ఆచంట
వికీపీడియా నుండి
|
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. |
| ?ఆచంట మండలం పశ్చిమ గోదావరి • ఆంధ్ర ప్రదేశ్ |
|
|
|
|
|
|
|
| అక్షాంశరేఖాంశాలు: (అక్షాంశరేఖాంశాలు కనుక్కోండి) | |
| టైం జోన్ | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
| ముఖ్య పట్టణము | ఆచంట |
| జిల్లా(లు) | పశ్చిమ గోదావరి |
| గ్రామాలు | 10 |
| జనాభా • మగ • ఆడ • అక్షరాశ్యత శాతం • మగ • ఆడ |
63,358 (2001) • 31870 • 31488 • 77.36 • 82.91 • 71.78 |
ఆచంట, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఒక గ్రామము,మండలము.ఇక్కడి శ్రీ రామేశ్వరస్వామి దేవాలయము మరియు శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయములు బహుళ ప్రసిద్ది చెందినవి.ఊరిలో ఆర్యవైశ్యులు,కమ్మవారు అధికంగా కలరు.చుట్టు ప్రక్కల గల దాదాపు పదిహేను గ్రామాలకు ఆచంట పెద్ద వ్యాపార కేంద్రము.
విషయ సూచిక |
[మార్చు] రామేశ్వరస్వామి వారి ఆలయ చరిత్ర
రామేశ్వర స్వామి వారి ఆవిర్భావమునకు సంభదించి ఒక ఆసక్తియైన కధనం కలదు. దీని ప్రకారం కాశీలో విశ్వనాధుని సన్నిధినందు శివరాత్రి జాగరణ పూజాదులు నెరపవలెనని కాశీకిచేరుకొనేందుకు బయలుదేరిన ఒక బ్రాహ్మణుడు ఈ మార్గమున ప్రాయాణిస్తూ ఆతిధ్యము కొరకై ఒక వేశ్య ఇంట బస చేసెను తదుపరి ఆ వేశ్యకును అతడికిని సాన్నిత్యముకలిగి అన్నిటినీ మరచి ఆ బ్రాహ్మణుడా ఇంటినందే సర్వ శుఖలాలసుడై ఉండి పోయెను. ఒక రాత్రి అతని చెవిన వేదమంత్రోచ్చాటన మరియు శివపంచాక్షరీ జపములు విని పించెను. దానితో పాటు ఈ రాత్రియే శివరాత్రి అనియు అది శివరాత్రి జాగరణ కొరకు బ్రాహ్మణులు భక్తులు చేయు కోలాహలముగా గ్రహించెను తను ఈసమయమున కాశీలోనుండవలసినదనీ అతడికి జ్ఞాపకమొచ్చెను.తక్షణము ఏమిచేయుటకు పాలుపోక తాను చేసిన తప్పిదమునకు మిక్కిలి చింతంచుచూ పరమేశ్వరా నన్ను క్షమింపుమని వేడుతూ పిచ్చివానివలె గృహమంతయూ తిరుగుచుండెను.అట్లు తిరుగుచూ ఉన్న అతని దృష్టి తల్పముపై వివస్త్రయై శయనించియున్నఆవేశ్య యొక్క వక్షాగ్రభాగమునుపై బడెను.మరుక్షణం అతనికి అందే ఈశ్వరుడు కానవస్తూ ఆగృహమే కైలాశంగా వెలుగులు చిమ్ముతూ అగుపించుచుండెను.అంతట ఆబ్రాహ్మణుడు భక్తి పారవశ్వముతో గృహాలంకరణ కొరకు తేబడిన పుష్పాలతో ఆమె వక్షబాగమును పూజింప మొదలిడెను.అట్లు ఆరాత్రి అంతయూ అంతర్ముఖుడై సర్వేశ్వరుని యందే మనస్సును లగ్నము చేసి చేసి సొమ్మసిల్లి పడిపోయెను.అపుడు వెలుగులు విరజిమ్ముచూ శ్రీ మహాదేవదేవుడు ప్రత్యక్షమాయెను.భక్తా నీ నిచ్చలమైన భక్తికి మెచ్చాను ఏమికావలెనో కోరుకొనమనెను. అహా నా భాగ్యము నిను చూచు అదృష్టము దక్కినది అని పలువిదాలుగా స్తుతిస్తూ అయ్యా సుఖధుఖ్ఖాలు బోగాలు భాగ్యాలు అన్నీ నీ మాయయేకధ స్వామీ నాకు మోక్షము ప్రాసాధించు నే పూజించిన రూపున నీవిక్కడ వెలసిన అదియే మహా భాగ్యము అనెను.