Dzisiaj jest sobota, 22 listopada 2008 r. 327 dzien roku
Languages:ar | id | bg | ca | ceb | cs | da | de | et | en | es | eo | fr | he | hr | it | ko | lt | hu | nl | ja | no | pl | pt | ru | ro | sk | sl | sr | fi | sv | te | tr | uk | zh






REKLAMA
mp3

అన్నవరం

వికీపీడియా నుండి

అన్నవరం ప్రధాన దేవాలయ దృశ్యం.

అన్నవరం ఆంధ్ర ప్రదేశ్ రాష్టం లోని తూర్పు గోదావరి జిల్లా శంఖవరం మండలానికి చెందిన గ్రామము. అన్నవరం కలకత్తా - మద్రాసు జాతీయ రహదారి పై రాజమండ్రి నుండి దాదాపుగా 70 కి.మీ, కాకినాడ కి 45 కి.మి. దూరంలో ఉంది. ఈ గ్రామం లోని అన్నవరం రైల్వే స్టేషన్ విశాఖపట్టణం-విజయవాడ రైలుమార్గం లో వస్తుంది. అన్నవరం ఒక సుప్రసిద్ద పుణ్యక్షేత్రం. శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామి వారి దివ్యక్షేత్రం. తూర్పు గోదావరి జిల్లా లో శంఖవరం మండలానికి చెందిన గ్రామము. ఈ ప్రాంతం ప్రతినిత్యం భక్తులతో రద్దీగా ఉంటుంది. హిందువులు పవిత్రంగా భావించే కార్తీకమాసంలో ఇచ్చట కనీవినీ ఎరుగని రీతిలో భక్తులు వస్తుంటారు.

అన్నవరం లో రత్నగిరి పర్వత శ్రేణి.
వూరి పొలిమేరల్లో వూర్పిడికి సిద్ధంగా ఉన్న వరి కొప్పులు. వెనుక కొండపై శ్రీ సత్యనారాయణ స్వామి వారి ఆలయాన్ని చూడవచ్చును.

అన్నవరం - పిలిస్తే పలికే దైవంగా పేరుపొందిన శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయాన్ని రత్నగిరి అనే కొండపై అన్నవరంలో నిర్మించారు. ఈ ఆలయ నిర్మాణం అయి ఒక శతాబ్దము పైగా మాత్రమే ఐనా చాలా ప్రాశ్యస్త్యాన్ని, ప్రాముఖ్యతను పొందింది. సమీపంలో పంపా నది హోయలొలుకుతూ పారుతుంటుంది. కొండపై నెలకొని ఉన్న ఈ దేవాలయంలో వేంచేసి ఉన్న శ్రీ సత్యనారాయణ స్వామి ని దర్శించేందుకు గుడివరకు ఘాట్ రోడ్డు నిర్మించారు. మెట్లు గుండా కూడ వెళ్ళవచ్చు. ఇక్కడ సామూహికంగా వందలాది దంపతులు కూర్చుని ఒకేసారి సత్యనారాయణస్వామి వ్రతాన్ని కనుల పండువగా చేసికొంటూ ఉండటం ఒక ప్రత్యేకత; చూచి తీరవలసిన సుందర దృశ్యం. ఇతిహాసాల ప్రకారం అడిగిన (అనిన) (వరం)వరాలను తీర్చే దేవుడు కాబట్టి ( అనిన+ వరం = అన్నవరం) "అన్నవరం దేవుడు" అంటారు.

విషయ సూచిక

[మార్చు] స్థలపురాణం

స్థలపురాణం ప్రకారం పర్వతశ్రేష్ఠులలో ఒకడైన మేరు పర్వతం ఆయన భార్య మేనక శ్రీమహావిష్ణువు గురించి తపం ఆచరించి విష్ణువు అనుగ్రహం తో ఇద్దరు కొడుకులను పర్వతాలుగా పొందుతారు. ఒకడేమో భద్రుడు, ఇంకొకడు రత్నకుడు. భద్రుడు విష్ణుమూర్తిని గురించి తపస్సు చేసి శ్రీరామచంద్రమూర్తి కి నివాస స్థానమైన భద్రాచలం గా మారుతాడు. రత్నకుడు అనే ఇంకో కొడుకు కూడా విష్ణువు గురించి తపమాచరించి మెప్పించి మహావిష్ణువు శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామి గా వెలసే రత్నగిరి, లేదా రత్నాచలం కొండ గా మారుతాడు.

