Dzisiaj jest niedziela, 23 listopada 2008 r. 328 dzien roku
Languages:ar | id | bg | ca | ceb | cs | da | de | et | en | es | eo | fr | he | hr | it | ko | lt | hu | nl | ja | no | pl | pt | ru | ro | sk | sl | sr | fi | sv | te | tr | uk | zh






REKLAMA
mp3

ఋగ్వేదం

వికీపీడియా నుండి

ఈ వ్యాసానికి సంబంధించిన రచనలు
హిందూధర్మశాస్త్రాలు
aum symbol
వేదములు (శ్రుతులు)
ఋగ్వేదం · యజుర్వేదం
సామవేదము · అధర్వణవేదము
వేదభాగాలు
సంహిత · బ్రాహ్మణము
ఆరణ్యకము  · ఉపనిషత్తులు
ఉపనిషత్తులు
ఐతరేయ  · బృహదారణ్యక
ఈశ  · తైత్తిరీయ · ఛాందోగ్య
కఠ  · కేన  · ముండక
మాండూక్య  ·ప్రశ్న
శ్వేతాశ్వర
వేదాంగములు (సూత్రములు)
శిక్ష · ఛందస్సు
వ్యాకరణము · నిరుక్తము
జ్యోతిషము · కల్పము
స్మృతులు
ఇతిహాసములు
మహాభారతము · రామాయణము
పురాణములు
ధర్మశాస్త్రములు
ఆగమములు
శైవ · వైష్ణవ
దర్శనములు
సాంఖ్య · యోగ
వైశేషిక · న్యాయ
పూర్వమీమాంస · ఉత్తరమీమాంస
ఇతర గ్రంథాలు
భగవద్గీత · భాగవతం
విష్ణు సహస్రనామ స్తోత్రము · త్రిమతాలు
లలితా సహస్రనామ స్తోత్రము · శక్తిపీఠాలు
త్రిమూర్తులు · తిరుమల తిరుపతి
పండుగలు · పుణ్యక్షేత్రాలు
... · ...
ఇంకా చూడండి
మూస:హిందూ మతము

నాలుగు వేదాల లోను ఋగ్వేదము అత్యంత పురాతనమైన గ్రంథము. ఇది ప్రధానంగా యాగాలలో దేవతాహ్వానానికి ఉపయోగించేది.ఋగ్వేదం ఋక్కుల రూపంలో ఉంటుంది.వేదాలలో ఋగ్వేదం మొదటిది.ఋగ్వేదం దేవ వేదంగా చెప్పబడింది.యజుర్వేదం మానవులకు,సామవేదం పితరులకు అని మనుస్మృతి వివరిస్తుంది.శౌనక మహర్షి ఋగ్వేదంలో 10,580 ఋక్కులున్నట్లు వర్ణించాడు.ఋగ్వేదం

పద్యరూపంలో ఉంటుంది.ఋక్కులలో ఐదు రుక్కులను ప్రధానంగా చెప్పబడ్డాయి.1 శాకల,2 వాష్కల,3 అశ్వలాయన,4 మండూకాయన,5 శాంఖ్యాయన.వీతిలో శాంఖ్యాయన,మండూకాయన,వాష్కల లభ్యం కాలేదు.ఋగ్వేదం రెండు విభాగాలుగా ఉన్నాయి.ఒకటి అష్టకాలు వాటిలో అధ్యాయాలు వాటిలో వర్గాలు ఉంటాయి.రెండవ విభాగం మండలాలుగా విభజింపబడింది.మండలాలలో అనువాకాలూ వాటిలో సూక్తులుగా విభజింపబడ్డాయి.మొత్తం 1017 సూక్తాలలో 10,580 ఋక్కులలో 1,53,826 శబ్ధాలు వాటిలో 4,32,000 అక్షరాలు ఉన్నట్లు మహర్షి శౌనకుని వర్ణన.ఈ అక్షరాలు కలియుగం లోని సంవత్సరాలు ఒకటేనని భావన.

