Dzisiaj jest sobota, 22 listopada 2008 r. 327 dzien roku
Languages:ar | id | bg | ca | ceb | cs | da | de | et | en | es | eo | fr | he | hr | it | ko | lt | hu | nl | ja | no | pl | pt | ru | ro | sk | sl | sr | fi | sv | te | tr | uk | zh






REKLAMA
mp3

ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర - చరిత్ర పూర్వ యుగము

వికీపీడియా నుండి


ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర
----------- కాలరేఖ -----------
చరిత్ర పూర్వ యుగము క్రీ.పూ.1500వరకు
పూర్వ యుగము క్రీ.పూ.1500-క్రీ.త.650
మౌర్యులకు ముందు క్రీ.పూ.1500-క్రీ.పూ.322
మౌర్యులు • క్రీ.పూ.322 - క్రీ.పూ. 184
శాతవాహనులు • క్రీ.పూ.200 - క్రీ.త.200
కళింగులు • క్రీ.పూ.180? - క్రీ.త.400?
ఇక్ష్వాకులు • 210 - 300
బృహత్పలాయనులు • 300 - 350
అనందగోత్రులు • 295 - 620
శాలంకాయనులు • 320 - 420
విష్ణుకుండినులు • 375 - 555
పల్లవులు • 400 - 550
పూర్వమధ్య యుగము 650 - 1320
మహాపల్లవులు
రేనాటి చోడులు
చాళుక్యులు
రాష్ట్రకూటులు
తూర్పు చాళుక్యులు • 624 - 1076
పూర్వగాంగులు • 498 - 894
చాళుక్య చోళులు • 980 - 1076
కాకతీయులు • 1083 - 1323
అర్వాచీన గాంగులు
ఉత్తరమధ్య యుగము 1320 - 1565
ముసునూరి నాయకులు • 1320 - 1368
ఓఢ్ర గజపతులు • 1513
రేచెర్ల పద్మనాయకులు • 1368 - 1461
కొండవీటి రెడ్డి రాజులు • 1324 - 1424
రాజమహేంద్రవరం రెడ్డి రాజులు • 1395 - 1447
బహమనీ రాజ్యము
విజయనగర సామ్రాజ్యము • 1336 - 1565
ఆధునిక యుగము 1540 – 1956
అరవీటి వంశము • 1572 - 1680
కుతుబ్ షాహీ యుగము • 1518 - 1687
నిజాము రాజ్యము
బ్రిటిషు రాజ్యము
స్వాతంత్ర్యోద్యమము • 1800 - 1947
ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు
హైదరాబాదు రాష్ట్రం ఏర్పాటు
ఆంధ్ర ప్రదేశ్‌ అవతరణ
ఆంధ్ర ప్రదేశ్ ఇటీవలి చరిత్ర
తెలుగు సాహిత్యం
నన్నయకు ముందు
నన్నయ యుగముశివకవి యుగము
తిక్కన యుగముఎఱ్ఱన యుగము
శ్రీనాధ యుగమురాయల యుగము
దాక్షిణాత్య యుగముక్షీణ యుగము
ఆధునిక యుగము21వ శతాబ్ధి
చారిత్రిక నగరాలు
భట్టిప్రోలువేంగిధాన్యకటకము
కొలనుపాకఓరుగల్లువిజయపురి
హంపిసింహపురిహైదరాబాదు
చారిత్రిక వ్యక్తులు
గణపతిదేవుడురుద్రమదేవికృష్ణదేవరాయలు
శాలివాహనుడు
ఈ పెట్టె: చూడు  చర్చ  మార్చు
(పరిచయం ఇక్కడ వ్రాయాలి)

