అమరావతి
వికీపీడియా నుండి
| ?అమరావతి మండలం గుంటూరు • ఆంధ్ర ప్రదేశ్ |
|
|
|
|
| అక్షాంశరేఖాంశాలు: (అక్షాంశరేఖాంశాలు కనుక్కోండి) | |
| టైం జోన్ | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
| ముఖ్య పట్టణము | అమరావతి |
| జిల్లా(లు) | గుంటూరు |
| గ్రామాలు | 16 |
| జనాభా • మగ • ఆడ • అక్షరాశ్యత శాతం • మగ • ఆడ |
64,220 (2001) • 32580 • 31630 • 60.59 • 70.43 • 50.50 |
అమరావతి ఆగ్నేయ భారత దేశములోని ఆంధ్ర ప్రదేశ్ నందు ఉన్న ఒక పట్టణము, ఇదేపేరుతో ఉన్న రెవిన్యూ మండలానికి కేంద్రము. ఇది గుంటూరు జిల్లాలో కృష్ణా నదీ తీరానికి కుడి వైపున ఉన్నది.
విషయ సూచిక |
[మార్చు] అమరారామం
అమరలింగేశ్వర స్వామి (శివుడు) పుణ్య క్షేత్రం ఈ పట్టణములో కృష్ణానదీ తీరాన యున్నది. ఆంధ్రప్రదేశ్ లోని పంచారామాలలో ఇది ఒకటి.
[మార్చు] బౌద్ధ సంస్కృతి
- ప్రధాన వ్యాసం: అమరావతి స్తూపం
- ప్రధాన వ్యాసం: ధరణికోట
అమరావతికి సమీపంలో ఉత్తరాన ఉన్న ధరణికోట ఒకప్పటి ఆంధ్ర శాతవాహనుల రాజధానియైన ధాన్యకటకం. శాతవాహనుల కాలంలో బౌద్ధ మతం పరిఢవిల్లింది. బౌద్ధమత చరిత్రలో ధాన్యకటకానిది ప్రముఖ స్థానం. ప్రాచీన బౌద్ధ వాజ్మయములో విశిష్ఠ స్థానము పొందిన 'ఆంధ్రపురి'యే ధాన్యకటకం. క్రీ.పూ. 4వ శతాబ్దిలో గ్రీకు రాయబారి మెగస్తనీసు పేర్కొన్న 30 ఆంధ్రదుర్గాలలో ఈ నగరమొకటి. సుమారు 16 కి. మీ చుట్టుకొలత కలిగిన మహానగరం. నేటి అమరావతి, ధరణికోట అందులోని భాగాలే. మౌర్యులకు పూర్వము క్రీ. పూ. 4-3 శతాబ్దాలలో ఈ ప్రాంతం గణతంత్ర రాజ్యం (జనపద)గా ఉన్న అధారాలున్నాయి. బుద్ధుని జీవితకాలమునుండి క్రీ. శ 14వ శతాబ్దివరకు ఇక్కడ బౌద్ధం నీరాజనాలందుకొంది. మరుగునపడిన చైత్యప్రాశస్త్యం తిరిగి 18వ శతాబ్దములో వెలుగు చూసింది. దీపాలదిన్నె గా పిలువబడిన పెద్ద దిబ్బను త్రవ్వి 1797 లో మహాస్తూపాన్ని వెలుగులోకి తెచ్చిన వ్యక్తి కల్నల్ కోలిన్ మెకంజీ. మహాచైత్యం అంతా కూలిపోయి 90 అడుగుల చుట్టుకొలత, 20 అడుగుల ఎత్తుగల ఒక దిబ్బలాగా మిగిలింది అప్పటికే. అనేక విడతలుగా జరిగిన తవ్వకాలలో ఎన్నో విలువైన విగ్రహాలు, పరికరాలు మరియు ఇతర వస్తువులు దొరికాయి. ఈ త్రవ్వకాలను సర్ వాల్టర్ స్మిత్ 1845 లో, రాబర్ట్ సీవెల్ 1877 లో, జేమ్స్ బర్గెస్ 1881 లో మరియు అలక్జాండర్ రియ 1888-89 మధ్యలో చేపట్టారు. ఆఖరున జరిగిన తవ్వకాలలో ఈ చైత్య నిర్మాణానికి కొన్ని వేల సంవత్సరాలకు పూర్వం నివసించిన మెగాలిథ్స్ కి సంబంధించిన అవశేషాలు కూడా దొరికాయి. ఇక్కడ దొరికిన శిల్పాలలో ఎక్కువ మద్రాస్ గవర్నమెంట్ మ్యూజియం, చెన్నై మరియు బ్రిటిష్ మ్యూజియం, లండన్ లలో భద్రపరిచారు. ధాన్యకటకంలో 1962-65 మధ్యలో యమ్. వెంకటరామయ్య మరియు కె.రాఘవాచారి ల అధ్వర్యంలో త్రవ్వకాలు జరిగాయి. ఇందులో ఐదు పీరియడ్స్ కి సంబంధించిన నివాసుల అధారాలు దొరికాయి. కార్బన్ రేటింగ్ ద్వారా ఈ పట్టణం క్రీ.పూ.5వ శతాబ్ధికి చెందిందని తెలిసింది.
