అన్నము
వికీపీడియా నుండి
(అన్నం నుండి దారిమార్పు చెందింది)
అన్నం మనం సాధారణంగా రోజూ భుజించే ఆహారము. వరి ధాన్యం నుండి వేరుచేసిన బియ్యం నీటిలో ఉడికించి అన్నాన్ని తయారుచేస్తారు. పుట్టిన పిల్లలకు మొట్టమొదటి సారిగా అన్నం తినిపించడం తెలుగు వారు అన్నప్రాసన పండుగలాగా జరుపుకుంటారు.
[మార్చు] వండే విధానం
- సాధారణ పద్ధతి: కావలసిన బియ్యం తీసుకుని అవసరమైన దాని కంటే ఎక్కువగా నీరు పోసి పెద్దదైన గిన్నెలో ఉడికించాలి. బియ్యం ఉడికిన తరువాత, ఎక్కువైన నీటిని వంచేయాలి.
- అత్తెసరు పద్ధతి: కావలసిన బియ్యం తీసుకుని అవి ఉడకడానికి కావలసినన్ని మాత్రమే నీరు పోసి ఉడికించాలి. నీరు వంచాల్సిన అవసరం లేదు.
- కుక్కర్ పద్ధతి: కావలసిన బియ్యం తీసుకుని అవి ఉడకడానికి కావలసినన్ని మాత్రమే నీరు పోసి, కుక్కర్ లో ఉంచి నీటి ఆవిరి మీద నిర్నీత సమయంలో వంటసేసే పద్ధతి.