అట్లే నీకును నీవలన ఈమెకునూ ఇరువురకూ మోక్షము ప్రసాదించుచున్నాను.అని అంతర్ధానమయ్యెను.ఆవేశ్య పరుండిన అదే ప్రదేశమున స్తనాగ్ర రూపమున శ్రీ రామేశ్వర స్వామి వెలసియుండెను.ఈ దేవాలయము నాలుగు వైపుల సింహద్వారములతోనూ ప్రాకారము లోపలిబాగమున అనేక చిన్న దేవాలయములతో గుడినానుకొని పుష్కరిణితో దేవాలయపు ప్రదాన సింహద్వారము ప్రక్కగా సాంస్కృతిక కార్యక్రమములకు విశాల కళా ప్రాంగణముతోనూ విలసిల్లుతూ ఉంటుంది.ప్రతి సంవత్సరమూ శివరాత్రి ఉత్సవాలు ఐదు రోజులు పాటు జరుగును. ప్రసిద్ద సినీ కళాకారులతో కార్యక్రమములు జరుపబడును ఇక్కడి తీర్దము బస్టాండ్ రోడ్డు నుండి దాదాపు అరకిలోమీటరు వరకూ విస్తరించి ఉండును.ఛుట్టు ప్రక్కల ఎన్నోగ్రామాలకు ఇదే ప్రదాన కూడలి అవడంవలన ఈ ఉత్సవములలో ఇసుకవేస్తే రాలదనేటట్లుగా జనంవస్తూంటారు.
[మార్చు] ఇతరదేవాలయాలు
శ్రీ మదన గొపాల స్వామి ఆలయము, శ్రీ ముత్యాలమ్మ ఆలయము, శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయము
[మార్చు] విద్యాసౌకర్యాలు
- శ్రీ ముప్పన వీర రాఘవయ్య ప్రభుత్వ జూనియర్ కళాశాల. ఇది రామేశ్వరస్వామి వారి ఆలయము యొక్క చెరువుకు ఆవలివైపున కలదు.
[మార్చు] నీటి వనరులు
[మార్చు] రవాణా సౌకర్యాలు
[మార్చు] ఇతర సౌకర్యాలు
- రక్షణభట నిలయము {ముప్పై గ్రామాలు దీనిపరిధిలో ఉన్నాయి}
[మార్చు] ఊరి విషేషాలు
ఆచంటలో ప్రజా వినోదనికై మూడు సినిమా ప్రదర్శన శాలలు కలవు.
- శ్రీ రంగరాయ చిత్రమందిర్
- శ్రీ నటరాజ్ సినీచిత్ర
- శ్రీ కళ్యాణ చక్రవర్తి
ఆచంటలో ప్రతి శుక్ర వారం సంత జరుగుతుంది. ఇది పరిసర గ్రామాలలోకెల్ల పెద్దసంత.
[మార్చు] గ్రామాలు
- ఆచంట
- ఆచంట వేమవరం
- భీమలాపురం
- కొడమంచిలి
- కందరవల్లి
- కరుగోరుమిల్లి
- కోడేరు
- పెదమల్లం
- పెనుమంచిలి
- వల్లూరు
- కంఛుస్థంభం పాలెం
|
|
|
|---|---|
|
జీలుగుమిల్లి · బుట్టాయగూడెం · పోలవరం · తాళ్ళపూడి · గోపాలపురం · కొయ్యలగూడెం · జంగారెడ్డిగూడెం · టి.నరసాపురం · చింతలపూడి · లింగపాలెం · కామవరపుకోట · ద్వారకా తిరుమల · నల్లజర్ల · దేవరపల్లి · చాగల్లు · కొవ్వూరు · నిడదవోలు · తాడేపల్లిగూడెం · ఉంగుటూరు · భీమడోలు · పెదవేగి · పెదపాడు · ఏలూరు · దెందులూరు · నిడమర్రు · గణపవరం · పెంటపాడు · తణుకు · ఉండ్రాజవరం · పెరవలి · ఇరగవరం · అత్తిలి · ఉండి · ఆకివీడు · కాళ్ళ · భీమవరం · పాలకోడేరు · వీరవాసరము · పెనుమంట్ర · పెనుగొండ · ఆచంట · పోడూరు · పాలకొల్లు · యలమంచిలి · నరసాపురం · మొగల్తూరు |
|
|
|
|
|---|---|
| ఆచంట · ఆచంట వేమవరం · భీమలాపురం · కొడమంచిలి · కందరవల్లి · కరుగోరుమిల్లి · కోడేరు · పెదమల్లం · పెనుమంచిలి · వల్లూరు · కంఛుస్థంభం పాలెం |