అద్భుతమైన శిల్పకళతో అలరారే స్థూపంపై బుద్దుని జీవిత చరిత్రకు సంబంధించిన చిత్రాలు, బౌద్ధచిహ్నాలు చెక్కబడి ఉన్నాయి. స్థూపంపై బ్రాహ్మీ లిపిలో శాసనాలు చెక్కబడి ఉన్నాయి. ఈ స్థూపం గురించి అప్పటి బ్రిటిషు పురాతత్వ పరిశోధకుడు ఫెర్గుసన్ ఇలా అన్నాడు: "కళావైదుష్యానికి సంబంధించి ఇది భారతదేశంలోనే అత్యంత విశిష్టమైన కట్టడము". దీన్ని చెన్నై లోని ప్రభుత్వ ప్రదర్శనశాలలో భద్రపరచారు.
అమరావతి యొక్క లాటిట్యూడ్ 16 డిగ్రీల 34' ఉత్తరం , లాంగిట్యూడ్ 80 డిగ్రీల 17' తూర్పు. అమరావతికి అతి దగ్గర రైల్వే స్టేషన్ గుంటూరు. అక్కడ నుండి అమరావతికి బస్సు సర్వీసు ఉంది. వర్షాకాలంలో విజయవాడ నుండి లాంచిల ద్వారా కృష్ణానది పై ప్రయాణించి అమరావతి చేరవచ్చు. స్థూపం ఉండిన ప్రదేశం, భారతీయ పురాతత్వ సర్వేక్షణ వారి సంగ్రహాలయము మరియు అమరేశ్వర మందిరం ఇక్కడ ప్రధాన ఆకర్షణలు.
సత్యం శంకరమంచి వ్రాసిన అమరావతి కథలు ఈ గ్రామ/పట్టణ సంస్కృతికి అద్దంపట్టాయి.
[మార్చు] వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడు
- ప్రధాన వ్యాసం: వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడు
వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడు అమరావతి సంస్థాన పాలకుడు. 1761 ఏప్రిల్ 20న జగ్గన్న, అచ్చమ్మ దంపతులకు జన్మించాడు. ఆయన పాలనా కాలంలో చెంచులు గ్రామాలపైబడి దోచుకుంటూ ఉండేవారు. ఈ దోపిడీలను అరికట్టడానికి ఆయన 150 మంది చెంచు నాయకులను ఆహ్వానించి, వారిని మట్టుపెట్టించాడు. ఈ సంఘటనను "అటునుంచి కొట్టుకురండి" అన్న కథలో (అమరావతి కథలు)చక్కగా వివరించబడినది. ఈ సంఘటన జరిగిన గ్రామం పేరు నరుకుళ్ళపాడు గా మారింది. దానితో ప్రజలకు దోపిడీల బెడద తగ్గినా, ఆయన అశాంతికిలోనై, పాప పరిహారార్ధం దేవాలయాల నిర్మాణం చెయ్యమన్న కొందరు పెద్దల సూచన మేరకు అనేక దేవాలయాలను కట్టించాడు. అమరావతి లోని అమరలింగేశ్వరస్వామి గుడిని పునరుద్ధరించాడు. 1807-09లో మంగళగిరి నరసింహ స్వామి దేవాలయానికి 11 అంతస్థుల గాలి గోపురాన్ని నిర్మింపజేసాడు. ఆయన తండ్రి జగ్గన్న పేరు మీదనే బేతవోలు అనే గ్రామం పేరును జగ్గయ్యపేట గా మార్చాడు. వేంకటాద్రి నాయుడు 1817, ఆగష్టు 17న మరణించాడు.
