Dzisiaj jest niedziela, 23 listopada 2008 r. 328 dzien roku
Languages:ar | id | bg | ca | ceb | cs | da | de | et | en | es | eo | fr | he | hr | it | ko | lt | hu | nl | ja | no | pl | pt | ru | ro | sk | sl | sr | fi | sv | te | tr | uk | zh






REKLAMA
mp3

ఇడ్లీ

వికీపీడియా నుండి

ఇడ్లీ దక్షిణ భారత దేశంలో విరివిగా వాడే అల్పాహార వంటకం.

[మార్చు] పుట్టు పూర్వోత్తరాలు

ఇడ్లీ
ఇడ్లీ-వడ, తిరుపతి దగ్గరలోని శ్రీనివాస మంగాపురం దగ్గర రోడ్డుపక్క హోటలు నుండి.

దోశకు మరియు వడకు తమిళ దేశాన రెండు వేల సంవత్సరాల ఘనమైన చరిత్ర కలదు కానీ, ఇడ్లీ మాత్రము విదేశీ దిగుమతి. సాహిత్యములో తొలిసారి ఇడ్లీ వంటి వంటకము యొక్క ప్రస్తావన (ఇడ్డలిగే) 920 లో శివకోట్యాచార్య యొక్క “వడ్డారాధనే” అనే కన్నడ రచనలో ఉన్నది. ఆ తరువాత 1130 లో కళ్యాణీ చాళుక్య చక్రవర్తి సోమేశ్వర III రచించిన సంస్కృత విజ్ఞాన సర్వస్వము మానసోల్లాస లో ఇడ్లీ తయారు చేసే విధానము ఇవ్వబడినది. అయితే ఈ రచనలలో ఆధునిక ఇడ్లీ తయారీకి ప్రధాన భాగలైన మినపప్పు తో పాటు బియ్యపుపిండి కలపడము, పిండిని పులియబెట్టడము, పిండి పొంగడానికి ఆవిరిపట్టడము మొదలైన విషయాల గురించిన ప్రస్తావన లేదు.

చైనా యాత్రికుడు హుయాన్ త్సాంగ్ (7వ శతాబ్దము) రచనల వలన భారత దేశములో ఆ కాలములో ఆవిరిపట్టే పాత్రలు లేవని తెలుస్తున్నది కానీ భారతీయులు మరుగుతున్న గిన్నెపై బట్టకప్పి ఆవిరిపట్టి ఉండవచ్చని భావిస్తారు. ఇండొనేషియన్లు అనేకరకాల పులియబెట్టే వంటకాలు వండేవారు అందులో ఇడ్లీకి పోలికలున్న కేడ్లీ అనే వంటకము కూడా ఉన్నది. 800 - 1200 మధ్య కాలములో ఇండోనేషియా హిందూ రాజులతో పాటు వెళ్లిన వంటవాళ్లు, పులియపెట్టే పద్ధతులు, అవిరిపెట్టే పద్ధతులు మరియు వాళ్ల వంటకము కేడ్లీని దక్షిణ భారతదేశానికి తెచ్చారని ఒక భావన కానీ ఖచ్చితముగా నిర్ధారించుటకు ఆధారములు లేవు.

ఇడ్లీ ఎక్కడి నుండి దిగుమతి అయినా భారతీయుల ప్రియమైన అల్పాహార వంటకాలలో ఒకటిగా విలసిల్లుతున్నది. భారతదేశపు పల్లె పల్లెలో ఇడ్లీ గురించి తెలియని వారు తక్కువ. ప్రతి హోటలు నందు మెనూలో తప్పక చేర్చు వంటకం ఇడ్లీ.

రవ్వ ఇడ్లీ

[మార్చు] మూలములు

  • ఎ హిస్టోరికల్ డిక్షనరీ ఆఫ్ ఇండియన్ ఫుడ్ - కే. టీ. అచయ (ఆక్స్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయ ప్రచురణ)
"http://te.wikipedia.org/wiki/%E0%B0%87%E0%B0%A1%E0%B1%8D%E0%B0%B2%E0%B1%80" నుండి వెలికితీశారు

Polska, Dolar, Forex


Wikipedia jest zarejestrowanym znakiem towarowym Wikimedia Foundation
Wszystkie materiay pochodz z Wikipedii, obite s licencj GNU Free Documentation License