Dzisiaj jest niedziela, 23 listopada 2008 r. 328 dzien roku
Languages:ar | id | bg | ca | ceb | cs | da | de | et | en | es | eo | fr | he | hr | it | ko | lt | hu | nl | ja | no | pl | pt | ru | ro | sk | sl | sr | fi | sv | te | tr | uk | zh






REKLAMA
mp3

ఎంకి పాటలు

వికీపీడియా నుండి

ఎంకి పాటలు ముఖచిత్రము

ఎంకి పాటలు (Yenki Patalu, Enki Patalu) నండూరి సుబ్బారావు రచించిన గేయ సంపుటి. తెలుగు సాహిత్యంలో ప్రణయ భావుకతకూ, పదాల పొందికకూ క్రొత్త అందాలు సమకూర్చిన ఈ రచనను "ఎంకిపాటల గాలి దుమారము" అని తెలుగు సాహితీకారులు పలు సందర్భాలలో ప్రస్తావించారు. ఎంకిపాటలలో సుబ్బారావు గోదావరి మాండాలికాన్ని విశాఖ రూపకబేధాలతో కలిపి ఉపయోగించాడు.[1]

విషయ సూచిక

[మార్చు] నేపధ్యం

తెలుగు ఆధునిక సాహిత్యంపై ఆంగ్ల సాహిత్యంలోని "కాల్పనిక భావ కవిత్వం" (రొమాంటిక్ పొయెట్రీ) ప్రేరణ వలన వెలువడిన రచనలలో "ఎంకి పాటలు" ఒక ప్రముఖ అధ్యాయం. ఈ భావ కవిత్వపు ఉద్యమంలో అప్పటి నవకవులు తమ సంస్కృతాంధ్ర సాహిత్య పరిచయాన్నీ, పాశ్చాత్య భావ కవితల పోకడలనీ సమ్మిళితం చేసి ఎన్నో ప్రణయ గీతాలు పలికారు. ఆ సందర్భంలోనే ఊర్వశి, హృదయేశ్వరి, శశికళ, వత్సల, ఎంకి వంటి ప్రణయనాయికలు తెలుగు కవితాభిమానుల గుండెలలో స్థానం సంపాదించారు.

[మార్చు] ప్రారంభం

నండూరి వెంకట సుబ్బారావు మద్రాసు క్రైస్తవ కళాశాలలో చదువుతున్న రోజులలో, 1917-1918 ప్రాంతంలో ఈ పాటలు వ్రాయసాగారు. ఒకసారి ఆయన ట్రాం బండిలో ఇంటికి వెళుతుండగా "గుండె గొంతుకలోన కొట్లాడుతాది" అనే పల్లవి రూపు దిద్దుకొన్నదట. ఆ పాట విని మిత్రులు ప్రోత్సహించారు. క్రమంగా "ఎంకి పాటలు" (యెంకి పాటలు) రూపు దిద్గుకొన్నాయి.

[మార్చు] భావం

యెంకి పాటలు ప్రధానంగా ప్రణయానికి సంబంధించిన పాటలు. తొలి వలపులు, దాంపత్య జీవితానురాగాలు కలిసిన ఊసులు, బాసలు, వేదనలు, విరహాలు ఈ పాటల్లో చక్కని పదాలలో కూర్చబడ్డాయి.

యెంకి పల్లె పడుచు. కపటం ఎరుగనిది. జానపద సౌందర్యానికి ప్రతీక. ధర్మబద్ధమైన హద్దులలోనే ప్రేమిస్తుంది.

కన్ను గిలికిస్తాది, నన్ను బులిపిస్తాది,
దగ్గరగ కూకుంటె అగ్గి సూస్తాది".

అందుకే "యెంకి వంటి పిల్ల లేదోయి లేదోయి", "వయ్యారమొలికించు నా యెంకి, వనలచ్చిమనిపించు నా యెంకి"

యెంకి పాటలు రెండు భాగాలుగా వెలువడ్డాయి. "పాత పాటలు" తరువాత చాలా కాలానికి "కొత్తపాటలు" వెలువడ్డాయి.