బొమ్మ:Annavaram Temples.jpg
అన్నవరం దేవాలయం

తూర్పు గోదావరి జిల్లాలో పిఠాపురంకి సమీపంలో గోరస గ్రామ ప్రభువు శ్రీ రాజా ఇనుగంటి వేంకటరామారాయణిం బహద్దరు వారి ఏలుబడిలో అరికెంపూడి దగ్గర అన్నవరం అనే గ్రామం ఉంది. అక్కడ ఈరంకి ప్రకాశరావు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన మహా భక్తుడు. ఒకనాడు శ్రీమహావిష్ణువు వీరికీ, శ్రీ రాజా ఇనుగంటి వేంకటరామారాయణిం బహద్దరు వారికీ ఏక కాలంలో కలలో కనపడి "రాబోవు శ్రావణ శుక్ల విదియా మఖా నక్షత్రములో గురువారము నాడు రత్నగిరిపై వెలుయుచున్నాను. నీవు నన్ను శాస్త్రనియమానుసారము ప్రతిష్టించి సేవించుము" అని చెప్పి మాయమయ్యారు.

మరునాడు ఇరువురు కలసి, తమకు వచ్చిన కలను చెప్పుకొని, ఖరనామ సంవత్సర శ్రావణ శుక్ల పాడ్యమి నాటికే అందరు అన్నవరం చేరుకున్నారు. అక్కడ స్వామివారి కొరకు వెదుకుతుండగా ఒక అంకుడు చెట్టు(సం. కృష్ణకుటజము, bot. Nerium Antidysentericum) కింద పొదలో స్వామి వారి పాదముల మీద సూర్యకిరణములు పడ్డాయి. వెంటనే వారు ఆ పొదను తొలగించి, స్వామి విగ్రహాన్ని రత్నగిరి కొండ పైకి తీసుకొని పోయి, కాశీ నుండి తెచ్చిన శ్రీమత్రిపాద్విభూతి మహావైకుంఠనారాయణ యంత్రాన్ని విష్ణుపంచాయతన పూర్వకంగా సాధారణ శకం 1891, ఆగష్టు 6 వ తేదీని (శాలివాహన శకం 1813) ప్రతిష్టించారు.

ఆలయాన్ని సా. శ. 1934 లో నిర్మించారు. పంచాయతనం ఉండటం చేత దానికి ప్రతీకగా ముందు గణపతి, శంకరుల చిహ్నములు గలవి, శూల శిఖరములతో ఉన్నవి అయిన రెండు చిన్న విమాన గోపురాలు, మధ్యగా ప్రధాన విమాన గోపురం, వెనుకగా ఆదిత్య దేవతా, అంబికా దేవతా ప్రతీకలగు చక్రశిఖరములు ఉన్న మరి రెండు విమాన గోపురాలూ ఉన్నాయి. ఒకే చోట ఇన్ని విధములైన భిన్న దేవతా చిహ్నాలు ఉండటం అపురూపం.


[మార్చు] ముఖ్యాలయానికి అనుబంధంగా ఉన్న ఆలయాలు

శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయము.

రత్నగిరి కొండల పై శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామి ప్రధాన దైవం. అన్నవరం లో శ్రీ సీతారాముల వారి గుడి, వనదుర్గమ్మ గుడి, కనక దుర్గమ్మ గుడి కూడా ఈ రత్నగిరి కొండపై సత్యనారాయణ స్వామి ఆలయ ప్రాంగణం లో ఉన్నాయి. కొండ క్రింద గ్రామ దేవత గుడి ఉన్నది.