విషయ సూచిక

[మార్చు] యుగ విభజన

[మార్చు] ముఖ్యాంశాలు

  • క్రీ.పూ. 10,000 - క్రీ.పూ. 8,000 - పాత రాతి యుగము - కడప, కర్నూలు, గుంటూరు, నెల్లూరు, అనంతపూర్, నల్గొండ, వరంగల్, కరీంనగర్ జిల్లాలలో ఈ కాలంనాటి పనిముట్లు దొరికాయి. కడప, కర్నూలు ప్రాంతాలలో పలుగురాయి, కృష్ణానది ఉత్తరాన సున్నపురాయి అధికంగా వాడారు. డోర్నకల్ సమీపంలోని నందికనుమ (గిద్దలూరు) ప్రాంతం పాతరాతి పనిముట్లకు ప్రధాన కేంద్రం అనిపిస్తున్నది.
  • క్రీ.పూ. 8,000 - క్రీ.పూ. 6,000 - సూక్ష్మ రాతి యుగము - ఈ కాలంలో చిన్నన పరిమాణం ఉన్న పనిముట్లు వాడారు. గిద్దలూరు, నాగార్జునకొండ, కొండాపూర్ ప్రాంతాలలోను, అదిలాబాద్ జిల్లాలోను ఈ కాలం అవశేషాలు లభించాయి.
  • క్రీ.పూ. 6,000 - క్రీ.పూ. 2,000 - కొత్త రాతి యుగము - గిద్దలూరులోను, బళ్ళారి జిల్లా సంగనకల్లులోను ఈ కాలం అవశేషాలు లభించాయి. ఈ యుగంలో పెక్కు నూతన పరికరాలు వాడారు. పసువులను పెంచేవారు. మహబూబ్‌నగర్ జిల్లా ఉట్నూరు వద్ద పేడకుప్పలను తగలబెట్టిన మసిదిబ్బలను కనుగొన్నారు.
  • క్రీ.పూ. 2,000 - క్రీ.పూ. 1,000 - రాగి యుగము - బ్రహ్మగిరి, పుదుచ్చేరిల వద్ద రాగి, కంచు పనిముట్లు లభించాయి. కర్నూలు జిల్లా పాతపాడు వద్ద అలంకరించిన మట్టి పాత్రలు లభించాయి.
  • క్రీ.పూ. 1,000 - క్రీ.పూ. 500 - ఇనుప యుగము - "రాక్షసిగుళ్ళు" అనే సమాధులు ఈ కాలంలో నిర్మించారు. దాదాపు ఆంధ్రదేశం (విశాఖ మినహా) అందటా ఈ కాలం ఆనవాళ్ళు లభించాయి. తెలంగాణ ప్రాంతంలో ఇనుప పనిముట్ల తయారీ ఆధారాలు అధికంగా దొరికాయి. వ్యవసాయం అభినృద్ధి చెందింది.

మొట్ట మొదటిగా ఆంధ్రుల ప్రస్తావన క్రీ.పూ. 1500 - క్రీ.పూ. 800 మధ్య కాలంలోదిగా భావించబడుతున్న ఐతరేయ బ్రాహ్మణంలో విశ్వామిత్రుడు, శునస్సేపుడు కధలో ఉంది. ఇక్కడ ఆంధ్రులు శబర, మూతిబ, పుండ్ర, పుళింద జాతులతో కలిసి ఆర్యావర్తం దక్షిణాన నివశిస్తున్నట్లు అర్ధం చెప్పుకోవచ్చును. మహాభారతంలో ఆంధ్రులు కౌరవుల పక్షాన ఉన్నట్లు (ఆంధ్రాశ్చ బహవః) ఉన్నది. రామాయణంలో దండకారణ్యం ఆంధ్ర-ఒరిస్సా ప్రాంతాలలోనిదంటారు. పంపా సరస్సు కొల్లేరు సరస్సని ఒక అభిప్రాయము.[1].


క్రీ.పూ. 600 - జైన, బౌద్ధ మతాల ఆరంభం భారత దేశ చరిత్రలో ఒక ప్రభంజనం.మొదటినుండీ ఈ మతాలు ఆంధ్రదేశంలో విస్తరించాయి. ఈ కాలంలో ఉత్తర, దక్షిణ దేశాల మధ్య సంబంధం పెరిగింది. వింధ్య పర్వతాల మీదుగా ఒక మార్గము (అగస్త్యుడు చూపినది), మగధ -కళింగ -గోదావరి తీరాల ఒక మార్గము ప్రధానంగా బౌద్ధ భిక్షువులు పయనించి బోధించినవి. క్రీ.పూ. 500 - 400 - బౌద్ధ జాతక కధలలో ఆంధ్రాపధం (భీమసేన జాతకం) , ఆంధ్రనగరి (సెరివణిజ జాతకం) ప్రస్తావన ఉన్నది.


[మార్చు] ఇవి కూడా చూడండి

[మార్చు] మూలాలు

  1. చిలుకూరి వీరభద్రరావు - ఆంధ్రుల చరిత్రము

[మార్చు] వనరులు

  • ఆచార్య బి.ఎస్.ఎల్. హనుమంతరావు - ఆంధ్రుల చరిత్ర - విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్
  • చిలుకూరి వీరభద్రరావు - ఆంధ్రుల చరిత్ర - మొదటి భాగము - విజ్ఞానచంద్రికా గ్రంధమండలి ప్రచురణ - 1910 - [1]
  • Dr.K Gopalachari - Early_History_Of_The_Andhra_Country - Madras University Doctorate Thesis - 1946 - [2]
  • ఆదిరాజు వీరభద్రరావు - ప్రాచీనాంధ్ర నగరములు - మొదటి భాగము - ఆంధ్రచంద్రికా గ్రంధమాల ప్రచురణ - 1950 - [3]

[మార్చు] బయటి లింకులు


Polska, Dolar, Forex


Wikipedia jest zarejestrowanym znakiem towarowym Wikimedia Foundation
Wszystkie materiay pochodz z Wikipedii, obite s licencj GNU Free Documentation License