[మార్చు] అమరావతి చిత్రాలు
[మార్చు] మండలంలోని గ్రామాలు
అమరావతి, అత్తలూరు, ధరణికోట, దిడుగు, ఎండ్రాయి, జూపూడి (అమరావతి మండలం), కర్లపూడి (అమరావతి మండలం), లింగాపురం (అమరావతి మండలం), మల్లాది, మునుగోడు, నరుకుళ్ళపాడు, నెమలికల్లు, పెద్ద మద్దూరు, పొందుగల, పుట్టిపాడు (నిర్జన గ్రామము), ఉంగుటూరు (అమరావతి), వైకుంఠపురం, ముత్తయిపాలెం
[మార్చు] ఇవి కూడా చూడండి
[మార్చు] బయటి లింకులు
|
|
|
|---|---|
|
మాచెర్ల · రెంటచింతల · గురజాల · దాచేపల్లి · మాచవరం · బెల్లంకొండ · అచ్చంపేట · క్రోసూరు · అమరావతి · తుళ్ళూరు · తాడేపల్లి · మంగళగిరి · తాడికొండ · పెదకూరపాడు · సత్తెనపల్లి · రాజుపాలెం(గుంటూరు) · పిడుగురాళ్ల · కారంపూడి · దుర్గి · వెల్దుర్తి(గుంటూరు) · బోళ్లపల్లి · నకరికల్లు · ముప్పాళ్ల · ఫిరంగిపురం · మేడికొండూరు · గుంటూరు · పెదకాకాని · దుగ్గిరాల · కొల్లిపర · కొల్లూరు · వేమూరు · తెనాలి · చుండూరు · చేబ్రోలు · వట్టిచెరుకూరు · ప్రత్తిపాడు · యడ్లపాడు · నాదెండ్ల · నరసరావుపేట · రొంపిచెర్ల · ఈపూరు · శావల్యాపురం · వినుకొండ · నూజెండ్ల · చిలకలూరిపేట · పెదనందిపాడు · కాకుమాను · పొన్నూరు · అమృతలూరు · చెరుకుపల్లి · భట్టిప్రోలు · రేపల్లె · నగరం · నిజాంపట్నం · పిట్టలవానిపాలెం · కర్లపాలెం · బాపట్ల |
|
|
|
|
|---|---|
| అమరావతి · అత్తలూరు · ధరణికోట · దిడుగు · ఎండ్రాయి · జూపూడి (అమరావతి మండలం) · కర్లపూడి (అమరావతి మండలం) · లింగాపురం (అమరావతి మండలం) · మల్లాది · మునుగోడు · నరుకుళ్ళపాడు · నెమలికల్లు · పెద్ద మద్దూరు · పొందుగల · పుట్టిపాడు (నిర్జన గ్రామము), ఉంగుటూరు (అమరావతి) · వైకుంఠపురం |
|
|
|
|---|---|
| పంచారామ క్షేత్రాలు | అమరారామము ◊ ద్రాక్షారామము ◊ భీమారామము ◊ కుమారభీమారామము ◊ క్షీరారామము ◊ |
| శైవ, శక్తి క్షేత్రాలు | ద్వాదశ జ్యోతిర్లింగాలు ◊ శక్తిపీఠాలు ◊ మహానంది ◊ లేపాక్షి ◊ కాణిపాకం ◊ |
| ఇతర వ్యాసాలు | ◊ వినాయకుడు ◊ కుమారస్వామి◊ పార్వతి ◊ శివుడు ◊ మహాశివరాత్రి ◊ దసరా ◊ బతుకమ్మ |