ఆలంపూర్
వికీపీడియా నుండి
|
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. |
| ?ఆలంపూర్ మండలం మహబూబ్ నగర్ • ఆంధ్ర ప్రదేశ్ |
|
|
|
|
| అక్షాంశరేఖాంశాలు: (అక్షాంశరేఖాంశాలు కనుక్కోండి) | |
| టైం జోన్ | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
| ముఖ్య పట్టణము | ఆలంపూర్ |
| జిల్లా(లు) | మహబూబ్ నగర్ |
| గ్రామాలు | 20 |
| జనాభా • మగ • ఆడ • అక్షరాశ్యత శాతం • మగ • ఆడ |
41,220 (2001) • 20970 • 20250 • 51.61 • 64.40 • 38.54 |
ఆలంపూర్, మహబూబ్ నగర్ జిల్లాలోని ఒక గ్రామము, మరియు అదే పేరుతోగల ఒక మండలానికి కేంద్రం. ఇది ఒక చారిత్రక ప్రాధాన్యం గల ప్రదేశం. ఇక్కడ ఏడవ శతాబ్దానికి చెందిన ప్రాచీన నవబ్రహ్మ ఆలయం కలదు. ఇది హైదరాబాదునకు సుమారుగా రెండు వందల కిలోమీటర్ల దూరంలో కలదు. ఇది శ్రీశైలానికి పశ్చిమ ద్వారంగా భావింపబడినది. (సిద్ధవటం, త్రిపురాంతకం, ఉమామహేశ్వరంలు దక్షిణ, తూర్పు, ఉత్తర ద్వారాలుగా భావింపబడినాయి). తుంగభద్ర, కృష్ణా నదులు అలంపూర్ కు దగ్గరలో కలుస్తాయి. ఇక్కడి తొమ్మిది నవ బ్రహ్మ దేవాలయములు కూడా శివాలయాలే!
విషయ సూచిక |
[మార్చు] నవబ్రహ్మ ఆలయాలు
నవబ్రహ్మ దేవాలయములు బాదామి చాళుక్యులు నిర్మించారు. వీరు సుమారుగా ఆరవ శతాబ్ద మధ్య కాలం నుండి రెండువందల సంవత్సరములు పాలించారు. ఈ బాదామి చాళుక్యులు కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్లలో చాలా దేవాలయములు నిర్మించారు. ఇక్కడి కొన్ని శిల్పాలను దగ్గరలోని సంగ్రహాలయంలో ఉంచారు. తారక బ్రహ్మ, స్వర్గ బ్రహ్మ, పద్మ బ్రహ్మ, బాల బ్రహ్మ, గరుడ బ్రహ్మ, కుమార బ్రహ్మ, అర్క బ్రహ్మ, వీర బ్రహ్మ, విశ్వ బ్రహ్మ అనునవి ఆ తొమ్మిది దేవాలయములు. ఇవి అన్నీ కూడా తుంగభద్రానది ఓడ్డున కలవు. వీటిలో బాల బ్రహ్మ పెద్దది, ఇక్కది శాసనాల ఆధారంగా దీనికి క్రీస్తు శకం 702కాలం నాటిదిగా గుర్తించినారు. ఇక్కడ శివరాత్రి పండుగను ఘనంగా చేస్తారు.
- తారక బ్రహ్మ దేవాలయం పాక్షికంగా శిథిలాలలో ఉన్నది. దీని గర్భగుడిలో ఎటువంటి విగ్రహంకూడా లేదు! దీనియందు ఆరు, ఏడవ శతాబ్దానికి చెందిన తెలుగు శాసనాలు కలవు.
- స్వర్గ బ్రహ్మ దేవాలయం అలంపూర్ నందలి దేవాయలములలో సుందరమైనదిగా చెప్పబడుతున్నది. ఇది చాళుక్య ప్రభువుల నిర్మాణ కౌశల్యానికి ఓ మచ్చుతునక. ఇందల ఎనిమిదవ శతాబ్దాంతానికి చెందిన చాలా శాసనాలు కలవు.
- పద్మ బ్రహ్మ దేవాలయం, ఇది కూడా పాక్షికంగా శిథిలమైపోయినది, ఇందులో ఓ అద్భుతమైన స్పటిక శివలింగం కలదు.
- విశ్వబ్రహ్మ దేవాలయం చాలా మంచి చూడ చక్కని నిర్మాణం, ఇక్కడ రామాయణ మహాభారతాలనుండి దృశ్యాలను శిల్పాలపై మహాకావ్యాలుగా చెక్కినారు.
ఇంకా 9 వ శతాబ్దానికి చెందిన సూర్యనారాయణస్వామి దేవాలయం కూడా ఇదే ప్రాంగణంలో కలదు. ఇక్కడ విష్ణుమూర్తికి చెందిన సుందరమైన విగ్రహాలు కలవు. ఇంకా ఇక్కడ విజయనగర రాజు అయిన కృష్ణదేవరాయలకు చెందిన ఒక నరసింహస్వామి దేవాలయం కూడా కలదు. అలంపూర్ దగ్గరలో పాపనాశనం అను ఇరవైకి పైబడిన శివాలయములు వివిధ ఆకారం, పరిమాణాలలో కలవు. ఇందులో పాపనాశేశ్వర దేవాలయం ప్రధానమైనది.
