ఆకాశం
వికీపీడియా నుండి
(ఆకాశము నుండి దారిమార్పు చెందింది)
విమానం నుండి చూసినప్పుడు కనిపించే నీలం రంగు ఆకాశం.
ఆరుబయటనుండి పైకి చూస్తే మనకు కనిపించే నీలిరంగు ఆవరణమే ఆకాశం. భూమి ఉపరితలంపై ఉండే మేఘాలు, నీటియావిరితో కూడిన వాయు ఆవరణాలపై పడిన సూర్యకాంతి పరావర్తనం చెందడం వలన ఆకాశం మనకు నీలిరంగులో కనబడుతుంది. కాని నిజానికి ఆకాశం ఏ రంగునూ కలిగి ఉండదు. అందుకే మనకు రాత్రి సమయంలో ఆకాశం సూర్యకాంతి లేకపోవడం వలన చీకటిగా కనిపిస్తుంది. ఆ చీకటిలో అనంత దూరాలలో ఉన్న నక్షత్రాలు, గ్రహాలు చిన్న చిన్న చుక్కలుగా కనిపిస్తాయి.