[మార్చు] స్పందన

యెంకిపాటలపై పాఠకులు, విమర్శకులు, పండితులు భిన్నమైన అభిప్రాయాలు వెలిబుచ్చారు.

ఇంకా వ్యావహారిక భాష బహుళంగా రచనలలో వాడకముందే పల్లె ప్రేమికుల గురించి "తూర్పు కాపు యాస"లో పాటలు వ్రాసిన సాహసి నండూరి సుబ్బారావు. ముద్దుకృష్ణ రచించిన "వైతాళికులు" కవితా సంకలనంలో ఇలా చెప్పబడింది - "శ్రీ నండూరి వారు తమకు సాక్షాత్కరించిన కవితను అందుకోవడంలో బంధాలను తెంచివేశారు. నియమాలను తోసిపారవేశారు. భావంలో, బాషలో అన్నిటా "ఎర్రబావుటా" ఎగురవేశారు.

ఆకాశవాణి ద్వారా ఈ పాటలు జనప్రియమైనాయి.

[మార్చు] ఉదాహరణ గేయాలు

[మార్చు] యెంకి ముచ్చట్లు

యెన్నాని సెప్పేది యెంకి ముచ్చట్లు !
యేటి సెప్పేది నాయెంకి ముచ్చట్లు?
దొడ్డితోవ కళ్లె తొంగి సూడంగానే
తోటకాడే వుండు త్వరగొస్త నంటాది !!
యెన్నాని సెప్పేది. . . .
యెంకి రాలేదని యెటో సూత్తా వుంటె
యెనకాలగా వచ్చి 'యెవురునో?' రంటాదీ ?
యెన్నాని సెప్పేది. . . .
'సిట్టి సేబా'సాని నిట్టూర మేత్తుంటే
మాటాయినబడనటు మరి యేటో సెపుతాదీ
యెన్నాని సెప్పేది. . . .
కోడి గూసేసరికి కొంపకెల్లాలి, నీ
కోసరమె సెపుతాను కోపమొద్దంటాది!!
యెన్నాని సెప్పేది. . .
యెంత సేపున్నాను యిడిసి పెట్టాలేవు
తగువోళ్లలో మనకు తలవంపులంటాదీ!!
యెన్నాని సెప్పేది. . .
యెనకెనక సూత్తానె యెల్లుతా వుంటాది,
యెన్నాని సెప్పేది యెంకి ముచ్చట్లు!
యెన్నాని సెప్పేది నాయెంకి ముచ్చట్లు?

[మార్చు] గోవుమా లచ్చిమికి కోటి దండాలు

గోవుమా లచ్చిమికీ కోటి దండాలు
మనిషికైనా లేని మంచి పోకిళ్ళు
యెంకితో కూకుండి యింత సెబుతుంటే
తనతోటి మనిసల్లె తలతిప్పుతాడే
యెంకి సరసాలాడ జంకుతా వుంటే
సూసి సూడక కన్ను మూసి తెరిసేడే

[మార్చు] మరొకటి

యెనక జన్మములోన యెవరిమోనంటీ
సిగ్గొచ్చి నవ్వింది సిలకనా యెంకి
ముందు మనకే జల్మముందోలె యంటి
తెలతెల్లబోయింది పిల్లనా యెంకి
యెన్నాళ్ళొ మనకోలె యీ సుకములంటి
కంట నీరెట్టింది జంట నా యెంకి

[మార్చు] వనరులు

  • రేడియో ప్రసంగం - కె.వి.ఎస్.ఆచార్య (బాపట్ల) - "శత వసంత సాహితీ మంజీరాలు" అనే సంకలనంలో ముద్రించబడినది. ఆంధ్ర ప్రదేశ్ గ్రంధాలయ సంఘం ప్రచురణ.
  1. Encyclopaedia of Indian literature vol. 2 By various పేజీ.1173 [1]

Polska, Dolar, Forex


Wikipedia jest zarejestrowanym znakiem towarowym Wikimedia Foundation
Wszystkie materiay pochodz z Wikipedii, obite s licencj GNU Free Documentation License