[మార్చు] ఆలంపూర్ పురావస్తు ప్రదర్శనశాల
ఆలంపూర్ జోగుళాంబ దేవాలయ సమీపంలో పురావస్తు ప్రదర్శనశాల ఉన్నది. దీనిని 1952లో ఏర్పాటుచేశారు. ఇందులో క్రీ.శ.6 వ శతాబ్దము నుంచి క్రీ.శ.12వ శతాబ్దము వరకు కాలానికి సంబంధించిన పురాతన, చారిత్రక శిల్పాలు భద్రపర్చబడ్డాయి. ఉదయం గం.10.30 నుంచి సాయంత్రం గం.5.00 వరకు దీనిని సందర్శకులకై తెరిచి ఉంటారు. దేవాలయానికి వచ్చే యాత్రికులు దీనిని కూడా సందర్శిస్తారు.
[మార్చు] మండలంలోని గ్రామాలు
[మార్చు] బయటి లింకులు
- దేవాలయం పునర్నిర్మాణం గురించి హిందూ పత్రికలోని వార్త
- ట్రావెల్ మస్తిలో వ్యాసం
- టెంపుల్నెట్లో వ్యాసము
[మార్చు] ఇవి కూడా చూడండి
మహబూబ్ నగర్ జిల్లా మండలాలు
కోడంగల్ - బొమ్మరాసుపేట - కోస్గి - దౌలతాబాద్ - దామరగిద్ద - మద్దూరు - కోయిలకొండ - హన్వాడ - నవాబ్ పేట - బాలానగర్ - కొందుర్గ్ - ఫరూఖ్ నగర్ - కొత్తూరు - కేశంపేట - తలకొండపల్లి - ఆమనగల్ - మాడ్గుల్ - వంగూరు - వెల్దండ - కల్వకుర్తి - మిడ్జిల్ - తిమ్మాజిపేట - జడ్చర్ల - భూత్‌పూర్ - మహబూబ్ నగర్ - అడ్డకల్ - దేవరకద్ర - ధన్వాడ - నారాయణపేట - ఊట్కూరు - మాగనూరు - మఖ్తల్ - నర్వ - చిన్నచింతకుంట - ఆత్మకూరు - కొత్తకోట - పెద్దమందడి - ఘన్‌పూర్ - బిజినపల్లి - నాగర్‌కర్నూల్ - తాడూరు - తెల్కపల్లి - ఉప్పునూతల - అచ్చంపేట - అమ్రాబాద్ - బల్మూర్ - లింగాల - పెద్దకొత్తపల్లి - కోడేరు - గోపాలపేట - వనపర్తి - పానగల్ - పెబ్బేరు - గద్వాల - ధరూర్ - మల్దకల్ - ఘట్టు - అయిజా - వడ్డేపల్లి - ఇటిక్యాల - మనోపాడ్ - ఆలంపూర్ - వీపనగండ్ల - కొల్లాపూర్
|
|
|
|---|---|
| తక్కశిల · మరమునగాల · ప్రగటూర్ · సేరిపల్లి · క్యాటూర్ · ఊట్కూర్ · భీమవరం · బుక్కాపూర్ · గొందిమళ్ళ · బైరంపల్లి · ఆలంపూర్ · ఇమాంపూర్ · కోనేరు · లింగనవాయి · భైరాపూర్ · బస్వాపూర్ · కాశీపూర్ · సింగవరం · ర్యాలంపాడు · సుల్తాన్పూర్ · జిల్లెళ్ళపాడు |
|
|
||
|---|---|---|
| ప్రముఖ పట్టణాలు | మహబూబ్ నగర్ · గద్వాల · వనపర్తి · నారాయణపేట · షాద్నగర్ · నాగర్‌కర్నూల్ · కల్వకుర్తి · జడ్చర్ల · ఆత్మకూరు | |
| ప్రముఖ దేవాలయాలు | మన్యంకొండ · కురుమూర్తి · ఆలంపూర్ · వట్టెం వెంకటేశ్వర స్వామి దేవాలయం · మల్లెలతీర్థం · ఊర్కొండ అభయాంజనేయ స్వామి దేవాలయం | |
| పర్యాటక ప్రదేశాలు | పిల్లలమర్రి (వృక్షం) · బీచుపల్లి | |
| ప్రాజెక్టులు | ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు · కోయిల్ సాగర్ ప్రాజెక్టు · సరళా సాగర్ ప్రాజెక్టు · రాజోలిబండ డైవర్షన్ స్కీం · | |
| చారిత్రక కోటలు | గద్వాల కోట · రాజోళి కోట · కోయిలకొండ కోట · చంద్రగఢ్ కోట · ఆత్మకూరు కోట | |
| నదులు | కృష్ణా నది · తుంగభద్ర నది · దిండి నది · మూసీ నది | |
| లోకసభ నియోజకవర్గాలు | మహబూబ్ నగర్ · నాగర్‌కర్నూల్ | |
| శాసనసభ నియోజకవర్గాలు | కోడంగల్ · నారాయణపేట · మహబూబ్ నగర్ · జడ్చర్ల · దేవరకద్ర · మక్తల్ · షాద్నగర్ · వనపర్తి · గద్వాల · ఆలంపూర్ · నాగర్‌కర్నూల్ · అచ్చంపేట · కల్వకుర్తి · కొల్లాపూర్ | |