అరకు
వికీపీడియా నుండి
|
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. |
అరకు, విశాఖపట్నం జిల్లా, డుంబ్రిగుడ మండలానికి చెందిన గ్రామము
ఆరకు లోయ [1] సముద్రమట్టానికి సుమారు 600 మీటర్ల నుండి 900 మీటర్ల ఎత్తులో ఉన్నది. విశాఖపట్నానికి 115 కి.మి.ల దూరంలో ఉన్న అరకు ఆహ్లాదకరమైన వాతావరణములతో , కొండలతో లోయలతో ప్రజలను ఆకర్షిస్తోంది. సహజ సాందర్యము కలిగిన అరకు సంపన్న భౌగోళిక స్వరూపము కలిగి సజీవముగా నిలుస్తుంది.
అరకు వెళ్ళే ఇరువైపులా దట్టమైన ఆడవులు ఉండే ఘాట్ రోడ్ , ఆసక్తికరముగా ఆహ్లాదకరముగా ఉంటుంది. దారిలో అనంతగిరి కొండల లో కాఫీ తోటలు ఉన్నాయి. 29 కి.మి. దూరములో ఉన్న బొర్రా గుహలు ఒక పర్యాటాక ఆకర్షణ. తూర్పు కనుమలులో ఉన్న అరకు లో కొన్ని తెగల వారు నివసిస్తారు. ట్రైబల్ మ్యూజియమ్ ఇంకొక ఆకర్షణ.
[మార్చు] ప్రయాణ మార్గాలు
విశాఖపట్నం నుండి రోడ్డు, రైలు మార్గాలు రెండూ ఉన్నాయి. ఈశాన్య రైల్వే (ఈస్ట్ కోస్టు రైల్వే) లైను కొత్తవలస-కిరండల్ లో అరకు, అరకు లోయ రెండు స్టేషనులు వస్తాయి. అన్ని అందాలు కవర్ చెయ్యాలంటే వెళ్లేటప్పుడు ట్రైన్ వచ్చేటప్పుడు బస్ ప్రయాణం మంచిది. ట్రైన్ వైజాగ్ లొ ఉదయం కిరండొల్ వెళ్లే పాసింజర్ ఎక్కాలి. అది అలా కొండలు , లోయలు, గుహలు దాటుకుంటూ సాగిపోతుంది. ప్రయాణం సుమారు 5 గంటలు వుంటుంది. ఆ అనుభూతి అనుభవించాలే గాని చెప్పలేము. ఫ్రయాణం లొ "సిమిలిగుడ" అనే స్టేషన్ వస్తుంది. అది ఇండియా లొ అతి ఎత్తులొ వున్న బ్రాడ్గేజ్ స్టేషన్ అంటారు. ఇక వెళ్లే దారిలొ బొర్రా గుహలు వస్తాయి. అక్కడ దిగి బొర్రా గుహలు చూసుకొని అరుకు వెళ్ళవచ్చు. లేదంటే తిరుగు ప్రయాణం లో చూడవచ్చు. అరుకులొ వుండటానికి అన్ని తరగతుల వారికి సరిపడ లాడ్జీలు, గెస్ట్ హౌసులు, కాటేజీలు వుంటాయి .
- ప్రయాణానికి అనువైన సమయం
మొత్తం సంవత్సరంలో ఎప్పుడైన వెళ్ళవచ్చు. వేసవిలొ వెళ్తే వెచ్చదనం నుండి తప్పించుకోవచ్చు . శీతాకాలం ఐతే వలిసపూలు పూసి కొండలన్నీ పసుపు వర్ణంతో అందంగా తయారవుతాయి. అవి చూడాలంటే అప్పుడే వెళ్ళాలి. ఇక వర్షాకాలం ఐతే పచ్చదనంతో కళకళలాడుతుంది. అప్పుడు వెళ్ళేవాళ్ళు రైన్ కోట్లు, గొడుగులు పట్టుకెళ్ళటం మంచిది.
- షాపింగ్
గిరిజనులు తయారు చేసే వస్తువులు అమ్ముతారు . గిరిజనాభివృధ్ధి సంస్థ అమ్మే స్వచ్చమైన తేనె మొదలైనవి కొనవచ్చు.
తిరుగు ప్రయణం: బస్సు ప్రయాణం మంచిది. లేదంటే ఒక జీప్ అద్దెకు తీసుకుంటే అన్నీ చూడవచ్చు. వచ్చే దారిలొ తైద లో జింగెల్ బెల్స్, కాఫీ తోటలు లాంటివి చూడవచ్చు . సుందరమైన ఈ ప్రదేశం మన రాష్ట్ర పర్యాటకులనే కాకుండా అనేక రాష్ట్రాల వారిని ఆకట్టుకుంటోంది.
[మార్చు] చూడవలసిన ప్రదేశాలు
- అరకు విశఖపటణం ఫొటొలు
- బొర్రా గుహలు
- పద్మాపురం గార్డెన్స్
- ట్రైబల్ మ్యూజియం
- చాపరాయి
- మత్స్యగుండం
- తైద జింగెల్ బెల్స్
ఇవి ముఖ్యమైనవి. ఇవి కాకుండ చుట్టు పక్కల చిన్న, చిన్నవి కొన్ని ఆకర్షణలు వున్నాయి.
[మార్చు] మూలాలు
|
|
|
|---|---|
| కిరిడివలస · మల్లివలస · రంగినివలస · చినకాగువలస · కోట్రగండి · గొప్పిలివలస · పనసవలస · చమడపాడు · కొల్లాపుట్టు · బిట్రగొండ · తోటవలస · కొర్రాయ్ · గాతరజిల్లెడ · గసబ · లోగిలి · దేముడువలస · బడియాపాడు · సొవ్వ · కరకవలస · వడియవలస @ వడ్డెవలస · మలింగువలస · సగిరివలస · కమలబండ · కూడ · కోరంజిగుడ · వాసబండ · గోరాపూర్ · సంగర · అంజోడ · అరకు · కురిడి · నిమ్మగడ్డ · సరాయి · గడబగొలుగు · ఉజ్జంగి · ఒంబి · కింజేరు · కూజబంగి · రంగిలిసింగి · కుట్టి · దాతురు · తూటంగి · లైగండ · గుంటసీమ · లక్క · బోడిమెల · చెలిమారివలస · ముసిరి · జాంగుడ · సొర్నాయక్ గుడ @ సురుస్యగుడ · కంద్రం · పరిడి · పోతంగి · పంటలచింత · పెదపాడు · అంత్రిగుడ · దుంబ్రిగుడ · లవిటిపుట్టు · వంటర్ల · అరమ · గోడాసుర్తు · రంగినిగుడ · గొందిగుడ · బిల్లాపుట్టు · జుర్రిపాడు · కించుమండ · కుసుమవలస · ఉయ్యాలపుట్టు · కోసంగి · చంపాపుట్టు · సీలంగొండి · నందిగుడ · కితలంగి · వయ్యా · మొర్రిగుడ · గంధ · బైరాగుడ · సంగంవలస · దొండలవలస · కొర్రా · మామిడివలస · పరిసీల · పాడి · బొర్రాపాలెం · బొడ్డపుట్టు · గొండివలస · గుంటగన్నెల |