[మార్చు] ఆలయ విశేషాలు

తూర్పు గోదావరి జిల్లాలో పిఠాపురంకి సమీపంలో గోరస గ్రామ ప్రభువు (గోర్సా, కిర్లంపూడి ఎస్టేట్స్) శ్రీ రాజా ఇనుగంటి వేంకటరామానారాయణిం బహద్దరు రాజా ఐ.వి.రామనారాయణం వారి ఏలుబడిలో అరికెంపూడి దగ్గర అన్నవరం అనే గ్రామం ఉంది. అక్కడ ఈరంకి ప్రకాశరావు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన మహా భక్తుడు. ఒకనాడు శ్రీమహావిష్ణువు వీరికీ, శ్రీ రాజా ఇనుగంటి వేంకటరామానారాయణిం బహద్దరు వారికీ ఏక కాలంలో కలలో కనపడి "రాబోవు శ్రావణ శుక్ల విదియా మఖా నక్షత్రములో గురువారము నాడు రత్నగిరిపై వెలుయుచున్నాను. నీవు నన్ను శాస్త్రనియమానుసారము ప్రతిష్టించి సేవించుము" అని చెప్పి మాయమయ్యారు.

మరునాడు ఇరువురు కలసి, తమకు వచ్చిన కలను చెప్పుకొని, ఖరనామ సంవత్సర శ్రావణ శుక్ల పాడ్యమి నాటికే అందరు అన్నవరం చేరుకున్నారు. అక్కడ స్వామివారి కొరకు వెదుకుతుండగా ఒక అంకుడు చెట్టు(సం. కృష్ణకుటజము, bot. Nerium Antidysentericum) కింద పొదలో స్వామి వారి పాదముల మీద సూర్యకిరణములు పడ్డాయి. వెంటనే వారు ఆ పొదను తొలగించి, స్వామి విగ్రహాన్ని రత్నగిరి కొండ పైకి తీసుకొని పోయి, కాశీ నుండి తెచ్చిన శ్రీమత్రిపాద్విభూతి మహావైకుంఠనారాయణ యంత్రాన్ని విష్ణుపంచాయతన పూర్వకంగా సాధారణ శకం 1891, ఆగష్టు 6 వ తేదీని (శాలివాహన శకం 1813) ప్రతిష్టించారు.

ఆలయాన్ని సా. శ. 1934 లో నిర్మించారు. పంచాయతనం ఉండటం చేత దానికి ప్రతీకగా ముందు గణపతి, శంకరుల చిహ్నములు గలవి, శూల శిఖరములతో ఉన్నవి అయిన రెండు చిన్న విమాన గోపురాలు, మధ్యగా ప్రధాన విమాన గోపురం, వెనుకగా ఆదిత్య దేవతా, అంబికా దేవతా ప్రతీకలగు చక్రశిఖరములు ఉన్న మరి రెండు విమాన గోపురాలూ ఉన్నాయి. ఒకే చోట ఇన్ని విధములైన భిన్న దేవతా చిహ్నాలు ఉండటం అపురూపం.

పంపా నది ఒడ్డున ఉన్న రత్నగిరి మీద ఈ ఆలయం సముద్ర మట్టానికి 300 అడుగుల ఎత్తులో ఉన్నది. ఈ గుడికి పాదచారులు చేరు కోవడానికి 460 మెట్లు ఉన్నాయి.ప్రధాన ఆలయం రథాకారం లో ఉండి, నాలుగు దిక్కులలో నాలుగు చక్రాల తో ఉంటుంది. ప్రధాన ఆలయానికి ఎదురుగా కళ్యాణ మండపం ఉంటుంది. ఈ కళ్యాణ మండపం ఆధునిక నిర్మాణ చాతుర్యానికి ఒక మచ్చుతునక. వనదుర్గ ఆలయం, రామాలయాలు ప్రక్కన కనిపిస్తూ ఉంటాయి. ఆలయ రూపం, అగ్ని పురాణం లో చెప్పబడినట్లు, ప్రకృతిని తలపిస్తూ ఉండాలి.

