Dzisiaj jest niedziela, 23 listopada 2008 r. 328 dzien roku
Languages:ar | id | bg | ca | ceb | cs | da | de | et | en | es | eo | fr | he | hr | it | ko | lt | hu | nl | ja | no | pl | pt | ru | ro | sk | sl | sr | fi | sv | te | tr | uk | zh






REKLAMA
mp3

తూర్పు యడవల్లి

వికీపీడియా నుండి

(ఎడవల్లి (కామవరపుకోట) నుండి దారిమార్పు చెందింది)
గ్రామంలో ఒక వీధి

ఎడవల్లి, పశ్చిమ గోదావరి జిల్లా, కామవరపుకోట మండలానికి చెందిన గ్రామము. ఈ గ్రామంలో ప్రత్తి, మొక్కజొన్న వంటి మెరక పంటలు, మామిడి వంటి తోటలు ముఖ్యమైన వ్యవసాయాలు.

వూరిలో "సీతారామాంజనేయ స్వామి" దేవస్థానం ప్రసిద్ధి చెందినది. దీని నిర్మాణంలో స్థానిక రాజకీయ నాయకుడు కోటగిరి విద్యాధరరావు (అప్పటి రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి)ముఖ్యమైన పాత్ర వహించాడు. ఈ ఆలయం చిన్న తిరుపతి వారి అజమాయిషీలో నిర్వహింపబడతున్నది. వూరికి వెళ్ళే దారిలో ఇరువైపులా రామదాసు కీర్తనలోని భాగాలు, శ్రీరాముని చిత్రాలు కలిగిన బోర్డులు ఆకర్షణీయంగా ఉన్నాయి.

[మార్చు] శ్రీసీతారామాంజనేయ స్వామి ఆలయం

లక్ష్మణ భరత శతృఘ్నహనుమత్సమేతులైన సీతారాములు
సీతారామాంజనేయస్వామి ఆలయం

షుమారు ఒక ఎకరం విస్తీర్ణంలో కోటి రూపాయల వ్యయంతో ఈ ఆలయాన్ని నిర్మించారు. 52 అడుగుల రాజ గోపురాన్ని చక్కని శిల్పాలతో నిర్మించారు. 14 అడుగుల సింహద్వారాన్ని నిర్మించారు. ఆలయ ముఖమండపం స్తంభాలపై గజరాజులు, నాగ మోహిని వంటి శిల్పాలున్నాయి. ముఖమండపం పైకప్పులో 12 రాశులను చిత్రీకరించారు. ఆ 12 రాశుల మధ్యలో వటపత్రశాయి అయిన బాలకృష్ణుని బొమ్మ ఉంది. గర్భగుడి శిఖరంపై పరివారదేవతలకు సంబంధించి 50 శిల్పాలు, గోదాదేవి ఆలయ శిఖరంపై 28 శిల్పాలు, రాజలక్ష్మి అమ్మవారి ఆలయ శిఖరంపై 28 శిల్పాలు ఉన్నాయి. గర్భగుడి ద్వారం తలుపులపై అష్టలక్ష్మి శిల్పాలు ఉన్నాయి. ఆలయం వెలుపలి వైపున దశావతారాల శిల్పాలున్నాయి.


ఈ ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన త్రిదండి చినజియ్యర్ స్వామిచే చేయబడింది. 2003లో ద్వారకా తిరుమల దేవస్థానం ఈ ఆలయ నిర్వహణ బాధ్యతను తీసుకొన్నది. ఇక్కడ శ్రీరామ నవమి ఉత్సవాలు, వసంతోత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఇది మరొక భద్రాద్రి అని భక్తులు చెబుతుంటారు.

సీతారామాంజనేయస్వామి ఆలయంపై శిల్పాలు
ఆలయ ప్రాంగణంలో నిలువెత్తు శిల్పాలు - రామలక్ష్మణులను సేవించే శబరి



Polska, Dolar, Forex


Wikipedia jest zarejestrowanym znakiem towarowym Wikimedia Foundation
Wszystkie materiay pochodz z Wikipedii, obite s licencj GNU Free Documentation License