస్థల కళాకారుడిగా విశేష ఖ్యాతి గడించాడు. ఆ తర్వాత బి.వి.రామానందం దర్శకత్వంలో నిర్మించిన వరూధిని చిత్రంలో ప్రవరాఖ్యుడిగా తెలుగు చలనచిత్ర రంగానికి పరిచయమయ్యాడు.
[మార్చు] నటనా చాతుర్యం
ఆ తర్వాత మనదేశం, పల్లెటూరి పిల్ల , షావుకారు, పాతాళభైరవి, పెళ్ళి చేసి చూడు, బంగారుపాప, బాలనాగమ్మ, గృహలక్ష్మి, బాల భారతం, తాతా మనవడు ఇలా అనేక చిత్రాలలో విభిన్న పాత్రలు పోషించి తన అద్భుత నటనాచాతుర్యంతో సినీ ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేశాడు.
నటసామ్రాట్, విశ్వనట చక్రవర్తి మొదలగు బిరుదులతో తెలుగు ప్రేక్షకులు ఆయన్ను గౌరవించారు. ఎస్వీయార్ నటించిన నర్తనశాల ఇండొనేషియాలోని జకార్తాలో ఆఫ్రో-ఆసియా చిత్రోత్సవములో ప్రదర్శించబడడమే కాకుండా కీచకపాత్రకుగాను ఎస్వీయార్ ఉత్తమ నటుడు బహుమతి పొందాడు. కొన్ని చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించాడు. ముఖ్యంగా ఆయన దర్శకత్వం వహించిన చదరంగం చిత్రానికి రాష్ట్ర ప్రభుత్వ బహుమతి, నగదు పారితోషికం లభించాయి.
అద్భుత నటనకు ప్రతీకగా నిల్చిన ఎస్వీ రంగారావు 1974 జూలై 18వ తేదీన మద్రాసు లో శాశ్వతంగా కన్నుమూశాడు.
[మార్చు] వ్యక్తిగతం
వ్యక్తిగా రంగారావు సహృదయుడు, చమత్కారి. ఆయన ఇష్టదైవం శివుడు. ప్రతిరోజూ శివపూజ చేసిన తర్వాత దినచర్య ప్రారంభించేవాడు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. కుమార్తెల పేర్లు విజయ, ప్రమీల. కొడుకు పేరు కోటేశ్వర రావు.
యస్వీఆర్ ఒక రకమయిన వేదాంతి. ఆయన ఇంటి లైబ్రరీలో వివేకానందునికి సంబంధించిన పుస్తకాలు ఎన్నో ఉండేవి. ఆయన గొప్ప దాత. ప్రజాహిత సంస్థలకు లెక్కలేనన్ని విరాళాలు ఇచ్చాడు. చైనాతో యుద్ధం వచ్చినపుడు ఏర్పాటు చేసిన సభలో పదివేల రూపాయలు విరాళం ఇచ్చాడు. తర్వాత పాకిస్తాన్‌తో యుద్ధం వచ్చినపుడు కూడా ఎన్నో సభలు నిర్వహించి, మిగతా నటులతో కలసి ఎన్నో ప్రదర్శనలు ఇచ్చి, విరాళాలు సేకరించి, ఆ డబ్బును రక్షణ నిధికి ఇచ్చాడు.
[మార్చు] అవార్డులు, ప్రశంసలు
బిరుదులు:
- విశ్వనటచక్రవర్తి
- నటసార్వభౌమ
- నటశేఖర
- నటసింహ
బహుమతులు
- రంగారావు దర్శకత్వం వహించిన మొదటిచిత్రం 'చదరంగం' ద్వితీయ ఉత్తమ చిత్రంగా నంది అవార్డును, రెండవ చిత్రం 'బాంధవ్యాలు' తొలి ఉత్తమ చిత్రంగా నంది అవార్డును గెలుచుకున్నాయి.
- నర్తనశాల చిత్రంలో నటనకు ఇండోనేషియా ఫిలిం ఫెస్టివల్లో ఉత్తమ నటుడి అవార్డు, అదే పాత్రకు రాష్ట్రపతి అవార్డు అందుకున్నాడు.
- ఎస్.వి.రంగారావు ప్రతిభను గురించి, వైవిధ్యమైన పాత్రల పోషించగల నైపుణ్యం గురించి ప్రసిద్ధ దర్శకుడు చిత్రకారుడు, బాపు ఇలా చమత్కరించాడు-
- క్లిష్టపాత్రల్లో చతురంగారావు
- దుష్టపాత్రల్లో క్రూరంగారావు
- హడలగొట్టే భయంకరంగారావు
- హాయిగొలిపే టింగురంగారావు
- రొమాన్సులో పూలరంగారావు
- నిర్మాతల కొంగుబంగారావు
- స్వభావానికి 'ఉంగారంగారావు
- కథ నిర్బలం అయితే హావభావాలు పాత్రపరంగారావు
- కళ్ళక్కట్టినట్టు కనబడేది ఉత్తి యశ్వీరంగారావు
- ఆయన శైలీ ఠీవీ అన్యులకు సులభంగారావు
- ఒకోసారి డైలాగుల్లో మాత్రం యమకంగారంగారావు
[మార్చు] కొన్ని పాత్రలు
రంగారావు బహుముఖ ప్రజ్ఞాశాలి. పాత్ర ఏదయినా, ఆయన కనిపించేవాడు కాదు, పాత్రే కనిపించేది. ఆయన తన సుదీర్ఘ నట జీవితంలో, అనేకానేక పాత్రలలో జీవించాడు. వాటిలో కొన్ని:
|
|
[మార్చు] నటించిన చిత్రాలు
ఆయన నటంచిన చిత్రాలు అనేకం. అందులో కొన్ని ఈ లింక్ చిత్రాలు నొక్కి తెలుసుకోవచ్చును.