ఈ ఆలయం ఆ ప్రకారం రెండు అంతస్థులలో నిర్మింపబడింది.క్రింది భాగం లో యంత్రం, పై అంతస్థులో స్వామి విగ్రహాలు ఉన్నాయి. స్వామి విగ్రహం 4 మీటర్ల ఎత్తు ఉంది. క్రింద గర్భగుడి ఉన్న భాగాన్ని విష్ణు మూర్తి గా అర్చిస్తారు, మధ్యభాగం లో ఉన్నదానిని శివునిగా పూజిస్తారు. మూలవిరాట్టు అంతా ఏక విగ్రహంగా ఉండి త్రిమూర్తులు గా పూజింప బడడం ఇక్కడి విశేషం. త్రిపాద విభూతి నారాయణ ఉపనిషత్తు లో వర్ణింపబడిన యంత్రం ఇక్కడ ఉన్నది.

[మార్చు] సత్యనారాయణస్వామి

సత్యనారాయణ స్వామి

శ్రీ సత్యనారాయణ స్వామివారిని

" మూలతో బ్రహ్మరూపాయ
మధ్యతశ్చ మహేశ్వరం
అధతో విష్ణురూపాయ
త్ర్త్యెక్య రూపాయతేనమః " అని స్తుతిస్తారు.

[మార్చు] పండుగలు

రత్నగిరి సానువులు మర్యు స్వామివారి పుష్కరిణి
భక్తుల విశ్రాంతి కొరకు ఏర్పాటు చేసిన ఉధ్యానవనం.

రత్నగిరి పై ఎప్పుడూ నిత్య కళ్యాణం పచ్చతోరణ మే.

  • స్వామి దర్శన వేళలు ఉదయం 6 గం నుండి రాత్రి 8 గం వరకు.
  • అన్ని వర్గాల వారికి వసతి భోజన సదుపాయాలు ఉన్నాయి.

[మార్చు] ఇంకా దర్శనీయ స్థలాలు

కాలనిర్ణయ యంత్రం.sundail
రైల్వే స్టేషన్

పిడపర్తి కృష్ణమూర్తి శాస్త్రి నిర్మించిన కాల నిర్ణయ, నిర్దేశక యంత్రం రత్నగిరి పైన ప్రధాన ఆలయానికి ప్రక్కన ఉంది. సూర్యుని నీడ (ఎండ) ఆధారంగా కాల నిర్ణయం చేసి, పని చేసేగడియారం ఇది.

  • తులసివనం
  • వనం మధ్యలో పాముపుట్ట
  • ఉద్యానవనం. ఇక్కడ భక్తులు సేదతీరేందుకై ఏర్పాటు చేయబడిన ఉద్యానవనంలో అందమైన పూలమొక్కలు,పొగడచెట్లు,పూజలకు ఉపయోగపడే పలు పత్రిమొక్కలు పెంచబడుతున్నవి.ఉధ్యానవనం మద్య మద్య కూర్చునేందుకు వీలుగా సిమెంట్ బల్లలు కట్టబడ్డాయి.

[మార్చు] ఒక విశేషం

రత్న గిరి పై వేంచేసి ఉన్న శ్రీ సత్యనారాయణ స్వామి వారి ప్రాముఖ్యతకు గుర్తుగాను, స్వామి వారిని దర్సించేందుకు వచ్చే భక్తజనానికి ప్రయాణ సౌకర్యాన్ని కలిగించే దృష్టి తోను రైల్వే శాఖ రత్నాచల్ పేరు తో ఒక ఎక్స్ ప్రెస్ రైలును ప్రవేశపెట్టింది. ఇది విశాఖపట్నం-విజయవాడ ల మధ్య నడుస్తూ, అన్నవరం స్టేషను లో ఆగుతుంది.

[మార్చు] బయటి లింకులు



Polska, Dolar, Forex


Wikipedia jest zarejestrowanym znakiem towarowym Wikimedia Foundation
Wszystkie materiay pochodz z Wikipedii, obite s licencj GNU Free Documentation License