ఋగ్వేదంలోని కొన్ని సూక్తాలు పురాణ గాధలుగా వర్ణించబడ్డాయి.ఋగ్వేదం అనేక స్త్రోత్రాలు ఉన్నాయి.ఋగ్వేదంలోని దశమ సూక్తంలోని పురుష సూక్తం విశేషంగా ప్రశంసింపబడింది.ఋగ్వేదంలో సామాజిక ప్రవర్తన గురించి చక్కగా వర్ణించింది.ఋగ్వేదం కామితార్ధాలను తీర్చే వేదం.వర్షాలు పడాలంటే పర్జస్య పఠించాలని సూచింప బడింది.జూదం ఆడకూడదని అణేక సూక్తాలు బోధించాయి.కొన్నిటిలో జూదమాడిన వ్యక్తి వర్ణన ఉంది. శంకరాచార్యులచే ఋగ్వేదం ప్రశంసించబడింది."అనోభద్రా క్రతవో యంతు విశ్వత॰"అనే సూక్త పఠనం మానవులను దీర్గాయుషులను చేస్తుందని విశ్వసిస్తున్నారు.

[మార్చు] ఋగ్వేదం విజ్ఞానం

ఋగ్వేదంలోని ప్రధమ మండలంలోని అశ్వనిసూక్తంలో అశ్వనిదేవతలు చేసిన చికిత్సలు వర్ణించబడ్డాయి.ఖేలుడు అనే రాజు భార్య యుద్ధంలో రెండు కాళ్ళు కోల్పోగా అగస్త్యముని సలహాతో వారు అశ్వనీ దేవతలను స్తుతిచేయగా వారు ఆమెకు ఇనుపకాళ్ళను అమర్చినట్లు వర్ణించ బడింది.దధీచి మహర్షికి ఇంద్రునిచే ఉపదేసింపబడిన మంత్రాన్ని తెలుసుకోవడానికి అశ్వినీ దేవతలు ఆయనకు మొందుగా తల తీసి జంతువు తలను అతికించి అతని నుండి 'ప్రవర్ణ'అనే మంత్రాన్ని గ్రహించగానే ఇంద్రుడు దధీచి ముని తల నరకగానే అశ్వినీ దేవతలు వెంటనే దధీచి ముని తలను తిరిగి అతికించినట్లు వర్ణించబడింది.ఇలాంటి అతిసూక్ష్మాతి సూక్ష్మమైన శస్త్ర చికిత్సలు ఋగ్వేదంలో వర్ణించబడ్డాయి.

ఋగ్వేదంలో అగ్నిసూక్తంలో వ్ద్యుత్‌ను పోలిన వర్ణన ఉంది.శుదర్ణ లో శబ్ధ ప్రయోగం ద్వారా ద్వని తరంగాల ప్రసారం గురించి వర్ణించబడింది. ఋగ్వేదంలో శృధి శృతకర్ణ వహ్నిభి లో సంకేత పదరూపంలో నేటి టెలిఫోను అధారిత వర్ణన ఉంది. మేఘాలు రూపాన్ని సంతరించుకోవడం వర్షించడం లాంటి వృష్టి సంబంధిత జ్ఞానం ఋగ్వేదంలో ఉంది.క ఇమంలో గర్భయో ఆపాం ,గర్బోవనానాం గర్భశ్చస్తాతాం అనే మంత్రం జలంలో విద్యుత్ దాగి ఉన్నట్లు వర్ణిస్తుంది.మేఘాల నిర్మాణం దానికి పట్టే సమయం ఋగ్వేదంలో వర్ణించ బడింది. పర్యావరణ సంబంధిత విషయాలు ఋగ్వేదంలో ఉన్నాయి.గణితానికి సంబంధించి వ్రాతం వ్రాతం,గణం గణం,గణినం మొదలన శబ్ధాలతో వర్ణించబడింది. రేఖాగణిత విషయాలూ ప్రస్తావించబడ్డాయి.

[మార్చు] ఋగ్వేదంలోని విశేషాలు

  • మండలాల సంఖ్య 10.
  • అష్టకాల సంఖ్య 8.
  • అష్టకంలోని అధ్యాయాల సంఖ్య 8.
  • అధ్యాయాలసంఖ్య 64.
  • ఋగ్వేదంలో ఋక్కుల సంఖ్య 10,170.
  • సూక్తాల సంఖ్య 1028.
  • వర్గాల సంఖ్య 2006.

Polska, Dolar, Forex


Wikipedia jest zarejestrowanym znakiem towarowym Wikimedia Foundation
Wszystkie materiay pochodz z Wikipedii, obite s licencj GNU Free Documentation License